కోరికలు ఎన్నైనా ఉండవచ్చు. కానీ అవి తీరడానికి కేవలం కలలు కంటూ కూర్చుంటే సరిపోదు. దానికి తగిన ప్రయత్నం జరగాలి. ప్రయత్నం లేకుంటే మానవులకే కాదు పశు, పక్ష్యాదులకూ, జంతువులకూ కూడా పొట్ట గడవడం కష్టమే.అందుకే భర్తృహరి మహాకవి ఏమంటున్నాడో చూడండి.


’ప్రయత్నం చేస్తేనే ఏ పనులైనా పూర్తిగా నెరవేరుతాయి. అంతేగాని కోరికలు మనస్సులో ఉన్నంత మాత్రాన అవి నెరవేరవు. మృగరాజును కదా నాకు ఆకలివేస్తే జంతువులన్నీ నా నోటిదగ్గరకే వచ్చి వాలాలని సింహం అనుకొని నిద్రపోతే ఏ మృగమూ దాని నోటిదగ్గరకు రాదు సరికదా అది ఆకలితో మాడిపోవలసిందే. అందుకే మృగరాజు అయినా ఆకలివేస్తే తానే ఆహారాన్ని అన్వేషించి తెచ్చుకోవాలి.’

`ఉద్యమేన హి సిద్ధ్యన్తి
కార్యాణి న మనోరధైః
న హి సుప్తస్యసింహస్య
ప్రవిశన్తి ముఖేమృగా

 
     

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech