మన హీరోలు జూ లో జంతువులా
హీరోల అభిమానులకి విజ్ఞప్తి..

పాపం మీకిష్టమైన హీరోలని మనుష్యులుగా చూడండి..వాళ్ళని జూ లో జంతువులుగా చూడొద్దు. మీ అభిమానం తో మీ హీరోలని "సిమ్హా"లు.'పులులు " గా చూసి వాళ్లకి మేమూ మనుష్యులమే అనుకోవడం మర్చిపోయేలా చేస్తున్నారు..అడవిలో పులులు సిమ్హాల లా గుహల్లో(గృహాల్లో) ఉండిపోతున్నారు.. మీ అభిమానానికి..ఎక్ష్పెక్టేషన్ కోసం. అవసరమున్నా లేకున్నా ఇమేజ్ కాపాడుకోవడం కోసం ఒకే లాంటి కధలు..కధనాలతో నటించి ఫ్లాపులు ఇస్తున్నారు.

సమర సిమ్హం, సీమ సిమ్హం, నరసిమ్హం, సింహ ఇలా పేర్లు కోసం పాకు లాడి..ఒకటో రెండో డైలాగులు..పాటలతో నెట్టుకు రావడం..అది మీకు నచ్చక సినిమా ఫ్లాపు కావడం..మరి మీరు నిజంగా అంత గొప్ప అభిమానులైతే మీ హీరో ఎంతో ఇష్టపది..కష్టపడి చేసే సినిమాలు ఎందుకు ఆడించరు. మీకు ఏది నచ్చుతుందో ఏది నచ్చదో వాళ్లకి ఎందుకు తెలీదు..ఈసారి పాపం మీ కోసం ఒక పడుచు పిల్ల స్నేహా ఉల్లాల్ దాదాపు కూతురు వయసు..మధ్య వయస్కురాలు..నయన తార చాన్నాళ్ళకు చీరతో..ఇక నమిత.. ఇలా ఎన్నో చేయవలసి వస్తుంది..ఆ హీరో గారికి తండ్రి పాత్ర వేసే నటుడు ఉండడు..హీరో ఒక్క దెబ్బ తినకూడదు..మీసం మెలేస్తే రైళ్లు , విమానాలు ఆగిపోతాయి..ఇవి నిజం గా జరిగే విషయాలేన..చిటికెన వేలికి దెబ్బ తగిలి షూటింగు ఆపేస్తారు..అంటే వాళ్ళూ మానవ మాత్రులే కదా. మరి ఎందుకు మీ ఓవరేక్షన్..సినిమా బాగుంటే ఆదరించండి..ఒకరి పై అభిమానాన్ని ఒకరిపై ద్వేషం గా మార్చుకోకండి.. ఎన్ టీ ఆర్ బాగా డైలాగు చెబితే..రాం చరణ్ స్టైలిష్ గా ఉంటాడు.. అల్లు అర్జున్ చలాకి గా ఉంటే..నాగ చైతన్య మరో లా ఉంటాడు..మీ మధ్య వైరాలతో వాళ్ళ మధ్య దూరాలు పెంచకండి.

కలెక్షన్లు, 100 డేస్ విషయం లోనూ అంతే..సినిమా ఎలా ఉంటుందో తెలీక ముందే వంద పైన ప్రింట్లతో వదులుతారు..మొదటి వారంలో వేలం వెర్రి గా చూసేస్తారు..మొత్తం ఏదో కలెక్షన్ వస్తుంది.. అదే కొలమానమా..రెండో వారానికి సగానికి పైగా ప్రింట్లు వెనక్కి వచ్చేస్తాయి..నాలుగో వారానికి నాలుగైదు చోట్ల తప్ప ఇంకెక్కడా ఉండదు..సడెన్ గా ఎక్కడో ఒక చోట 50 రోజులదో ఇంకోటో ఫంక్షను..ఎందుకీ ఖర్మ.

