తెలుగు తేజోమూర్తులు

మానవతావాది, శ్రేయోభిలాషి - డాక్టర్ చంద్రశేఖర్ సంకురాత్రి

- ఈరంకి వెంకట కామేశ్వర్
ఒకప్పుడు జీవశాస్త్రవేత్త - ఒట్టావా లో హెల్త్ కనడా లో ఉద్యోగస్తుడు. 1987 నుండి ఆయన లోకోపకారి. వృత్తి, ప్రవృతీ, జీవితాసయం ఆంధ్ర దేశంలో నిరక్షరాస్యత నిర్మూలన, అంధత్వ నివారణ. చంద్రశేఖర్ సంకురాత్రి గారు అరవైయ్యవ పడిలో ఉన్నా కార్యాన్ముఖుడై, క్రమశిక్షణ, దీక్షతో ఆసయ సాధనలో ముందుకు సాగుతున్నారు. 2008 లో సీ ఎన్ ఎన్ చంద్రశేఖర్ గారిని సె ఎన్ ఎన్ " హీరో " గా గుర్తించింది.

డాక్టర్ చంద్రశేఖర్, మృదు స్వభావులు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కాకినాడ వద్ధ కురుతు గ్రామం లో కూతురి జ్ఞాపకార్దం శారదా విద్యాలయం నెలకొల్పారు. ఆయన నెలకొల్పిన నేత్రాలయం (శ్రీ కిరణ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓప్తాల్మొలొజీ) లో రోజుకి 150 పైగా నేత్ర శస్త్ర చికిత్సలు జరుపుతున్నారు. పాశ్చాత్త దేశాలకన్నా పదిరెట్లు యెక్కువన్నమాట. వేలాది మంది చూపు కోల్పోకుండా కాపాడుతున్న ఆదర్శ మూర్తి. ఒక శస్త్ర చికిత్సకి యాబై డాలర్ల కర్చు. ధాతల విరాళాలతో వైద్యం కొనసాగిస్తున్నారు. "ఒక్కోసారి ఈ నెల బిల్లులు ఎలా చెల్లించాలా అని అనుకున్నా ఎలాగో నెట్టుకుని రాగలుగుతున్నాము " అని చంద్రా గారు ఓ సారి ఉదాహరించారు.మళుపు తిప్పిన దుస్సంఘటన:

ఓ దుస్సంఘటన చంద్రశేఖర్ గారి జీవితాన్నే మళుపు తిప్పింది. జూన్ 23, 1985 లో కనడా నుండి లండన్ వెళుతున్న ఏర్ ఇండియా ఫ్లైట్ 182 ఐర్లాండ్ కోస్తా సమీపాన అట్లాంటిక్ సాగరం లో, బాంబు విస్పోటానికి గురై, కూలిపోయిన ప్రమాదం లో తన భార్య మంజరి, ఇద్దరు పిల్లలు - శ్రీ కిరణ్ (ఏడు ఏళ్ళు), శారద (నాలుగు ఏళ్ళు) లను కోల్పోయారు. (ప్రముఖ ఇంతర్జాతీయ చర్మ శాస్త్రవేత్త, నిపుణుడు యలవర్తి నాయుడమ్మ కూడా ఈ విమానం లోనే ప్రయాణిస్తూ ప్రణాలు కోల్పోయేరు).

ఈ హృదయం ద్రవించే సంఘటన సంభవించిన కొంత కాలానికి (మూడేళ్ళకి) కోలుకుని ఏదైనా మంచి పని చేయాలని సంకల్పించి, కృతనిస్చయుడై, జీవితానికి ఓ అర్ధం తెలుపుతూ, కనడా లో తన ఉద్యోగానికి పదవీ విరమణ చేసి (విద్యాబుద్ధులు నేర్పించడానికి) 1992 లో శారద పాఠశాల నెలకొల్పేరు. చదువుతో పాటు, క్రమశిక్షణ నేర్పుతూ, భోజనం, యూనిఫార్మ్, పుస్తకాలు, పాఠశాలకు వచ్చి వెళ్ళేందుకు బస్సు, ఆరోగ్య పర్యవేక్షణ (చెకప్), అవసరమైతే మందులూ అందిస్తున్నారు. ఇవన్నీ ఉచితం గా అందించడం విశేషం. చంద్రా గారి నిశిత దృక్కుకూ, నిస్చయ సంకల్పానికి ఇదో చక్కని ఉదాహరణ. " పిల్లలలోని ప్రతిభని వెలికి తీయాలంటే ముందు క్రమశిక్షణ, తరువాతే చదువు " దీనిలో రాజీ లేదు, సంప్రదింపులు అంతకన్నాలేవు (" నో కాంప్రమైజ్, నో నెగోసియేషన్స్ ") అని అంటారు డాక్టర్ చంద్రశేఖర్ గారు. సైన్స్ పాటాలు నేర్పుతారు కూడా. ఈ పిల్లలలోనే తన పిల్లలను చూసుకుంటూ ఆనందిస్తున్నా అని తన మనో గతాన్ని అభివ్యక్తం చేసారు. స్కూలు మానేసిన వారి సంఖ్య "బండి శున్నా"!!. గ్రామీణ వాతావరం లో ఇది దుశ్శధ్యమైనా శారదా విద్యాలయానికి సుసాధ్యమయ్యింది. దాదాపు 1,200 విద్యార్ధులు ఇప్పటి వరకు ఉత్తీర్నులైయ్యారు.


