ఉగాది వెళ్ళిపోయిందా?

- తాటిపర్తి బాలకిష్ణారెడ్డి

అప్పుడె మళ్ళీ వచ్చిందా ఉగాది

పిలవకుండానే పాయసం చేసుకొన్న ప్రతిసారి వచ్చే చుట్టంలా

అప్పుడే వచ్చిందా.... ఉగాది....

నేతి గారెలు తిన్న తరువాత తన్నుకొచ్చే నిద్రలా.........

అప్పుడే మళ్ళీ వచ్చిందా..... ఉగాది....

ప్రతి సంవత్సరం మర్చిపోకుండా వస్తునే వుంటుంది.......

అప్పిచ్చిన అప్పారావన్నా వడ్ది కోసం ఒక వారం అలస్యం గా చెస్తాడేమొగాని

ఉగాది మాత్రం క్రమం తప్పకుండా జనం మరువ కుండా...... వస్తూనే వుంటుంది.....

 

హాలిడేస్ లొ డీల్స్ ఉన్నాయని చేసిన అప్పులు ఇంకా తీరనేలేదు

మొన్న వలంటైన్స్ డే కి వజ్రాల హారం సంగతేమొగాని

కనీసం టైటాన్ వాచీ కూడ కొనివ్వలేదనె

మా ఆవిడ కోపం ఇంకా చల్లారనేలేదు.....

అక్కడ ఛైత్రం సంగతేమొగాని ఇక్కడ ఇంకా చలి పొలేదు కదా.....

కనీసం మంచు కుడా కరుగ లేదు

అయినా వచ్చేస్తున్నానంటు వచ్చింది వికృతి నామ సంవత్సరం...........

 

ఈసారి ఏ గ్రోసరిస్టోరులొ కాని.......

ఏ దేశీ రెస్టారెంటులొకాని ఉగాది పోస్టర్ ఇంకా చూడనేలేదు

ఏ ఫ్రెండూ  ఫొను చేసి ఉగాది సంబరాలకి వాలంటీర్ నువ్వే....

అని నా నెత్తిన ఏ  బాంబు వెయ్యలేదు..........

అథంఠిక్ ఉగాది పచ్చడి ఇంపోర్ట్ కోసం అంటూ ఇంకా చందాలెవరు అడగనేలేదు.......

ఎక్కడా ఒక కోకిల కూడా కూచినట్లు వినబడనే లేదు.........

మొన్న స్టాప్ లయిటు దగ్గర ఆగి టెక్స్ట్ మెస్సేజ్ చెక్ చేస్తుంటె

గ్రీను వచ్చిందంటు వెనకనుంచెవరొ వాయించిన హార్న్ తప్ప

ఎక్కడా......  కొకిల కూత లాంటిదేది వినపడ కుండానే..........

ఇలాంటి ప్రకృతి సూత్రాలకి విరుద్ధంగా

గుప్ చుప్ మని వచ్చిందంటె అది వికృతి నామ సంవత్సర మహిమే........

 

ఉగాది పచ్చడి కొసం వేప పూలు పంపమని ఫొనులొ తాతగార్కి చెప్తే.....

వయస్సు తొ పాటు శ్రవణ శక్తి సన్నగిల్లి........  వేప పూలు కాస్తా..... విప్ప పూలు లాగ వినబడిందట

అమెరికాలొ కూడా వీడు అలగా బుద్దులు మానలేదా......

అక్కడ తెల్ల దొరలతొ పాటు హాయిగా ఏ  స్కాచో తాగకుండా.....

అక్కడ కూడా వీడు కాపు సారా పొయ్యెట్టినట్లున్నాడని ఒకరంటే

చిన్నపుడు బడికి వెళ్తానని వెళ్లి ఈత చెట్టుమీద కల్లుకుండ పగులగొట్టి

గీత కార్మిక సంఘపొళ్ళని కొంపమీదకు తెచ్చిన సంగతి మర్చిపొయారా...........

అంటూ వీధి చివరి తాతగారు వంతెత్తుకొని అక్కడొక పార్లమెంటు పెట్టారంట

అడిగింది విప్పపూలు కాదు...... వేపపూత అంటూ సర్ది చెప్పి.....

అయినా వచ్చె అత్తగారు కస్టంస్ వాడి కళ్ళు గప్పి వేపపూత తెస్తారొ తేరొ అనె బెంగ

తేనివ్వకపోతె చేసెదేముంది.......  కాకరకాయ వేస్తే సరి...

అని శ్రిమతి గారు సర్ధి చెప్తూనె........

ఆంధ్రా లొ అంత పెద్ద పేరున్న పచ్చళ్ల కంపెనీ కూడ.........

ఉగాది పచ్చడి లాంటి కొత్త పచ్చళ్లు, వినాయకచవితికి ఉండ్రాళ్లు.......

అట్లతద్దె కోసం రెడి మేడ్ దోసలు లాంటి వంటలు కోసం

పరిశోధనలు మాని పనికిమాలిన పాలిటిక్స్ చెస్తున్నారు అంటూ......

పండుగ రోజని కూడా చూడకుండా శాపనార్ధాలు పెడుతుంటె.......