నాయకుడు లాంటి సినిమా మన బాల కృష్ణలు, చిరంజీవి లాంటి వాళ్ళు చేయలేరా. చేస్తే మీరు చూడరా..చూడకపోతే మీది నిజమైన అభిమానం కాదు. మూస పాత్రల సినిమాలకన్నా ..మంచి సినిమాలు ఆదరించండి..ఇకనైనా మీ హీరోలని మనుష్యులుగా చూడడానికి ప్రయత్నించండి..గోళ్ళతో గోడౌన్ లని కూల్చే, కళ్ళ తో రైళ్ళు ఆపేసే సినిమాల కన్నా .. హాయిగా ఇద్దరు ముగ్గురు అగ్ర హీరోలు కలిసి నటించే సినిమాలు ఆదరించండి..

                                       ఐ పీ ఎల్ కిర్ కెట్

కిర్ కెట్..కిరికిరి బెట్.. బ్యాటు బంతి మధ్య పోరు ... అనుకున్నారంతా. నాకు మొదటినుంచీ అనుమానమే..
శ్రీ "శాంతు" సైమండ్స్ ని ఔట్ చేసి పెవిలియన్ వైపు చూపిస్తే ఉండే సరదా... వేడి ,,, ఇప్పుడు లేదు. అంత కంఫ్యూజన్. ఆస్ట్రేలియ గిల్క్రిస్ట్ కొడుతుంటే హైదరాబాదీ గా ఆనంద పడాలా..హర్భజన్ బౌలింగులో సిక్స్ కి బాధ పడాలా అర్ధం కాదు. డబ్బుకు లోకం దాసోహం అని.. ఐ పీ ఎల్ లో ఆడడానికి రిటైర్ అయిపోయిన వాళ్ళు రిటైర్ కి దగ్గరగా ఉన్నవాళ్ళు అందరూ సిద్ధమే..వరల్డ్ కప్పు కి మాత్రం సిద్ధం గా ఉండరు..ఇక్కడ ఒళ్ళు హూనం చేసుకుని అక్కడ అవమానం పాలై వస్తారు. దేశం కోసం కాదు డబ్బు కోసమే ఆడే ఈ మహానుభావులు.

మన సీక్రెట్లు, వాళ్ళకి తెలిసిపోయి..మనం ఎంత నష్టపోతున్నాం. ఇది దేశ ద్రోహం కిందకి రాదా అని డౌట్.
 

 
  ఫణి మాధవ్ కస్తూరి :

స్వతాహాగా హాస్య స్ఫోరకత్వం కలిగిన ఫణి మాధవ్ కస్తూరి మిమిక్రీ కళాకారుడు కావటం వల్ల మరింత హాస్యం అలవడింది. నిత్యం చుట్టూ జరిగే సంఘటనలని చూసి స్పందించి అందులోని విషయాలు జనాలు విన్నప్పుడు నవ్వుకున్నా తరువాత ఆలోచించి కొంతైనా మారతారని ఆశతో వీరు వ్రాసే వ్యంగ్య రచనల సమాహారమే ' ఫన్ కౌంటర్ '. కవితలు, వ్యంగ్యరచనలు ప్రవృత్తయితే సినిమాలకు, టీవీలకు స్క్రిప్టులు వ్రాయటం వీరి వృత్తి. వ్యంగ్యమనేది కించపరిచేదిగా ఉండకూడదు. చురుక్కుమని తగిలి జాగర్తపడేలా ఉండాలి అని జాగ్రత్తలు తీసుకునే ఫణిమాధవ్ ఒక్కోసారి శ్రుతిమించితే అదుపు చేయమని కోరుతున్నారు. "ఫన్ కౌంటర్" నచ్చితే నలుగురికీ చెప్పండి. నచ్చకపోతే నాకు చెప్పండంటారు ఫణిమాథవ్.
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech