కవిత :  ఒకచోట ఉండనే ఉంది.

రచన: శైలజా మిత్ర

 


ఇపుడు మనిషిలో మనిషి లేడు
మస్తిష్కంలో ప్రపంచం లేదు
మనసులో ఆలోచనలు లేవు
ఉన్నదల్లా ఒక్కటే....
ఏ నిమిషంలో ప్రాణం పోతుందోననే ఆవేదన.....

ఇప్పుడు కులమతాలు లేవు
ఆశ, ఆశయాలు లేవు
ప్రయత్నం, మానవత్వంలేదు
కనబడుతున్నదల్లా ఒక్కటే...
తుపాకులు మోసుకొచ్చే తీవ్రవాదులతో ఆందోళన...

ఇప్పుడు హృదయాలలో స్పందన లేదు
ఆర్ద్రత, అనురాగం లేదు
అనుభూతి, ఆత్మీయత లేదు
ఎదురైయ్యేదంతా ఒక్కటే...
జనారణలో మానవమృగాల సంవేదన....


గూడు, గుండె లేదు
మసీదు, మందిరం లేదు
ఖుధాలేడు...భగవాన్ లేడు
వెంటాడుతున్నదంతా ఒక్కటే...
రక్తం రుచి మరిగిన రక్కసి మూకల తీరని తపన...

ప్రకృతి లేదు ప్రాణులు లేవు
పలకరింపు, పరామర్శ లేదు
గాలి, నీరు లేదు
మంచి , మమత లేదు
గుర్తువస్తున్నదంతా ఒక్కటే
బాంబుల దాడిలో ముక్కలైన మృతదేహాల వాసన...
 

అయినా
ఎక్కడో ఒకచోట వుంటుంది
ఒక పచ్చనిచెట్టే
పలచని నవ్వుతోనో...లేత కిరణంలానో
ఒక ఓదార్పు మెట్టు
ముగిసిపోయిన ప్రాణాలపై రాలే
ఒక కన్నీటి బొట్టు
ఒక సముద్రం...ఎగసిపడే కెరటం..
ఒక అరణ్య..భయభయంగా తిరుగాడే సింహం...
శిలలో మార్థవం..
గ్రీష్మంలో చల్లదనం...
నిదురపుచ్చే హస్తం...
అమ్మ ఒడిలో నిదురించేటంత వాస్తవం...

 

 

                మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
                                                          (Please leave your opinion here)

 
 
పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం

 గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)
 

 
     

      Copyright @ 2009 SiliconAndhra. All Rights Reserved.
                  సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.