మనబడి కబుర్లు

-సత్యనారాయణ మూర్తి మధిర

 


2007 సెప్టెంబరు మొదటి వారంలో సిలికానాంధ్ర వ్యవస్థాపక సభ్యులలో ఒకరైన చక్రవర్తిగారు ఫోను చేసి సిలికానాంధ్రవారి మనబడి గురించి వివరించి, ఆనంద్ గారు పోర్ట్లాండ్లో కూడ మనబడి కార్యక్రమాలు ప్రారంభించమన్నారని చెప్పారు. విన్న వెంటనే నేను, శనివారమునాడు మనిద్దరము కలిసి తెలుగు వారి ఇండ్లకు వెళ్ళి వారి పిల్లలను ‘మనబడి’కి పంపమని అడుగుదామన్నాను. అనుకున్నట్లుగానే ఆ రోజు మధ్యాహ్నం నుండి రాత్రి ఆరు గంటల వరకు దాదాపుగా ఎనిమిది తెలుగు కుటుంబాలను కలుసుకొని వారి పిల్లలను ‘మనబడి’కి పంపమని ఆడిగాము. స్పందన అంతగా లేకపోయినా, ఎలాగయినా ‘మనబడి’ ప్రారంభించాలనీ, అయితే సెప్టెంబరు మూడవ వారానికి గాని ఇది సాధ్యపడదని నిర్ణయించుకున్నాము. అనుకున్నట్లుగానే సిలికానాంధ్రవారి మనబడి తెలుగు కార్యక్రమాలు సెప్టెంబరు 22న ప్రారంభించాము. కార్యక్రమాలను ప్రారంభించడానికి నా స్నేహితులు శ్రీ అజ్జరపు వివేక్ గారి కృషి శ్లాఘనీయమని చెప్పాలి. గ్రేటర్ పోర్ట్లాండ్ తెలుగు అసోసియేషన్ వారి సహాయ సహకారములు ప్రశంసనీయమయినవి.
 

10 మంది విద్యార్థులతో ప్రారంభమయిన మనబడి ప్రవేశం తరగతిలో మరో వారానికల్లా 15 మంది విద్యార్థులు తయారయ్యరు. మనబడి విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి శ్రి పెమ్మరాజు శ్రీరామారావు గారు, వారి సతీమణి శ్రీమతి భారతీరావు గారు ముందుకు వచ్చి తెలుగు అక్షరాలు, గుణింతాలు, ఒత్తులే కాకుండా పద్యములు, కథలతో పాటుగా అనేక విషయములు నేర్పి పిల్లలకు తెలుగు భాషను బాగా నేర్చుకోవాలన్న స్ఫూర్తిని నింపారనడంలో అతిశయోక్తి లేదు. అంతవరకు పిల్లలకు తెలుగు భాష అంతగా తెలియక పోయినా వారికున్న శ్రద్ధ వల్ల చాల బాగుగా భాషను నేర్చుకున్నారు. ఉగాది ఉత్సవాలలో ' ఋతువులు’ పాటకు అబినయించడమే కాకుండ స్వంతంగా పలికి తల్లిదండ్రులకు, ప్రేక్షకులకు ఆనందాన్ని చేకూర్చారు.
 

2007 - 08 ప్రవేశం తరగతి విద్యార్థినీ విద్యార్థులు

 


 

