|
సీ.|| విశ్వసించుము నిన్నె, విశసించు విమర్శ-- విలసిల్లుమెచటైన
వీలు చూచి!
ఆవేశ వేసంగి ఆదేశ మిటులనే, ఏదేశ మందైన ఆశ నిలుపు!
ఏదేశమేగినా ఎందు కాలిడినాను, పొగడరా నీ తల్లి భూమి నెపుడు!
నిలుపరా నీజాతి నిండు గౌరవమును, తెలుపరా నీ భాష తెలుగె ననుచు!
ఆ.వె.|| మంచి పనిని చేయ మనసున్న చాలును
దేశమేది యైన శ్వాశయొకటె!
ఆశ మనసునుండు దేశానకాదనే
రశ్మి చీల్చు నిశిని రామచంద్ర!
స్వాతంత్ర్య
పోరాటం
ముమ్మరంగా
సాగుతూ వుంటే
గాంధీ
మహాత్ముడు
విదేశాలనుంచీ
మన దేశానికి
తిరిగి వచ్చిన
రోజులవి.
ఆయనని
చూచి
మీరే
నాయకత్వం
వహించి
మనకు
స్వతంత్ర్యం
సంపాదించిపెట్టమని
కొందరు
అడుగుతుంటే,
మరికొందరు--
మనకి
నాయకత్వం
వహించడానికి
దేశం
గొడ్డుపోయిందా
ఏమి,
ఇలా
బయట నుండి
వచ్చిన వాడిని
మార్గదర్శకులుకండీ
అని
అడగడానికి,
అంటూ
నవ్వుకున్నారట.
మన
సమస్యలు
మనకు
తెలుసుగానీ
ఇలా
ఇప్పుడే
వూడిపడ్డ
అపరిచితుడికేమి
తలుసునని
అనుకున్నారట.
నిజమే
భారత
స్వాతంత్ర్య
సమర పోరాటానికి
ఎందరో
సామాన్యులు
వున్నారు,
ఎందరో
సామర్ద్యులూ
ఉన్నారు.
కానీ
మహాత్ముడు
ఒక్కడే.
ఆ
మహాత్ముడు
ఒక
విదేశీయాటన
చేసినతరువాతే,
సౌత్
ఆఫ్రికాలోని
భారతీయుల
పరిస్థితి
చూసి
జాలిపడడం
జరిగింది.
వారికి
ఒక
నాయకుడయ్యే
అవకాశం
కలిగింది.
ఆ
తరవాత
భారతదేశం
తిరిగి వచ్చాక
ఒక
ఆత్మానుభవం బహిర్గతమయ్యింది.
ఆ ఆత్మవిస్వాసం ఒక
జాతిని
ముందుకు
నడిపే
స్థైర్యం,
ధైర్యం
ప్రసాదించింది.
ఒక
మహాత్ముడిని
తయారుచేసింది.
దేనికైనా
అనుభవం
ముఖ్యం.
అనుభవం,
అవకాశం,
ఆత్మవిస్వాసం,
మనోనిగ్రహత,
ఏకచింతన,
కార్యశీలత,
క్రమశిక్షణ
వంటి
లక్షణాలు
కలిస్తేగానీ
అసాధ్యం
సుసాధ్యం కాదు-
ఓక
మంచి
నాయకుడు
పుట్టడు.
ఇవన్నీ
మనదేశంలోనే
పుట్టి
పెరిగినవారి
వద్దకూడా
వుంటాయన్నడానికి
అనేక
ఉదాహరణలను
ఇవ్వవచ్చు.
నిజమే!
అలాగే
మనకున్న
జనంలో నించీ
పైకి
వచ్చే
అవకాశాలు కూడా
తక్కువే.
అలా
తక్కువ
అవకాశలున్నవారు
బయటి
దేశాలకు
వెళ్ళి
తగిన
అనుభవ
జ్ఞానం
సంపాదించుకు వస్తే,
వారిని
తక్కువగా
అంచనా
వెయ్యడం
మాత్రం
తప్పే.
ఇప్పుడు
వాడు
మన
పక్కింటి
సూరిగాడు
కాడు,…
ఈ నాటి సూర్యుడు.
మనకి
కొత్త వెలుగులను
ప్రసాదించగలడు.
మన
గాంధీకూడా
అలాగ
వృద్ధి చెందిన
వాడే.
ఒక్క
గాంధీయేకాదు,
ఒక
సుభాస్
చంద్రబోసేగానీ,
ఒక
పటేలుగానీ,
నెహ్రూ
గానీ,
రాజీవు
గాంధీగానీ,
లేక
ఈ
నాటి
సినిమా తారలుగాని
అందరూ
బయట
దేశాలకెళ్ళి
ఎంతో కొంత
అనుభవం
సంపాదించుకొని
వచ్చి
తమ తమ
స్థానాలలో
ఎంతో
ప్రగతి
సాధించి,
మనలను
ముందుకు
తీసుకెళ్ళారు.
అంతవరకెందుకు,
ఆంధ్రదేశంలో
పుట్టవలసిన
సిలికానాంధ్ర
అమెరికా
వెళ్తేగానీ
పుట్టలేకపోయింది.
సిలికానాంధ్ర
నాయకులంతా
అంధ్రులే,
కానీ
తెలుగునాట
వారికి
అలా
సంస్థను
స్థాపించే
ఆలోచనకానీ
అవకాశంకాని
రాలేకపోయింది.
రెండు
సంవత్సరాల
క్రితం
అన్నమాచార్య
ఉత్సవాలను
100
కేంద్రలలో
సిలికానాంధ్ర
నిర్వహిస్తుంది,
సహాయం
చెయ్యండి
అని
అడిగితే,
అనేకులు
నవ్వారు.
ఇక్కడ
అమెరికాలోలాగా
పనులు
జరగవు,
మీకు
ఏమీ
తెలియదన్నారు.
అలాగే
ఈ
సంవత్సరం
లక్షగళ
సంకీర్తన
చేస్తామంటే,
మేము
చేయలేని
పని
మీరెట్లా
చెయ్యగలరు
అన్నారు.
కానీ
మనకులేనిది
వారికున్నది
అనుభవం
అని
మరచారు
ఆ
పెద్దలు.
అనుభవం,
ఆత్మవిస్వాసం,
మనోనిగ్రహత,
ఏకచింతన,
కార్యశీలత,
క్రమశిక్షణ
వుంటే
సాధ్యంకానిది
ఏదీ
లేదు.
ఇవన్నీ
వున్న
వారికి
అవకాశం
ఇచ్చిచూడండి,
ఫలితాలు
మీరే
చూస్తారు.
మన పని చక్కబెట్టడనికి మనవూరివాడే అక్కరలేదు. చెయ్యగలిగిన
వాడేవూరివాడైతేనేమి? అట్టివారికి సాయపడదాం, వారితో కలసి
పనిచేద్దాం; మన కలలు పండించుకుందాం. అందమైన ఆనందాన్ని
వడ్డించుకుందాం!
మీ
తల్లాప్రగడ |