|
తెలుగు
సాహిత్యంలో అత్యంత ఆసక్తికరమైన వ్యక్తి మహా మహోపాధ్యాయ, కళా
ప్రపూర్ణ, కవి సార్వభౌమ, శతావధాని, గనాపాటి, కవి రాజు, కవి
సార్వభౌమ, కవి బ్రహ్మ, ఆంధ్ర వ్యాస, అభినవ శ్రీనాధ, వేద విద్యా
విశారద, ప్రసన్న వాల్మీకి, విశ్వ కవి - శ్రీ శ్రీపాద
కృహ్ణమూర్తి శాస్త్రి గారు. ఎవ్వరూ సాధించ లేని ప్రత్యేకతలు
వీరివి. రామాయణ, మహాభారత, భాగవతాలను యథాతదంగా తెలుగులోకి
రచించిన ప్రప్రధమ వ్యక్తి. తెలుగు అవధాన దారణకి సరికొత్త రూపు
అందించిన ఉద్దండ మహా పండితుడు శ్రీ చల్లపిళ్ళ వెంకట శాస్త్రి
గారు శ్రీ శ్రీపాద కృహ్ణమూర్తి శాస్త్రి గారి శిష్యులు.
చల్లపిళ్ళ గారి శిష్యులు శ్రీ విశ్వనాధ సత్యనరాయణ గారు, శ్రీ
వేటూరి ప్రభాకర శాస్త్రి గారు. ఇలా పాండిత్య పరంపరకు కూడా
ఆధ్యం పోసి తెలుగు రచనలకు సువర్ణ శకం అందించింది. శ్రీ శ్రీపాద
కృష్ణమూర్తి శాస్త్రి ఆంధ్ర దేశ ఆస్థాన కవి. శ్రీ శాస్త్రి
గారు అష్టావధానులు, శతావధానులు. లక్షల కొద్దీ పద్య రచనలు
చేశారు. నాడు, నేడు వీరి రచనలకు సరితూగు వారు లేరు. వారికి
వారే సాటి. యజ్ఞాలు, యాగాలు స్వయంగా నిర్వహించిన దిట్ట. కవితా
ధారణలో వారు అమృత హృదయులు.
తెలుగు నాట " బొబ్బిలి యుద్ధం " (1908) నాటకం తెలీని వారు
ఉండరు. ఇది శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారి సృష్టే (రచన).
గురజాడ గారి " కన్యాశుల్కం", బలిజేపల్లి లక్ష్మి కాంతం గారి
"హరిశ్చంద్ర " నాటకం, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారి "
బొబ్బిలి యుద్ధం" తెలియని వారు లేరు అని నిస్సందేహముగా
చెప్పవచ్చు.
దాదాపు వందకు పైగా రచనలు కావించారు. ఈ దరిమిలా లక్షకు పైగా
పద్య రచనలు చేశారు. తన ఎనభై ఐదవ ఏట, కేవలం నాలుగు నెలలో
మహాభాగవత గ్రంధం తెలుగులో రచించిన అపూర్వ మనిషి. కవి త్రయం
రచించిన మహాభారతం, కృష్ణమూర్తి శాస్త్రి గారొక్కరే 18 పర్వాలు,
ఏ సవరణలు లేకుండా తెనుగులో వ్రాసారు.
శ్రీ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు 1866 లో ఆంధ్ర ప్రదేశ్
రాష్ట్ర, తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం (నేటి
రాజమండ్రీ) లో శ్రీ వేంకట సోమయాజి, శ్రిమతి వెంకట సుబ్బ సోమి
దేవమ్మ దంపతులకు ఆశ్వీజ బహుళ షష్టి నాడు జన్మించారు.
విద్వాంసుల కోవలో పుట్టినందుకు బాల్యం నుండి స్రౌత స్మార్త
విద్యలు నేర్చుకున్నారు. కృష్ణ యజుర్వేదం క్షుణ్ణముగా
నేర్చుకున్నారు. బహుముఖ పాండిత్యంతో పాటు యజ్ఞ, యాగాలు
నిర్వహించే సమర్ధవంతులు. సంస్కృతంలో మహా పాండిత్యం ఉన్నా
మక్కువ తెలుగు భాష మీదే. తన రచనలలో సంస్కృతం బదులు తెలుగు
నిస్సంకోచముగా ఉపయోగించేవారు. ఆయన అమృత హృదయులు. ఎందరికో సహాయం
అందించారు. మరి కొందరికి పెద్ద దిక్కుగా నిలిచారు. అందరి
ఆదరణలు గైకొన్నారు.
శాస్త్రి గారి రచనా శైలి ఇది అని చెప్పటం కష్టం. ఎందుకంటే ఆయన
వ్రాయనిది అంటూ ఏమి లేదు. ప్రతి రచనలోనూ కొన్ని కొత్త
ప్రయోగాలు చేస్తూ అటు పురాణాలు, పద్యాలు, గద్యాలు,
వ్యాఖ్యానాలు - పాండిత్య ధోరణి, సమకాలీన విషయాలు, బాణి
సంతరించుకుని ఉంటాయి. అందుకనే వీరి రచనలు ప్రత్యేక ఒరవడితో
పాటు, సంస్కృతాంధ్ర లేస్య సబ్దార్ధ ప్రయోగాలతో పాటు, వ్యవహార
భాషా పదయుక్తమై ఉంటాయి. రచనలు దాదాపు వందకు పైగా రచనలు చేశారు కృష్ణమూర్తి శాస్త్రి గారు.
వీటిలో కొన్ని ముఖ్యమైనవి:
-
బొబ్బిలి యుద్ధం (1908)
-
యజ్ఞఫల నాటకము
-
వజ్రాయుధము (1925)
-
చెల్లపిళ్ళ వారి చెరలాటము (1936)
-
నైషదీయ చరితము (1941)
-
ఆయుర్వేదోషద రత్నాకరం
-
రామాయణం
-
మహాభారతం
-
మహాభాగవతం
-
శ్రీకృష్ణ స్వీయ చరితము
-
తిలకు మహరాజు నాటకము తిలకు మహరాజు నాటకము చలా వాసికెక్కింది.
కాశీనాధుని నాగేశ్వర రావు గారు స్థాపించిన " భారతి "
పత్రికలోనూ, వందే మాతరం (1907) పత్రిక, గౌతమి (1908)
ప్రభుద్దాంధ్ర (1922) పత్రికలలో అనేక సంకలనాలు చేశారు.
శాస్త్రి గారి బొబ్బిలి నాటకం దేశంలో బాగా ఆదరణ పొందింది.
కొంత కాలం క్రితం శ్రీ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి శత
జయంతి సంచిక, శ్రీ సద్గురు కే శివానంద మూర్తి ఆనందవనం
(భీంలి) అధ్యక్షతన విలువడింది. శ్రీ శాస్త్రి గారు ధన్యజీవులు. తొంభై పైబడ్డా ఉగ్రంధాలు
రచిస్తూనే ఉన్నారు. సభలు, సమావేసాలలో పాల్గొంటూనే ఉన్నారు.
ఇంతటి అసాధారణ ధారణ చేసిన వారు తెలుగు నాట ఎవ్వరూ లేరు.
తొంభై ఆరేళ్ళు జీవించారు. ఆంధ్ర సాహిత్య లోకంలో శ్రీపాద
కృష్ణమూర్తి శాస్త్రి గారి శీర్ష స్థానం అధిష్టించడానికి
దరిదాపులలో ఎవ్వరూ కానారారు అంటే అతిశయోక్తి కాదు. ఈ
పండితకవికి సాటి ఎవరూ లేరు.
|
|