ఇక రెండవ సంవత్సరంలో, వారికి తోడుగా ప్రవేశం తరగతిలో ఆరుగురు విద్యార్థులు చేరితే, ప్రకాశం తరగతిలో కొంతమంది వేరే ప్రాంతాలకు వెళ్ళిపోగా 8 మంది విద్యార్థులు మిగిలారు. వారు భాష మీద మరింత పట్టు తెచ్చుకుని వారి వారి అమ్మమ్మలకు, తాతయ్యలకు ఉత్తరాలు తెలుగులో వ్రాయడం ప్రారంభించి అబినందనలు అందుకున్నారు. పిల్లలు ఇంతగా భాష మీద అభిమానం పెంచుకోవడానికి తల్లిదండ్రుల కృషి కూడ అమోఘం. అభిజిత్ ముదిగొండ, అనూష ముదిగొండ, తేజ ప్రక్కి, నవ్యత బుడ్డి, వెంకట్ దొడ్డపనేని, పద్మిని భాగవతుల ప్రకాశం తరగతి విద్యార్థినీ విద్యార్థులు కాగా ప్రియాంక సుసర్ల, రమ్య సుసర్ల, రమ్య అజ్జరపు, రోహన్ అజ్జరపు, రామ సోమయాజుల, నిధి వెదిరె, రుహిక ప్రసాద్, వైష్ణవ్ గుబ్బా ప్రకాశం తరగతి విద్యార్థినీ విద్యార్థులు. 2008 - 09 ప్రవేశం, ప్రకాశం తరగతుల విద్యార్థినీ విద్యార్థులు.


మనబడి గురించి ప్రకాశం విద్యార్థుల స్పందన (వారి మాటలలోనే):


రామ సోమయాజుల
- తెలుగు బడి ఎంతో బాగున్నది. కథలు, పద్యాలు నాకు బాగా నచ్చాయి.


రోహన్ అజ్జరపు - నాకు మనబడి చాల నచ్చుతుంది ఎందుకంటే మా ఉపాధ్యాయురాలు చాల బాగా పాఠము నేర్పిస్తారు. నాకు కథలు, పద్యములు చాల నచ్చుతాయి.


రమ్య అజ్జరపు - నేను తెలుగులో మా నాన్నగారి మేనత్తకు ఉత్తరము వ్రాయాలి అన్న కోరికతో నేర్చుకుంటున్నా. నాకు పద్యములు, కథలు, పొదుపు కథలు, సామెతలు అంటే చాల ఇష్టం.


వైష్ణవ్ గుబ్బా - మనబడి చాల మంచిగా ఉంది. నేను ప్రతిసారి తెలుగు లోని కొత్త పాఠాలు నేర్చుకుంటున్నాను. అందుకని నాకు మనబడి నచ్చింది.


ప్రియాంక సుసర్ల - నాకు కథలు చాల నచ్చాయి, పద్యములు కూడ ఇష్టం.


రమ్య సుసర్ల - నాకు వేమన పద్యములు నచ్చాయి


నిధి వెదిరె - నాకు తెలుగు బడి అంటే ఇష్టము.

రుహిక ప్రసాద్ - తెలుగు బడిలో చేరకముందు నాకు తెలుగు మాట్లాడడము తప్ప వ్రాయడం,చదవడం తెలవదు. మొదట్లో తెలుగు చదవడము, వ్రాయడము కష్టంగా వుండేది కాని మా ఉపాధ్యాయులు మంచి ఎగ్జాంపుల్స్ తో చెప్పడంతో నాకు ఇప్పుడు చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది. నాకు తెలుగుభాషలో గుణింతాలు మరియు పొడుపు కథలు
చాలా ఇష్టం.
 

ప్రవేశం తరగతికి శ్రీ జె.వి.రావుగారు, శ్రీమతి కవిత గారు, శ్రిమతి రేణుకగారు ఉపాధ్యాయులు కాగా శ్రిమతి నాగలక్ష్మి మథిర గారు ప్రకాశం తరగతి ఉపాధ్యాయురాలిగా ఉన్నారు.
 

  రచయిత పరిచయం

సత్యనారాయణ మూర్తి మధిర సిలికాన్ ఆంధ్ర పోర్ట్లాండ్ శాఖ మనబడి కన్వీనరుగాను, ప్రకాశం తరగతి ఉపాధ్యాయురాలికి సహాయకుడుగాను, అవసరమయినపుడు ఏ తరగతికయినా ఉపాధ్యాయునిగాను పని చేస్తుంటారు.
 

 

 
 

 

 
 

                మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
                                                          (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం

 గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)
 

 
 

 Copyright 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
                  సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.    
 Site Design: Krishna, Hyd, Agnatech