| |
ఫీల్డు
మారిందా..షీల్డు
గోవిందా…
పుడుతూనే తల్లిని పోగుట్టుకుంటాడు,
తండ్రి చీ కొడతాడు,,ఐనా
'బోరింగు'
పంపు లో నీళ్ళుతాగి
పెద్దవాడవుతాడు మన హీరో..'కోటీశ్వరుడి'(సినిమా
మొత్తం ఆయన కోటి గురించి చెబుతునే ఉంటాడు )
కూతురు,
ఈ హీరోని చూసి మనసు
'పారేసుకుంటుంది'.
ఇంక వెంటనే పాట
'ఫారిన్
లొకేషన్' లో….ఐన
వెంటనే ఒక చేసింగు సీను..ఫైటింగూనూ…కట్
చేస్తే..హీరోయిన్
ని ఎక్కడికో పంపేస్తారు వాళ్ళ కసాయి తండ్రి.ఐనా
వెతుక్కుంటూ వెళ్ళి తుక్కు కింద కొట్టి హీరోయిన్ ని తనదానిగా
చేసుకుంటాడు 'బికారి'
హీరో..సారీ
సినిమా పేరది నేనేం చెయ్యను.మీ
అభిమాన హీరో నటించిన "బికారి"
(తనతో సినిమాలు
తీసిన నిర్మాతలకి ఆత్మశాంతి కోసం హీరో సజెస్టు చేసిన పేరది)
ఇది మరో కధ:
హీరో అడుక్కుతింటూనే
ఐ ఏ ఎస్ పాసయి వాళ్ళ వూరికే కలెక్టర్ గా వస్తాడు..తను
అడుక్కుతినే వాడిగా అవడానికి కారణమైన వాళ్ళమీద రివెంజి
తీర్చుకుంటాడు..
ఇది ఇంకో కధ:
పోలీసు ఆఫీసరైన మన
హీరోగారు..
చండ ప్రచండమైన విలన్ గాంగుని నామ రూపాల్లేకుండా కాల్చి అవతల
పారేస్తాడు..మిగిలిన
వాళ్ళు ఆయన కంట్లోని ‘అగ్ని‘కి
ఆహుతైపోతారు..
మూటలు మోసే ఒక
'మేస్త్రీ'
తన 'స్వయంకృషి'తో
ఎంచక్కా లేబర్ మినిస్టరైపోయి చాలా మంది బాక్స్ ఆఫీసులు
బద్దలుకొట్టేస్తారు..
ఒక గొప్ప ఖాను గారు
'లగాను'
రద్దు కోసం ఇంగిలీషు
వాళ్ళతో యాభై ఓవర్ల క్రికెట్టు మాచులు (పాపం
అప్పట్లో అరవై ఓవర్లుండేవని మర్చిపోయి),
మాచు గెలిపిస్తాడు
మరో ఖాను గారేమో ఏకంగా "చెక్క"
బాటులు పట్టుకున్న
అమ్మాయిలకి హాకీ నేర్పించి "చక్
దే" ఇండియా
అని స్ఫూర్తి నింపుతాడు..
పెద్దన్నయ్యలని అదే
నండీ 'బిగ్గు
బ్రదర్లని'
చూసి పొడుగుకాళ్ల సుందరి శిల్పా సెట్టి కూడా ఆ జాబితాలోకి చేరి ఐ
పీ ఎల్ లో జట్టు కొనేసింది …
ఏతా వాతా
చెప్పొచ్చేదేంటంటే సినిమాల్లో ఏదైనా చెయ్యగల స'మర్ధు'లైన
మన హీరోలు!
ఇతర రంగాల్లో నెగ్గుకు రావడం కొంచెం కష్టమైన పనే అని అర్ధం
అవుతోంది.
రాజకీయాల్లోకి వచ్చిన 'స్టార్లు'..క్రికెట్టు
లో డబ్బు పెట్టిన 'స్టార్లూ'
పాపం కాలం కలిసి రాక
ఇమేజి డామేజి అయి ……….తీసుకున్న
నిర్ణయం …ఫ్లాపు
సినిమా అయి,
ప్రస్తుతం డౌట్ ఆఫ్ ఇండియా తో ఉన్నారు…
మన ఫీల్డు ఏల్దాం
బాసు మనకెందుకు పక్కోడి గోల..అవన్నీ
చూసి ఆనందించాల్సిందే కానీ చేసి కాదు..
డబ్బా లు
తిరిగొచ్చాక క్లైమాక్సు మారిస్తే ఏం లాభం..
సినిమా అనేది కేవలం
వినోదం కోసం మనం తయారు చేసుకునే కధ.
అక్కడ హీరో ఇమేజి
కోసం కధ మొత్తాన్నే మార్చేసే రైటర్లు,
హీరో గారికి భయపడి
నెక్లెస్ రోడ్డులో తీయాల్సిన సీను న్యుయార్కులో ప్లాన్ చేసే
ప్రొడ్యూసర్లు,
హీరో ప్రాపకం కోసం
చిటికేస్తే సూమోలు పేల్చే డైరెక్టర్లు,
ఎంత వయసు వాణ్ణైనా
ప్రేమించినట్టు వెనకపడి,
హీరో సార్ సో గ్రేట్
అని పొగిడే బొంబాయి భామలు,
ఏ స్టెప్పు
రాకపోయినా అబ్బ పాంటు పైకి లాక్కునే స్టెప్పు అదరగొట్టాడు హీరోబాబు
అంతూ ఊదరగొట్టే కొరియోగ్రాఫర్లు...ఎప్పటికైనా
మా హీరో సూపర్ అంటూ టికెట్లకోసం కొట్టుకునే అభిమానులూ ఉంటారు,
కాబట్టి సినిమాలో
ఒకే, నిజ
జీవితంలో కూడా ఆ బాంబే విలన్ ని ఎదురుగా నిలబడి నెగ్గుకురాగలరా మన
హీరోలు..అది
కారెక్టర్ మాత్రమే..
అక్కడ ఏదైనా
చెల్లుతుంది..మనం
చేసిన 100
పైచిలుకుసినిమాల్లో ఎన్ని జనానికి నచ్చాయి,
నిజంగా ఎన్ని ఆడాయి
లెక్కేసుకుంటే మన సత్తా తెలుస్తుంది..తరువాత
అవతల ఫీల్డులోకి దూకచ్చు,
ప్ర్స్తుతం ఉన్న
ఫీల్డులో షీల్డులొదిలేసి..అర్ధాంతరంగా
వేరే ఫీల్డు వెతకడమెందుకు..దండగ..
రెండు గుర్రాల మీదా
స్వారీకి ప్రయత్నిస్తే..ఉన్న
పొజిషన్ గోవిందా..
|
|