ఏడో తరగతి విద్యార్ధులలో ముగ్గురికి తొంబై ఐదు శాతం మార్కులు రాగా, కనిష్టం ఎనబై రెండు శాతమట. అధిక శాతం విద్యార్ధుల తల్లి తండ్రులు చదవటం, రాయడం రాని నిరక్షరాశ్యులే. అయినా విద్యార్ధులు తమ స్రద్ధాశక్తులతో, వారి చదువు చెప్పే గురువుల మార్గదర్శంతో ముందుకు సాగుతున్నారు. ఇది స్లాఘనీయ విషయమే. తన వంతు సహాయం అందిస్తూ, డాక్టర్ రామన్ ఫౌండేషన్ ఆరుగురు విద్యార్ధుల సంవత్సరిక అవసరాలకు అండదండగా నిలుస్తోంది.

చదువుతో పాటు - ఉద్యానవనం పెంచడం, చిత్రలేఖనం, కుట్లూ, యోగ, నృత్యం వంటి అంశాలలో కూడా శిక్షణ ఇస్తున్నారు. విద్యార్ధులకు వారాంకి రెండు సార్లు యొగా శిఖణా తరగతులు నిర్వహిస్తున్నారు; హెపిటైటిస్-బీ టీకాలు వేతున్నారు; సమాన్యముగా దొరికే సరుకులతో కళావస్తువులు, వృత్తులలో శిక్షణ ఇస్తున్నారు. క్రియా సీలక దృక్కుతోపాటు ప్రకృతి సహజ వస్తులను ఉప్యోగించుకునే సుగుణాన్ని కార్య రూపంలో, క్రియా రూపంలో నేర్పిస్తున్నారు. (నేడు దీన్నే " గ్రీన్ టెక్నాలజీ " భాగం గా అనుకరిస్తున్నారు). తూర్పు గోదావరి జిల్లా ఆదర్శ పాటశల (మోడల్ స్కూల్) గా గుర్తించబడింది. పిల్లలని తీర్చి దిద్దాలంటే చిత్త సుద్ధీ, క్రమ శిక్షణాలు ఉంటే కానీ ఇవన్నీ సాధ్య పడవు మరి!.

మెరుగైన ఆరోగ్య సేవలు అందించే నిమిత్తం తో అంధత్వ నివరణకు తోడ్పడే సంకల్పం తో నేత్రాలయం స్తాపించారు. ఆ శ్రీ కిరణాలే, ప్రపంచం లో వెలుగుని నింపుతున్నాయి. సుమారు 140,000 సుక్ల పటలం (కటరాక్ట్) శస్త్ర చికిత్సలు చేసారు. ఆంధ్ర గ్రామీణ జనావళికి - నేత్ర రోగ (ఆప్తాల్మొలజీ) సేవలు అందిస్తున్నారు. ఇప్పటి వరకూ దదాపు 13.5 లక్షల మందికి కంటి వైద్య సేవలు అందించారు. ఒట్టావా విశ్వవిద్యాలయం ఐ ఇన్స్టిట్యూట్ అనుబంధం తో ఎస్ ఐ ఓ డాక్టర్ శిక్షణా, నర్సుల శిక్షణలలో తోడ్పడుతోంది. కనడా లోని ఒట్టావా నగరవాసులు, అనేక పాఠశాలలు, విద్యార్ధులు ఏటా విరాళాలు అందజేస్తూ సహకరిస్తున్నారు.
సీ ఎన్ ఎన్ హీరో గా ఎంపిక:

