రామాయణ రత్నాలు - సీత పరమపునీత

 

 

- విద్వాన్ టి.పి.ఎన్.ఆచార్య 

రామయణంలో రామునిపాత్ర కున్నంత ప్రాముఖ్యతని, సీత పాత్రకి కూడా కల్పించాడు వాల్మీకి. కనుకనే రామాయణానికి సీతా యాశ్చరితం అని కూడా మరో పేరు వున్నది. విశ్వమందలి పతివ్రతాశిరోమణులలో సీతది అగ్రస్థానం. త్యాగం, శీల సంపద, పాతివ్రత్యం శాంతి, క్షమ, సేవ, సదాచరం, నమ్రత, ధైర్యం వాక్పటుత్యం వంటి ఎన్నోగుణాలు మనకి సీతలో కనబడతాయి.

       కాంచనమృగ విషయంలో సీత లక్ష్మణునితో కాస్తకటువుగా మాట్లాడుతుంది. మానవస్త్రీగా సహజంగానే సీత ప్రవర్తన ఉన్నదనుటలో నిప్రతి పత్తిలేదు భర్తతో వనానికి వెళ్ళడం, పతిసేవ, మునిపత్నులతో సాహచర్యం, రావణునితో నిర్భయంగా మాట్లాడటం, మునులకోరికపై రాముడు రాక్షస సంహారం చేసేదననగా- రాక్షసులపై ఆ కారణ ద్వేషం ఎందులకు అని ప్రశ్నించడం, భర్తని తప్పఇతరుల శరీరాన్ని తాకను అని హనుమతో పలకడం, రావణుడు తీసుకోనివెళ్ళే సమయంలో సమయస్పూర్తితో నగలు ముట కట్టివేయడం, యుద్ధానంతరం హనుమ సీత వద్దకు వచ్చి నిన్ను బాధించిన ఈ రాక్షసస్త్రీలని చంపుతానుఅంటే విధేయానాంచదాసీనాం కఃకుస్యేద్వానరత్తదు భాగ్యవైషమ్య దోషేణపురస్తాద్దుష్కృతేనచ

 “ ప్రభువు ఆజ్ఞను ను పాటించుదాసీజనంవీరు. వీరిని చంపుటతగదు. దోషాలు అందరిలో ఉంటాయి రాముడు శక్తికలిగి ఉండి కూటా, ఇన్నాళ్ళు నన్ను రక్షించ కుండా వుండడం తప్పుకాదా రామునితో అరణ్యానికి రావాలన్నకోరికతో పురుషవేషంలో ఉన్న స్త్రీకిచ్చి మా తండ్రి వివాహం చేసాడు, అని రాముని గూర్చి పలుకుట నా దోషం కాదా లక్ష్మణుడు దోషరహితుడని అందరూ అనుకొంటారు అరణ్యవాసానకి వేళ్ళమన్న తండ్రిని దూషించటం లక్ష్మణుని తప్పుకాదా! రాముడు నన్ను చూచిరమ్మంటే నీవు లంకను కాల్చి వచ్చావు అది నీ దోషంకాదా! ఇలా అందరిలోను దోషాలు ఉన్నాయి. దోషాలు ఉన్నావారిని క్షమించడమే గొప్ప గుణం విధి బలీయమైనది. పాపానాంనాశుభానాంవాధార్షాణాంప్లవంగదు కార్యంకరుణమార్యణన కశ్చిన్నాసరాద్యతి అని సీత పలికిన పలుకులు ఆమే విజ్ఞతకి తార్కాణాలు.

      
అశోక వనంలో రావణుడు ఎంతచేదిరించి మాట్లాడినా, అతనిని గడ్డిపోచగాతలచి ధైర్యంగా జవాబు చేపుతుంది సీత. లోకలో నీకు మంచి చేప్పే వారే లేకా అని త్వంపునర్జంచుకః, సింహీమామిహేచ్చ సీదుర్గభాం!” నీవు నక్కవు, నేను ఆడసింహన్ని దుర్లభనైన నన్ను కోరుతున్నావు. ఇద నీకు తగదు అని అంటుంది. రాముని వద్దకు సీతను తీసికొనివేళ్ళగా లోకాపనాదుకు భయపడి నిన్ను నేను స్వీకరించను. నీ యిష్టమువచ్చిన చోటికి వేళ్ళి వుండు అని రాముని కఠోరవాక్యాలు విన్న సీత యిలా అంటుంది.

