తలుచుకుంటే మీ చేతిలో తూటును నేను
తుచ్ఛ నాయకులకు పోటును నేను
మీరెన్నుకునే నేతను, మీ ఐదేళ్ళ తలరాతను, అమ్ముకుంటే గుండె
కోతను నేను .
మీ గుండె గొంతుల మాటను, మీ జీవన వీణ మీటను,
మీ కలల మూటను, మీ భవిష్యత్తుకు బాటను నేను
మీ బతుకు రాతలు మార్చే కలాన్ని, మీ బలాన్ని నేను
మీ ఆశను నేను , ప్రజాస్వామ్యానికి శ్వాసని నేను
మీ కోపం నేను, మీ తీర్పుకి రూపం నేను
మీ కోసం నేను, వాడుకోకపోతే క్లేశం నేను
భయం వదిలి ఇళ్ళు కదిలి రండి ఓటేద్దాం
మనం కదిలి కుళ్ళు కడిగి ప్రగతికి రూటేద్దాం
ఓటంటే నోటు కాదు, అమ్మకండి నమ్ముకోండని చాటేద్దాం
మాటలతో మార్పు రాదు, ముందు మనం పాటిద్దాం
జనం గళం వినిపిద్దాం, జగం చెవులు రింగుమన సత్తా చూపిద్దాం.
రండి ఓటేద్దాం మన బాధ్యత
నిర్వర్తిద్దాం!
|