అన్నమయ్య కీర్తనలు

  కుమ్మరి దాసు చరిత్ర                                                                                                   - జి.బి.శంకర్ రావు

 
"కొండలలో నెలకొన్న కోనేటిరాయుడు వాడు
కొండలంత వరములు గుప్పెడి వాడు
కుమ్మరదాసుడైన కురువరతినంబి
ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు"


ఆ బాల గోపాలాన్ని అలరించే అన్నమయ్య సంకీర్తన ఇది! ఈ కీర్థనలో అనేక కధలున్నాయి. వాటిలో నిర్మల భక్తికి ప్రతీకగా నిలిచే కుమ్మరిదాసుడైన కురువనంబి యొక్క కధని తెలుసుకుందాం.

తిరుపతి నుండి తిరుమలకు వెళ్ళే కాలి మార్గంలో తలయేరుగుండు దాటిన తర్వాత కుమ్మరమండపమని ఒక ప్రదేశము కలదు.అక్కడ ఒక కుమ్మరిదాసుడు నివసించేవాడు. అతడు ప్రతిరోజూ వేంకటేస్వరస్వామి వారి నైవేద్యానికి ఉపయోగించే మట్టి కుండల్ని తయారు చేసి, వాటిని కొండపైకి పంపించేవాడు. స్వామివారికి ఒకసారి నైవేద్యం పెట్టిన కుండలు మరో సారి ఉపయోగించరు కాబట్టి ఆ కుమ్మరిదాసుడు ప్రతి రోజూ కొత్త కుండల్ని తయారుచేసే పరిస్థితి ఉండేది.


ఈ విధంగా పని ఒత్తిడి అధికంగా ఉండటం వల్ల అతడు రోజూ కొండపైకి వెళ్ళి స్వామి వారిని దర్శించుకోలేకపోయేవాడు. అందువలన ఆ కుమ్మరి భక్తుడు ఒక కొయ్య శ్రీనివాసమూర్తిని ఏర్పాటు చేసుకుని రోజూ తాను కూండలు చేయగా మిగిలిన బంక మట్టితో పుశ్పాలు తయారుచేసుకుని వాటితో స్వామి వారినిఅర్చిస్తూ ఉండేవాడు. ఇలా జరుగుతుండగా తిరుమలలో ప్రతీ రోజూ తొండమానుడనే రాజు బంగారు పుశ్పాలతో స్వామి వారి మూల మూర్థిని అర్చించేవాడు. కానీ మహారాజుకి తాను మాత్రమే బంగారు పుశ్పాలతో స్వామి వారిని అర్చిస్తున్నాననే అహంకారం ఉండేది.
 

ఒకరోజు ఆ రాజు స్వామి వారి చరణాలను బంగారు పూలతో అర్చిస్తుండగా బంగారు పుస్ష్పాలు పక్కకు జరిగి మట్టి పుష్పాలు ప్రత్యక్ష్యమయ్యాయి!. కారణం తెలియని రాజు బాధపడుతూ కొండ దిగుతుండగా మార్గ మధ్యంలో బంక మట్టి పుష్పాలతో కొయ్య శ్రీనివాసుని అర్చిస్తున్న కురువనంబి కనిపిస్తాడు రాజుకు. వెంటనే గుర్రం దిగిన రాజు కురువనంబి వద్దకు వెళ్ళి అతడి పాదాలపై పడి తన అహంకారాన్ని తొలగించుకుంటాడు. కురువనంబి వద్ద భక్తి రహస్యాలు తెల్సుసుకుంటాడు. ఈ కధ భక్తుల నిర్మల భక్తిని, స్వామి వారి అపార కరుణని తెలియ చేస్తుంది.

అందుకే మరో సంకీర్తనలో అన్నమయ్య ఇలా కీర్తిస్తాడు "కురువనంబి, తిరుమల కురువనంబి, నీ చరణములే కొలిచి బ్రతికె కిరీటము కల రాజు" అని కీర్తిస్తాడు.
 


జి.బి.శంకర రావు గారు:

జి.బి.శంకర రావు గారు గత పది సంవత్సరాల నుండి భక్తి, సంగీత, సాహిత్యాలలో రచనలు చేస్తున్నారు. వీరు భక్తి టి.వి.లో "తాళ్ళపాక వాణ్మయ వైభవం" అనే డాక్యుమెంటరీకి రచనా సహకారం అందిస్తున్నారు. వీరు శాంతా బయోటెక్స్ లో క్వాలిటీ అస్యూరెన్స్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. 


 
 

 

 
 

                మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
                                                          (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం

 గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)
 

 
 

 Copyright 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
                  సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.    
 Site Design: Krishna, Hyd, Agnatech