       రావణాంక పరిభ్రష్టందృష్టందుష్టేన చక్షుషా కథత్వాంపురాదద్యాం కులం వ్యపదిశనే మహత్ రావణుడు నిన్ను ముట్టుకొన్నాడు, దోషాదృష్టితో చూచేవాడు, అట్టినిన్ను ఎలా స్వీకరించను అనఇ కఠినముగా మటాడుతున్న రామునితో  “ ఆర్యా ! నేను పవిత్రురాలను, నాలో ఏదోషములేదు, నన్ను శంకించుట తగదు. అని దీనాతిదీనంగా వేడుకొంటుంది.

ఇంకా పృధకీ స్త్రీణాంపుచారేణంజా తింత్వంపరిశంకసే చేడునడవడి గల స్త్రీలు ఏ కొద్దిమందో ఉండవచ్చును. వారిని దృష్టిలో పెట్టుకొని స్త్రీ జాతినంతటిని సాదించుట మీకు తగదు. అని ఎంత బతిమాలినా రాముడు స్వీకరించడు. చివరికి అగ్నిప్రవేశం చేస్తుంది.  సీత. యధామేహృదయం నిత్యం నాససర్పరాఘవాతే నా మనస్సులో నిరంతరం శ్రీరామునే ద్యానిస్తూవున్న దానదైతే తధాలోకస్య సాక్షీమాం సర్వతః పాతుపాదనః లోకసాక్షి అయిన (గా) అగ్ని దేవుడు నన్ను కాపాడుగాక అని అగ్నిప్రవేశం చేసి, పరమపునీత సీతగా అగ్నిముత్రుని చే కీర్తించబడుతుంది.

              సీతను గూర్చి భవభూతి మహా కవి ఉత్తరరామ చరితను నాటకంలో యిలా అంటాడు

అగ్ని, గంగ, సీత (ఉత్పత్తి) పుట్టుకతేనే పవిత్రమైనవి. వీటికి వేరే బుద్ది అక్కరలేదు. అని ఉత్పత్తి పురిపూతాయాఃకిమన్యాః పాదనాంతరైః

అని కొనియాడబడిన సీత చరత్ర అపూర్వం, అద్భుతం, ఆదర్శప్రాయం. కొన్ని రామాయణాలుఇలాతేల్చేయి. సీత మండోదరి కుతురని, సీత లంకలో పద్మంలో జన్మించిందని. వీటిని గూర్చి కొంచేం తేలుసుకుందాం.

       కౌశికుడనే భ్రాహ్మణుజడు సంగీత విద్యసో నారదతాంబుకులకన్నా గొప్పవాడు. లక్ష్మిదేవి అతని సంగీతం విని అతనిని సత్కరిస్తుంది. ఆ పచసో నారదుడు లక్ష్మదేవి పరివారం చేత అదిలో నింపబడతాడు. అపుడు కోపంతో నారదుడు నీవు రాక్షసగుణంతో నన్నవసా చేవుకనుక, రాక్షస స్త్రీ బర్భాన జన్మిస్తావు. అని లక్ష్మిదేవిని శపిస్తాడు. ఇది పూర్వరంగం కొంతకాలం తరువాత దృత్సమీదుండు అనే బుషి లక్ష్మీ దేవిని కుమార్తేగా పొందదలచి, మంత్ర పూరితంగా ఒక కలశంలో పాలు పోసి లక్ష్మీ కళను ఆ కలశంలోకి ఆవాహన చేసి పూజిస్తువూంటాడు. రావణుడు పరగర్వంతో బుషులను హింసిస్తూ వారి శరీరం నుండి కారే రక్తాన్ని ఓ కలశంలో పెట్టి విజయచిహ్నంగా లంకకు తీసుకొనివేళ్ళి ఇది మహావిషం భద్రపరచుఅని మండోదరికిస్తాడు. దైవసంకల్పం వలన ఆ కలశం గృత్సవాదుడు సక్ష్మిని ఆవాహన చేసి ఉంచిన కలశమే. రావణుడు పరస్త్రీలతో కలసి వేరే ప్రదేశానికి ప్రవేశించడానికి వెళతాడు. ఈ చర్యకి మండోదరి బాధపడి మరణించదలచి, రావణుడు విషమని యిచ్చిన కలశంలోని రక్తంతో కూడిన పాలని తాగుతుంది. వేంటనే గర్భం దరిస్తుంది. భర్తకి తెలియకుండా బిడ్డని కని వేరే చోటపెట్టోలో పెట్టి భూమిలో వుంచుతుంది. ఆదీయే సీత. అని అద్బుత రామాయణం తెల్పుతుంది. ఇలా ఎన్నో విశేషాలు సీత గూర్చి ఉన్నాయి. కొన్ని మాత్రమే తెలుసుకున్నాం.

- విద్వాన్ టి.పి.ఎన్.ఆచార్య 

 


 
 

 

 
 

                మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
                                                          (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం

 గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)
 

 
 

 Copyright 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
                  సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.    
 Site Design: Krishna, Hyd, Agnatech