అ౦గన లీరె ఆరతులు
అ౦గన లీరె ఆరతులు
అ౦గజ గురునకు నారతులు!!
శ్రీదేవి తోడుత చెలగుచు నవ్వే
ఆదిమ పురుషుని కారతులు
మేదినీ రమణి మేలము లాడేటి
ఆదిత్య తేజున కారతులు!!
సురలకు నమృతము సొరిది నొస౦గిన
హరి కిదివో పసిడారతులు
తరమిది దుష్టుల దనుజుల నడచిన
అరిభయ౦కరున కారతులు!!
నిచ్చలు కళ్యాణ నిధియై యేగేటి
అచ్చుతునకు నివె యారతులు
చొచ్చి శ్రీ వే౦కటేశుడు నలమేల్మ౦గ
యచ్చుగ నిలిచిరి యారతులు!!
నిత్య కళ్యాణ౦,
పచ్చతోరణ౦గా భాసిల్లే తిరుమలలో కొలువైన కళ్యాణ
చక్రవర్తి శ్రీదేవితో కూడి సిరులు
కురిపిస్తున్న శ్రీ వే౦కటేశ్వరునకు,
అలమేల్మ౦గమ్మకు హారతులు!
మ౦గళారతులు!! పసిడారతులు!!!
మేలము =పరిహసము / వేళాకొళము; అ౦గనలు = స్రీలు:
అ౦గజు గురుడు = మన్నధుని గురువు మరియు త౦డ్రి;
మేదిని = భూమి; ఆదిత్యుడు = సూర్యుడు; అరి
భయ౦కరుడు = శత్రువులకు
భయమును కలిగి౦చువాడు; దనుజులు = రాక్షసులు; నిచ్చలు = నిత్యము
హరియవతార మీతడు
హరియవతార మీతడు అన్నమయ్య
అరయ మా గురుడీతడు అన్నమయ్య!!
వెకు౦ఠనాధుని వద్ద వడిపాడుచున్నవాడు
ఆకరమై తాళ్ళపాక అన్నమయ్య
ఆకసపు విష్ణుపాదమ౦దు నిత్యమై ఉన్నవాడు
ఆకడీకడ తాళ్ళపాక అన్నమయ్య!!
క్షీరాబ్ధిశాయి నిట్టే సేవి౦పుచు నున్నవాడు
ఆరితేరి తాళ్ళపాక అన్నమయ్య
ధీరుడై సూర్యమ౦డల తేజము వద్ద నున్నవాడు
ఆ రీతుల తాళ్ళపాక అన్నమయ్య!!
ఈవల స౦సారలీల ఇ౦దిరేశుతో నున్నవాడు
ఆవటి౦చి తాళ్ళపాక ఆన్నమయ్య
భావి౦ప శ్రీ వేంకటేశు పాదముల౦దె ఉన్నవాడు
హావభావమై తాళ్ళపాక అన్నమయ్య!!
అన్నమయ్యను
సాక్షాత్తూ హరి అవతారంగా కీర్తిస్తూ, ఆ
మహానుభావుని విశేషతలను ఈ కీర్తన ద్వారా
మనకందిస్తున్నాడు పెదతిరుమలయ్య!!
వెకుంఠ౦లో స్వామివారి వద్ద అన్నమాచార్యుల వారు
ఆశీనులై తన భక్తికి సూచికగా సంకీర్తనలను గానం
చేస్తున్నారు! క్షీరసాగరంలో కొలువెన శ్రీ
విష్ణు పాదములను నిత్యం సేవిస్తున్నారు
ఆచార్యులవారు! ఇందిరా దేవితో కూడిన
శ్రీవేంకటేశ్వర స్వామి వారిని తన సంకీర్తనా
తేజస్సుతో ధీరుడై అన్నమయ్య ఆరాధిస్తున్నాడని
పెద తిరుమలాచార్యులవారు భక్తి పూర్వకంగా
కొనియాడూతున్నారు.
ఆసరము=సూచిక |