మరొక్కసారి
 

- ఆచార్య ఎస్. శరత్ జ్యోత్స్లారాణి

                       

ఏముంది మిత్రమా!
నిన్నలోను నేడులోను
ఏముంది మిత్రమా! అంతామామూలే,
మాముళ్ళు ముట్టందే నగరం మేల్కోనట్లు.
స్వల్ప అనర్ధాలతో అల్ప ఆనందాలను అందించి
విరోధినామ వత్సరం వెళ్ళిపోతో

ఓ నిమిషం ఆగి / కొత్త పేరుతో వస్తున్నాను
పేరు చూసి భయపడకు!
కలత చెందకు / కన్నీళ్ళు కార్చకు అంటూ
ఓ దార్చే మాటలతో నన్ను మేల్కొల్పి
తాను పయనమై పోయింది విరోధినామవత్సరం
కళ్ళు తెరిచి చూస్తే ఏముంది

నా ముందు వికృతి నిలబడి పగలబడి నవ్వుకుంది,
ఆ నవ్వు నాగుండెలను కుదిపేసింది.
ఏదో తెలియని జ్ఞాపకాల తెరలమాటుకు
జారుకుంది నామనస్సు.
నా పల్లె నా బాల్యం నడుస్తున్న సమాజపు చిన్నెలు
వన్నెలు చూసి బరువెక్కిన గుండె మూగగా రోదిస్తుంది!

పల్లెల్లో అరుగుల మిద కూర్చుని
అమ్మ చేతి కమ్మని పచ్చడి తింటూ
సృష్టి లొణీ తియ్యదనాన్ని స్నేహితులతో
పంచుకుంటూ, పెరటిలోని మామిచిగుళ్ళు
తిని మత్తెక్కిన గండు కోకిలపాట వింటూ.
పండుగంటే ఇదేకాబోలని పరవశించేది
నా హృదయం ఒకప్పుడు.

నాబాల్యం నన్ను విడిచి వెళ్ళిపోయింది,
నా జీవితం నేడు మామిడి కొమ్మల్లో దాగి
పండుగ పూటైన పాటపాడని ఒంటరికోకిలలా మిగిలి పోయింది.
తిన్నా తినక పోయిన పలకరింపులతో పెనవేసుకున్న
ఓ స్నేహం. పల్లెల్లో పచ్చని తోరణమై
నిండు తనాన్ని నింపుతుంది.
అవకాశం అవసరం
మనుషులకు కలుపుతుందేకాని హైటెక్ నగరంలో
వీరి మనస్సుల్లో స్నేహసుమాలను పూయించటంలేదా.
కాలమహిమో! మరిమనిషి స్వార్ధమో!
అర్ధం కాని అయోమయవస్థలో
పసిడికోసం పసి కందుల దుర్మార్గపు మరణాలు
మానవత్వాన్ని ప్రశ్నిస్తుంది!
మానని గాయమై విలసిలింది.
అమ్మా! ఉగాదిలక్ష్మీ
సిరిసంపదలను కోరటం లేదు! మేం.
ఇంటి నుండి బయలుదేరిన మనిషి
వాహనాల కాటుకు బలికాకుండా
ఇల్లు చేరుకునే భాగ్యాన్ని
భాగ్యనగరంలో ప్రసాదించవమ్మా.
సత్కారాలు సన్యాసాలు వద్దుతల్లీ.
నిండైన తెలుగుతనాన్ని మాలో పండించవమ్మా.
వేపపువ్వులోని తెల్లదనాన్ని
మల్లిలోని సుగంధాల్ని మాలో నింపవమ్మా.
ఈ వసంతవేళ మధుమాస కోకిలవై
మనస్సులకు రస రంజితం చేయవమ్మా!

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం