పద్యం-హృద్యం

                                                  -నిర్వహణ- తల్లాప్రగడ రావు

 


"సమస్యాపూరణం:

క్రింది "సమస్యని" అంటే వ్యాక్యన్ని యదాతధంగా ఒక పద్యంలోకి ఇమిడ్చి వాడుకుంటూ రాయాలి. ఒకవేళ పద్యం కాకపోయినా ఒక కవిత రాసినా కూడా వాటిని మేము సగౌరవంగా స్వీకరిస్తాము. మీ జవాబులు -మెయిల్ (విద్యుల్లేఖ) ద్వారాకాని (rao@infoyogi.com)  ఫాక్స్ ద్వారాకానీ (fax: 408-516-8945) మాకు జులై 20 తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము

 

ఈ సారి రెండు సమస్యలను ఇస్తున్నాం. ఈ రెండికీగానీ, లేక ఏ వొక్క దానికైనాగానీ మీరు మీ పూరణలను పంపవచ్చు

 

వేదుల బాలకృష్ణమూర్తి, గారిచ్చిన ఈ  మాసం సమస్యలు

తే.గీ.|| సకలసంపదలుండియు చాల పేద

.వె.|| బుద్ధి లేని వాడె బుధవరుండు

 

క్రితమాసం సమస్యలు

.వె.|| చదువు లేక బ్రదికె చక్కగాను

కం.|| మగనిని కొట్టిన మగువయె మంచిది ఇలలో

 

సమస్య లకు వచ్చిన ఉత్తమ పూరణలు ఇలా వున్నాయి.

మొదటి పూరణ కట్టా గిరిజా రమణ

కం||     తగవాడక తనువాడక
వగపులు చూపక నిరతము వంచన మదిలో
పగరేపక వలపులతో
మగనిని కొట్టిన మగువయె మంచిది ఇలలో
 

రెండవ పూరణ - కంది శంకరయ్య, వరంగల్

ఆ.వె||.   వృత్తివిద్య నేర్చి వెతలన్ని పో(ద్రోచి
          సతిని సుతుల( బెంచి సౌఖ్యమందె.
          బ్రతుకు తెరువు( జూపరాని యీ వ్యర్థంపుర్థంపు
          చదువు లేక బ్రతికె చక్కగాను.కగాను.

 కం.||     తగని ప్రవృత్తిని లోకం
          బెగతాళి యొనర్ప బ్రతుకు హీనము కా(గా
          తెగ త్రాగి గొడవ చేసెడిచేసెడి
          మగనిని కొట్టిన మగువయె మంచిది యిలలో.యిలలో.

మూడవ పూరణ -   కృష్ణ అక్కులు
కం
||      పగలు నిదరోయి రాత్రులతెగ తాగి
             గొడవలు
జేసి తెంపరి వోలెన్
             దిగులు
విడిచి ఊరు  తిరుగు 
              మగనిని
కొట్టిన మగువయె మంచిది మహిలో

కం||      వగలు కురిపించి వలచెడు
                   మగవుల
చేరుట తగదని మగడికి తెలపన్
                       పొగరుగ
తిరుగుడు మానని
                మగనిని
కొట్టిన మగువయె మంచిది మహిలో

కం||      సొగసుగ నవ్వులు రువ్వుతునగలను
                     కొనమని
వలచిన నారి తెలుపగా
                    దిగులుగ
కాదని చెప్పిన
                    మగనిని
కొట్టిన మగువయె మంచిది మహిలో 

.వె||   పరుగులే ధనమని పదహారున ప్రతిన
                   బూని
టెండులకరు మాని నటుల
                   పాఠశాల
చేసె పదివేల పరుగులు
                  చదువు
లేక బ్రతికె చక్క గాను 

.వె||   పాటె నాకు బ్రతుకు బాటని కాలేజి
                  విడచి
యస్పి బాలు నడక మార్చి
                  చలన
చిత్రమందు కలకల వెలుగుచు
                  చదువు
లేక బ్రతికె చక్క గాను   

