వరక్కులు

- వరకూర్ గంగా వరప్రసాద్

 

     

ఋక్కులు గిక్కులు అని

బుక్కుల లెక్కలు చెప్పక

తప్పక మనకి తెలిసిన చమక్కను ముక్కలు

టక్కున చెప్పే మధుర వాక్కులు.. వరక్కులు.

 

 

భార్య - భర్త - సంసారం

సౌకుమార్య, సౌందర్య శౌర్య,

ఆహార్య కైంకర్య, మాత్సర్య మౌర్య,

అనివార్య కార్య.. ఆర్య సహచర్య,

సూర్యకాంతర్య పర్య తాత్పర్యమే.. భార్య.

 

నిరర్థ వ్యర్థ స్త్రీసూక్త యుక్త

ఉత్తుత్తి సత్త, భుక్తి రక్తి రిక్త,

భార్యోక్తి విరక్త.. విముక్త అశక్త, జీవన్మోక్త ఆసక్త,

అస్థ వ్యస్థ పద అర్థ, పదార్థమే బైంగను-భర్త.. భర్త.

 

సుకుమార మారం, మమకార కారం,

వారం వారం భారం భారం, ఆరంభ రంభాకారం

నిరాకార వికార మకరం, అర కొర కర కర నకరం,

చరాచర విచార తీరం, ఘోర గంభీర నేరం,

నారీ నర వర హర జరా మర సమర సారం .. సంసారం 

 
 
పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం