పద్యం - హృద్యం

 

     - నిర్వహణ:  రావు తల్లాప్రగడ

క్రింది "సమస్యని" అంటే వ్యాక్యన్ని యదాతధంగా ఒక పద్యంలోకి ఇమిడ్చి వాడుకుంటూ రాయాలి. ఒకవేళ పద్యం కాకపోయినా ఒక కవిత రాసినా కూడా వాటిని మేము సగౌరవంగా స్వీకరిస్తాము. మీ జవాబులు -మెయిల్ (విద్యుల్లేఖ) ద్వారాకాని (rao@infoyogi.com)  ఫాక్స్ ద్వారాకానీ (fax: 408-516-8945) మాకు ఏప్రిల్ 20 తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము

ఈ సారి రెండు సమస్యలను ఇస్తున్నాం. ఈ రెండికీగానీ, లేక ఏ వొక్క దానికైనాగానీ మీరు మీ పూరణలను పంపవచ్చు

మాసం సమస్యలు

1) ఆ.వె.|| " ఊరి మేయరయ్యె ఊరు మేయ"

2) సీ.|| "మంచోడు అనువాడు మహిలోన లేడయా మంచిచెడ్డలు రెండు మనకె యబ్బు"

క్రితమాసం సమస్య

 ".వె.|| ఒక్కసారి యివ్వు ఒక్క చూపు "

సమస్యకు వచ్చిన ఉత్తమ పూరణలు ఇలా వున్నాయి.

 

మొదటి పూరణయం.వి.సి.రావు, బెంగుళూరు

.వె.||  అడగకుండకూడ ఆదుకుంటివికదా

బడుగుపాపడైన ప్రాణసఖుని

అతనిపాటినేను అనిపింపకున్నాను

ఒక్కసారి ఇవ్వు ఒక్క చూపు

 

.వె.||   విశ్వరూపమెత్త విష్ణుండు సభలోన

మూర్చపడిరి అకట మూర్ఖులంత

అంధరాజు కృష్ణునార్తితో వేడేను

ఒక్కసారి ఇవ్వు ఒక్క చూపు

రెండవ పూరణ - మాజేటి సుమలత

.వె.||   బక్కచిక్కిబాగ ఆర్థిక రంగంబు

దిక్కులేక జనులు దేబులాడ

మ్రొక్కుచుంటి సిరుల మము కరుణింపంగ

ఒక్కసారి ఇవ్వు ఒక్క చూపు!

మూడవ పూరణ - కృష్ణ అక్కులు, శాన్ హోసే, కాలిఫోర్నియా

 

.వె||    మ్రొక్కెద నిను నీవె దిక్కని వెంకన్న

చెక్కు బుక్కుమరియు రొక్కములని

చిక్కు ప్రశ్న లేవి చిలిపిగ కోరను

ఓక్కసారి యివ్వు ఓక్క చూపు

.వె||    చిక్కు తెచ్చె బాల చక్కని నీనవ్వు

దిక్కు తోచ లేదె దిగదె మెతుకు

ముద్దు తోడ నాకు ముద్ర లేమి వలదు

ఓక్కసారి యివ్వు ఓక్క చూపు

 

.వె||    మాట తప్పి నాను మన్నించు శ్రీమతి

మందు త్రాగ నెపుడు మాట నమ్ము

కనుకరించి నిటుల కరుణతో నావైపు

ఓక్కసారి యివ్వు ఓక్క చూపు

నాల్గవ పూరణ - తల్లాప్రగడ, శాన్ హోసే, కాలిఫోర్నియా

.వె.||   ఇందుగలడు యందు ఎందైన గలడని

ఇల్లునంత విరిచి గుల్లచేయ,

దయ్యమొచ్చెగాని దైవంబు రాలేదు

ఒక్కసారి యివ్వు ఒక్కచూపు!

ఐదవ పూరణ- డా. అల్లూరి వెంకట నరసింహ రాజు,

.వె.||    లేకలేకపుట్టి ఈకుటుంబమునకు

వెలుగునిచ్చినావు తొలుత తండ్రి

నిదురపోకు గుండె కదిలించుమొకసారి

ఒక్కసారి యివ్వు ఒక్కచూపు

.వె.||    ఊరువిడిచి దూరతీరాలకేగినా

మరువగలమె నిన్ను మాతృమూర్తి

ప్రేమమీర మమ్ము పిలువవా ఒకసారి

ఒక్కసారి యివ్వు ఒక్కచూపు

.వె.||    గుండె చెరువుచేసి గొల్లున ఏడ్పించి

కన్నుమూసినావు కన్న తండ్రి

చివరికొక్కసారి చిరునవ్వు నవ్వవా

ఒక్కసారి యివ్వు ఒక్కచూపు

ఆరవ పూరణసుబ్రమణ్యం బత్తల, రోచెస్టర్ హిల్ల్స్, మిచిగన్

 వాలు స్ట్రీటు వారి వాలకమ్మును జూచి

            మెయిను స్ట్రీటు జనుల మతి చలించ

            సిరియు సంపదల నొసగు శ్రీదేవి చల్లంగ

            ఒక్క సారి యివ్వు ఒక్క చూపు.

 

            సిరులు చెల్లిపోయి తిరుపమెత్తెడి రీతి

            దిగజారు స్థితి బాపి దరిజేరు గతి జూపి

            మనిషి జేసిన మాయ మన్నించు కనుల

            ఒక్క సారి యివ్వు ఒక్క చూపు.

ఫిబ్రవరి సమస్యకు వచ్చిన మరొక్క పూరణ - డా. అల్లూరి వెంకట నరసింహ రాజు, ఏలూరు

 

.వె.|| ధవుడు ధనువు; నారి ధర్మపత్ని యతండు

కార్యసిద్ధికొఱకుభార్యకోర

వంగిలేచుచుంటకంగీకరించును

ఎంతవారలైన వింతవారె!

 

కవిత|| కొంతలోనకొంత గోప్యంబుగానైన

కార్యసిద్ధికొఱకు  భార్యచెంత శిరము వంచు

బయట శ్రీరామచంద్రుడే

ఎంతవారలైన వింతవారె!

 

 
 

 

 
 

                మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
                                                          (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం

 గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)
 

 
 

 Copyright 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
                  సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.    
 Site Design: Krishna, Hyd, Agnatech