తెల్లవారు
నాలుగింటికి
మేడెక్కిన
పరదేశీకి
తెలియకుండానే
తలనొప్పిమొదలైంది
బ్రహ్మముహూర్తఁపు మంచు
నాగరాన్ని
ఆవారించి
పట్టణానికి మందలుఁ దోలిన మాయకు
పోటీకట్టింది
ముఱికి
తూముల కంపు
బట్టల్ని
ఆరదీయనుంది
ఆ బట్టలు దాచే
కక్కుర్తికిది మెఱుగా?
ఏమి?
రసికుల
కాలయాపనం
కాకుండా
అపరాత్రాన
మార్గశీర్షమారుతం
నక్కినక్కి
వీయసాగింది
బహుళపంచమిజ్యోత్స్నకు
నగరనక్తంచరగర్ధన
సుప్తావస్థుల
దుస్స్వప్నాలఁ
నర్తించింది
శతయుగాలకథలకు
సాక్షులైన
సప్తర్షుల
సాధకపిత్తం ఈ దృశ్యం
జీర్ణించుకోలేకుంది
పూచీలేదని
మంచువెనక దాగిన
ధ్రువుఁడు
సీమస్థితులను
కాలవ్రాయమని
కాలాన్ని కోఱాడు
ప్రాణాయామం
చేయబోయు వో యోగిని
పైప్రాణం పైకే
పోతుందనిపించి
విరమించింది
దూరాన...
ఎక్కడో...
గంగపైఁ
గోదారిపైఁ
పూలనావలలోఁ
డోలలూగే ఠాకూరు తిలకు ఆత్మలు
ఈ
నగరబాలల
కలుషితవర్తమానానికై
ఆ
కవితాత్మకతక్షిప్తభవిష్యత్తునకై
ఓ
లిప్తాకాలం
విలపించి
పరిత్యజించి
ఏ
అలక్ష్యపరుషుణ్ణో
ధ్యానించాయి
|