అతి సమాన్యుడిగా మనుగడ సాగిస్తూ, అచంచల దీక్షతో కార్యాన్ముఖుడై ఆంధ్ర గ్రమీణ ప్రంతాలలో ప్రజానీకానికి విద్యా ఆరోగ్య సేవలు అందిస్తూ ప్రభావాత్మక మార్పుకు దోహదపడుతూ, చిన్నారుకలు విద్యాబుద్ధులు నేర్పిస్తూ నిరక్షరాస్యతని రూపుమాపే ప్రయత్నంతో పాటు అంధత్వ నివారణకు చేస్తున్న అసామాన్య కృషికి గాను ప్రముఖ వార్తా సంస్థ " సీ ఎన్ ఎన్ హీరో " గా ఎంపికైయ్యారు. ఆగస్టు 2008 లో సమాన్యులు కనపరచిన అసామాన్య కార్యాలను చిత్రీకరిస్తూ, డాక్టర్ చంద్రశేఖర్ సంకురాత్రి ని, ఆయన నెలకొల్పిన సంకురాత్రి ఫౌండేషన్, శారదా విద్యాలయం, శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి చేస్తున్న సేవలని లోకానికి చాటి చూపేరు. దీనితో ఆయన చేస్తున్న కృషికి, మరింత ఆదరణ లభించింది. ధాతలు, విరాళాలు కొంత వరకూ సులువైయ్యాయి కూడా!.


మంజరి సంకురాత్రి మెమోరియల్ ఫౌండేషన్ భారత గ్రామీణాభివృద్ధి, వికాశం, విద్యా, ఆరోగ్య రంగాలలో విశిస్ట కృషి కొనసాగిస్తోంది. శ్రీ కిరణాలు వెలుగు చూపుతూ, శరదా విద్యా కటాక్షం ప్రశాదిస్తూ, మరిన్ని సేవలు సమాయుక్తం చేయడానికి విశేష కృషి చేస్తున్నారు. ఉన్నత శిక్షణా తరగతుల (క్లాస్ 8 - 10) నెలకొల్పారు. ఎం ఎస్ ఎం ఎఫ్ సంస్థ నతాలీ ఈ పించ్ స్మృత్యర్ధం గ్రంధాలయం స్తాపించారు.
కొత్త పదకాలు, అవకాశాలు - ప్రభావక మార్పులు

గ్రామీణ ప్రాంతాల అవసరాలు దృష్టిలో ఉంచుకుని, మరో అడుగు ముందుకు వేసి అంధత్వ నివారణకు గాను "విజ్హన్ సెంటర్స్" ప్రారంబించారు. ఇవి ఆరు మండలాలలో నెలకొల్పేరు. ఈ కేంద్రాల ద్వారా ఇప్పటి వరకూ ఎనిమిది లక్షల మందిని పరీక్షించేరు. వ్యాదులు ముదరకండా ఆదిలోనే మెరుగైన వైద్యం అందించడం తో, జబ్బు నయం చేసి అంధత్వ నివారణకు దోహదపడుతోంది. దదైక భావం, సేవానురక్తి ఎంత ప్రగాడమైన ఫలితాలు అందిస్తాయో విదితమవుతోంది.

వృత్తివిద్యా పాఠశాల (వొకేష్నల్ స్కూల్) స్థాపన మరొక లక్షం - సామాన్య ప్రజలకు ఉపయోగపడే ఐదు కీలక రంగాలను ఎంచుకున్నారు. అవి - ఎలక్ట్రానిక్స్ రిపైర్, ఆప్తాల్మిక్ అస్సిస్టెన్స్, కుట్లు, మొటార్ సైకిల్ రిపైర్, కంప్యూటర్స్. నాన్ ప్రాఫిట్ సంస్థ ఆషా తమ వంతు సహాయం అందచేస్తోంది. ఇలా సమాన్యులకు ప్రయోజం చేకూరుస్తూ స్వయం ఉపాది సమకూర్చే ఈ పదకాలు మరిన్ని సత్ఫలితాలను అందిస్తాయని ఆసిద్ధం.మరపురాని విషాదం నుంచి తేరుకుని, జీవితపరమార్ధాన్ని తెలుసుకుని, పది మందికి ఉపకరించేల తీర్చిదిద్ధుకుని, జీవితాసయాలను సాదిస్తున్న కర్మ యోగి సంకురాత్రి చంద్రశేఖర్. జీవితాన్ని చదివిన ఈ జీవశాస్త్రవేత్త తలపెట్టిన మరిన్ని ప్రజాయుక్త ఆసయాలు సిద్ధించాలని మనస్పూర్తిగా ఆకాంక్షిద్ధం. ఒక పక్క విద్యా గుణాలని నేర్పి ప్రయోజకర విద్యార్ధులని తీర్చిదిద్ధుతూ, అంధకార ఛాయలు అలుముకున్న లక్షలాది కంటి రోగ గ్రస్తులకు వెలుగు చూపడమే జీవితాసయముగా కృషిచేస్తున్న సంకురాత్రి చంద్రశేఖర్ అభినందనీయుడు, ఆదర్శనీయుడు.


- ఈరంకి వెంకట కామేశ్వర్
 

 
     
 

 

 
 

                మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
                                                          (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం

 గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)
 

 
 

 Copyright 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
                  సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.    
 Site Design: Krishna, Hyd, Agnatech