నాల్గవ పూరణ - యం.వి.సి.రావు, బెంగుళూరు,

ఆ.వె.||   లూత ఏమి చదివె భుజగంబు చదువేమి

ఏనుగు చదివింది ఎంతవరకు

పరమ శివుని చేర భక్త కన్నడొకడు

చదువు లేక బ్రతికె చక్కగాను

 

కం||      జగముల నేలెడు పతితో

జగడములాడంగ సత్య జవ్వన పటిమన్

నగవుల చూపుల జడతో

మగనిని కొట్టిన మగువయె మంచిది ఇలలో

 

ఐదవ పూరణ- సుబ్రమణ్యం బత్తల, రోచెష్టెర్ హిల్ల్స్, మిచిగన్

కవిత||   మగని ముందు చూపు మనసార పాటించి

          కష్ట నష్టముల నెల్ల నిష్టతో నోర్చి

          సంతు నెల్లర చదివించి మా అమ్మ

          చదువు లేక బ్రదికె చక్కగాను.

 

కనులు లేని శివుడు కానలేడనుచు

కానలనందున తిరుగు కోయరాజు

కనుల నొసగి తాను కైలాస మేగి

          చదువు లేక బ్రదికె చక్కగాను.

 

          తాళి గట్టిన వాడు తన్ను తా మరచి

          తప్పు దారులు పట్టి తలకు మించిన నాడు

          మనసు మార్చునటుల మంచి మాటల తోటి

          మగని కొట్టిన మగువ మంచిదీ యిలలోన
.        
   

          మధువు మదిరలతోడు మత్తులో మునిగి

          మాన ధనముల నోడి మరియాద వీడి

          మగవాడి ననుచు మిడిసి పాటును జూపు

          మగని కొట్టిన మగువ మంచిదీ యిలలోన.        

 

ఆరవ పూరణ- పుల్లెల శ్యామసుందర్, శాన్ హోసే,

కం|| తగదని చెప్పిన వదలక
               సొగసరి
నీవనుచు తనను చెంతకు పిలవన్
                పగలగ
చెంపది సోదరి
                 మగనిని
కొట్టిన మగువయె మంచిది ఇలలో

          కం||  జగడములాడ సరసముగ
                 సిగలో
పూదండ కదలి సొగసుగ ఒడిలో
                తెగిపడిన
మల్లె పూలతొ
                 మగనిని
కొట్టిన మగువయె మంచిది ఇలలో

 

ఏడవ పూరణ - వేదుల బాలకృష్ణమూర్తి, శ్రీకాకుళం

ఆ.వె|| అక్షరములురాని అని తజ్జి తాతకు

పిల్లలు పదిమంది పేరుగాంచి

భోగభాగ్యములును పూర్ణ ఆయువుగల్గి

చదువులేక బ్రతికె చక్కగాను

 

కం.|| మగువ ఒకతె నాటకమున

మగనిని తీర్చంగ మంచిమాటలు చెప్పన్

మగడు తనను కొట్టగ ఆ

మగనిని కొట్టిన మగువయె మంచిది ఇలలో

 

 

ఎనిమిదవ పూరణ - తల్లాప్రగడ, శాన్ హోసే

ఆ.వె||    చదువులేల నాకు చంకనాకను యని

చింతపండు అమ్మె సంతలోన!

ఎట్టి చదువు లిచ్చు నట్టిధనములంచు,

చదువులేక బ్రతికె చక్కగాను

 

కం.||     వగలాడికి ఏలనయా

నగలూ నట్రా? తనపతి నచ్చెను మెచ్చెన్!

సొగసున యటులనె యా  పర

మ  గనిని కొట్టిన మగువయె మంచిది ఇలలో

(దయచేసి పరమ-గని అని చదవండి... పర-మగని అని కాదు)

 

 

తొమ్మిదవ పూరణ- నూతక్కి రాఘవేంద్రరావు (మే నెలలో ఇచ్చిన సమస్యకు పూరణ పంపారు)

కం.||     టక్కుల శూర్పణఖాఖ్యకుఁ

జెక్కఁగ ముక్కునుఁ జెవులనుఁ జిట్టచివరికిన్

చిక్కని తన రుధిరముఁ గని

                   రక్కసి యయ్యెను పరారు రక్తంబనుచున్!

 
 

 

 
     

 మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

   
పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech