సరదా కవితలు

- ఫణిమాధవ్ కస్తూరి

                       

ఎడ్వర్ టైజుమెంటు చూడ ముచ్చటగా ఉండు
షాపు కెళ్ళి చూడ చౌకగా ఉండు
అభిమానతార చీర బిల్లు బారు మందువే
విసిగించి చంపక వినవే భామ

ఆట పాట ల పోటిల్లో గొడవలెందుకో
సినిమా విడుదలప్పుడే తారల సందడేలనో
అత్త కోడళ్ళ సీరియళ్లలు అంతమెప్పుడో
విసిగించి చంపక వినవె భామ

కల్తీలేని పాలు కాసినైనా చాలు
కిరోసిన్ కలిపిన పెట్రోలుతో బండి లైఫు గుభేలు
డాక్టరిచ్చే మందు కల్తీ, మందులిచ్చే డాక్టరూ కల్తీ
విసిగించి చంపక వినవె భామ

ట్వెంటీ ట్వెంటీ పోగా అరవై ఏమయ్యెను
కోట్ల రూపాయలు ఐ పీ పెట్టినోడు వీ ఐపీ ఆయేను
బ్యాటింగు కాదది బెట్టింగు రా
అర్ధమయ్యే లోపు అనర్ధమౌను సుమా

గడ్డి స్కాము నందు కటకటాలు లెక్కించెను
తాను జైలునుండ భార్యను పీఠమెక్కించెను
పదవి చిక్కిన పిదప మహిళా బిల్లును వెక్కిరించెను
జపానుని బీహారు చేయగల లాలూ అని మురిపించెను

ఎన్నికలప్పుడు పల్కు ఆదరముగాను
పదవి దక్కిన పిదప పల్కకుండు
అమ్ముకున్న ఓటు అభయమ్మునిచ్చునా
విసిగించి చంపక వినర ఓటరా

ఐపీ ఎల్ చూడ గొప్పగా ఉండు
తెరవెనుక చూడ చీకటుండు
పదవులూడే ఆట పెదవిదాటద్దు రా
బంధు ప్రీతి కొంప ముంచేనురా

ముంబాయి నుంచి వచ్చి ఏడాది దాటినా
పరభాషే గాని మన భాష రాదు
కొయ్య బొమ్మను తెచ్చి నెత్తిన పెట్టుకోకురా
తెగులు సినిమా చూసే తెలుగు సోదరా

అనగననగ న్యూసు తిరిగి వచ్చు చుండు
వినగ వినగ మనకు నిజమనిపించు చుండు
టీ ఆర్పీ కొరకు ఏమైన చేతువురా
చూపిందే చూపే న్యూసెన్సు చానలా..


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం