|
సీ||
గుండెలోతుననుం
డి మండేటి మాటది, కల్లలే యెరుగనో తల్లిమాట!
తనుతప్పు కాదనీ, తతిమానె తప్పనే, చప్పునే చెప్పేటి చెప్పుదెబ్బ!
అన్నేసి
మోసాల
అలవాటు
యట్టిది,
తమనుతామైనా
వదలనె
లేరు!
వంచనాయిది
ఆత్మవంచన
యగుకాని,
తమకు
తామె
యవగతంబుకారు!
సీ||
ప్రతివాడు చెప్పును జతగాడు తప్పనీ, తనుమాత్రమే ఒప్పు తప్పదనుచు!
అలవాటు అయిపోవు నాత్మవంచన యిట్లు, ఆశ్చర్య మెయ్య
దే అసలు మనకు!
నప్పినా లేకున్న నమ్ముతాం మనలనే, సబబు నేనే నంటు సభల చెప్పి!
మంచోడ్ని నేనంటు వంచకుల్ మీరంటు, చంకలన్ కొట్టకోయ్ ఇంకనీవు!
సీ||
నిస్వార్ధమనుమాట
నిజముగా
లేదయా,
ఎటువంటి
స్వార్థం
బ నుటయె
తప్ప!
సంఘసేవలుజెయ్యు
సంస్కర్త
కోరడా,
కొద్దిపాటే
నైన
కొంత
పేరు!
విరివిగా
దానాలు
వెదజల్లు
దాతలు,
గుర్తింపు కోరరా
గుట్టునైన
?
స్టేజెక్కి మాటాడ మోజున్నవారంత, చప్పట్ల దుప్పట్లె కప్పుకోను!
సీ||
డాక్టరైనను
కాని
యాక్టరైనను
కాని,
ప్రతి
నేత
కూడాను
ప్రజల కొరకె,
నిస్వార్థమందురు,
ఆస్వాదమందురు,
స్వస్వార్థమేదియు
వలదుయంచు!
కోరికే
లేకుండ
ఊరికే
ఎవరు
ఏ,
పనినిచేయరు,
మాట
వినుము
కాస్త!
తినితాగి
పద్యాలు
తేరగా
చేప్పేటి
నన్ను
కూడా
నువ్వు
నమ్మబోకు!
సీ||
ఒప్పేది కాదంటు చెప్పుతా
వినవయ్య,
చెడుకొంత
వుండును
నడుమనెపుడు!
మనకునచ్చినవాడె
మంచివాడంటాము,
నచ్చకుంటే
వాడు
చచ్చువెధవె!
ప్రతిమంచి
వాడిలో
ప్రతిచెడ్డవాడిలో
,
మంచిచెడ్డల
పాళ్ళు
పొంచుకాన,
మంచోడు
అనువాడు
మహిలోన
లేడయా
మంచిచెడ్డలు
రెండు
మనకె యబ్బు!
సీ||
గుళ్ళోన
జపియించ
కూర్చున్న
ప్రతివాడు
వేల్పునేమడగక
వెడలిపోడు!
తలదన్ని
అన్నియూ
వలదన్ను
వారంత
,
ఆత్మ
సంతృప్తంటు
ఆశ
పడగ,
సర్వమూ
మిధ్యనే
సన్యాస
పురుషులూ,
పరమ
ఆనందమే
వరమునడుగ,
భగవానుడైనాను
భక్తులన్
కోరేడు,
అవతారమంటూనె
అవధరించె!
సీ||
నీ
నిజం
నైజంబు,
నీముందె
దాచేవు,
లేకుంటె
భరియించ
లేవు
నీవె,
ఇంప్రెషన్
పోవును,
డిప్రెషన్
వచ్చును,
నీమీదసహ్యంబు
నీకె
వచ్చు!
నువు నీ నిజంముందె, నుంచోగలుగు నాడు
,
నువు యోగి వవుతావనూహ్య మయ్యి!
అందరూ
కాలేరు
ఆయోగి
పుంగవుల్,
ఒప్పుచూ ఆమాట చెప్పు చాలు!
|