పెరుగుతున్న మా ఆవిడ రాజకీయ విశ్లేషణకు సంతొషించాలొ

లేక  లేచినదగ్గర్నుండి ఆనాడు తో మొదలెట్టి...... ఆంధ్రాలొ దీపం లాంటి పత్రికలన్ని

నెట్ లొ నమిలేస్తూ........

ఆఫిసు నుండి ఇంటికొచ్చేసరికి మేరు పర్వతంలా పెరుగుతున్న

సింకు లొని డిషెస్ కి కారణం తెలిసొచ్చి........

అప్పట్లొ స్నానాల తొట్టిలొ నుండి అదేదొ సూత్రాన్ని కనిపెట్టిన అర్కిమెడిస్ లా

ఫొను చేత పుచ్చుకొని ఒక ప్రాణ మిత్రునికి  చెప్తే

తను పగలబడి నవ్వి... ఎమిటి ఇప్పటి దాక నీకు బల్బ్ వెలగలేదా అంటూ

ఇది ఇప్పుడు కాలేజిలొ వున్న మా రెండొ అబ్బాయి మూడొయేటనె కనిపెట్టానంటె.....

నా తెలివితక్కువ తనానికి పండగ పూట నన్ను నెనే నిందించుకొలేక

ఇన్నాళ్ళు చెప్పనందుకు వాడసలు నాకు ప్రాణమిత్రుడేనా అనుకొంటూ..........

పొనీలె పాపం పరువుపొతుందని తన పరిశొధనా ఫలితాలు చెప్పలేదేమోనని

సముదాయించుకొంటున్న సమయంలొ............

ఒక ఫ్రెండు ఫొను చేసి సాయంత్రం ఉగాది పార్టీ వుంది పోదాం రమ్మన్నాడు

ఎంటి ఈ సారి ప్రొగ్రాం ఎమి లేకుండానె పార్టీ పెట్టారంటే

ఎముంది ఈసారి ఉన్న పది మంది మిత్రులు కూడ ఉద్యొగాల వేటలొ

అరడజను రాస్ట్రాలకేగారు.....

అందుకే ప్రొగ్రాం అంటూ ఎమి పెట్టలేదట

వాడు నిన్న వాల్మార్టు లొ వంకాయలు సేల్లొ వున్నాయంటె వెళ్ళాడంట....

కనీసం పండుగ రొజయినా గుత్తొంకాయ కూర తిందామని....

అక్కడ లయోలా కాలేజిలొ డిగ్రి బేచ్మేటు భాస్కరరావు తగిలాడట

తనింట్లొనె పార్టి  చెసుకుందామని మమ్మలందరిని

వంటా వార్పుల వర్రిస్ ఎమి లెకుండ తొలుకరమ్మనాడట

 

అప్పట్లొ ఎప్పుడూ ఒక పది మందిని పోగేసి వారానికి ఒక మినీ మహనాడు పెట్టేవాడు హాస్టల్లొ

దొరికిన ప్రతిసారి సాములోరు వేసే జరిమానాలు కట్టడానికి వాళ్ళయ్య అప్పట్లొనే రెండెకరాలు అమ్మేడంట

అదేగనుక ఇప్పుడుంటె....  దాని పక్కనే రింగురోడ్ కూడా పడిందట......

మన భాస్కరరావు అమెరికా నుండి ఎప్పుడొ భిచాణ ఎత్తేసుండెవాడు అని ఎవరొ అన్నది గుర్తొచ్చింది.....

 

భాస్కరరావు కల్పించిన భాగ్యంతో

ఉగాది పచ్చడి సాయత్రం ఆరుగంటలకి రుచిచూసి

వాళ్ళావిడ గత మూడు రొజులనుండి కష్టపడి చేసిన వేడి.... వేడి..... వంటలన్ని ఆరగించి

అప్పట్లొ చిన్నపుడు తన్నులు తినకుండా వేప పూత వంకతొ చెట్లెక్కగలిగే పర్వదినమే ఉగాది సుమా.....

అంటు తిన్నది త్రేంచుకుంటూ

వయసుపెరిగినా జ్ఞాపకశక్తి తగ్గలేదనటానికి......

లయోలా రోజుల్లొ స్టెల్లా కాలేజి ముందు గార్డు డ్యూటి చేస్తుంటె.....

మఫ్టిలొ పోలిసోళ్ళు వెంటబడిన రోజులు గుర్తు చేసుకొని....

గుర్తుందా అప్పుడు మనమంతా దొరికినా చిక్కకుండా పారిపొయిన చిట్టిబాబు

మొన్న షికాగొ ఎయిరుపొర్టులొ వీల్ చైర్ లొ కనిపించాడు

వీడు ఇక్కడా గోడలు దూకుతున్నాడేమొ అని నాకు డౌట్ వచ్చే.....

కొచ్చన్ పేపరు తీసుకొకుండానే ఆన్సర్ పేపరు రెడీ చెసుకొనె స్టూడెంట్లా

అది కాదులె మొకాళ్ళ నొప్పులొచ్చాయి అంటూ.....  అడగకుండానే చెప్పాడు..... వాడు....

అంటూ భాస్కరరావు చెప్పిన కబుర్లన్ని విని

ఇంటికి తిరిగొస్తుంటే అనిపించింది

ఔరా... అప్పుడె వచ్చిందనుకొన్న ఉగాది

ఎంటి ఇంత తొందరగా వెళ్ళిపొయిందని.....
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం