కవిత :  ప్రణయ రాగం

రచన: తమిరిశ జానకి

 


దూరాన కొండపై
అల్లనల్లన సాగు
మేఘమాలికవా నీవు?

ప్రకృతి పరవశించగా
పలకరించవచ్చిన
వాన జల్లువా నీవు?
ప్రత్యూష కాలాన
ప్రసవించబడిన
హిమబిందువా నీవు?

మట్టిలో మొలకెత్తి
పచ్చగా విరబూయు
నవపరిమళమా నీవు?

వన్నెల రాత్రిలో
మురిపించి మెరిసేటి
నీలికడలివా నీవు ?


అలలపై నురుగులో
కదిలేటి నునుపులో
వెలిగేటి తెలుపువా నీవు ?


పున్నమి రేయి
పుడమిపుల కించవచ్చిన
నిండు జాబిల్లివా నీవు?


రంగులకే రూపమిచ్చి
అంబరాని కందమిచ్చు
సొగసుల హరివిల్లువా నీవు?
ఎవరునీవు? ఎవరు నీవు?


కనులు అరమోడ్పులై
కలల లోగిళ్ళలో
కను గొంటిలే నిన్ను కనుగొంటిలే
నా ఎదమీటిన
మధుర ప్రణయ రాగానివి నీవు
ఆలపిస్తూ నిన్ను
ఊహాలోకాన
చేరుకుంటానులే

 

                మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
                                                          (Please leave your opinion here)

 
 
పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం

 గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)
 

 
     

      Copyright @ 2009 SiliconAndhra. All Rights Reserved.
                  సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.