ఎటుపోతోందీ దేశం?

- పెయ్యేటి రంగారావు

                       

 

ఎటు పోతోందీ దేశం?

ఆలోచించు నేస్తం

చుట్టూ చీకటి! మదిలో చీకటి!

వెలిగించు చిరు దీపం! ||

 

1.      విద్యార్ధులమని అంటారు

          కళాశాలలకు వస్తారు

          సమ్మెలు చేస్తూ ఉంటారు

          చదువుకు నామం పెడతారు

 

2.      ప్రజాసేవకుల మంటారు

          ప్రభుత్వ సంస్థల నుంటారు

          లంచాలను తెగ మేస్తారు

          నీతికి గంతలు కడతారు

 

3       కళారాధకుల మంటారు

          ప్రజలను మార్చాలంటారు

          ఏమార్చే వాళ్ళవుతారు

          కాసుల కమ్ముడు పోతారు

 

4       ప్రజాస్వామ్యమని అంటారు

          ఎన్నిక లెన్నికలంటారు

          ఓట్లకు నోట్లను ఇస్తారు

          భ్రష్టులె నాయకులౌతారు

 

5       గంగా యమునలు పారేటి

          ధర్మభూమి అని అంటారు

          ధర్మో రక్శతి రకితః

         

          సూత్రం తెలియక ఉన్నారు.

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం