గీత రచన: రావు తల్లాప్రగడ

సంగీతం: సాయి మానాప్రగడ

ఈ గీతం వినడానికి:  
          (బటన్ నొక్కాక పాట వినడానికి అవసరమైతే కొంచెం వేచి ఉండగలరు)                                   

 

ఇటీవల సిలికానాంధ్ర నిర్వహించిన ఆంధ్రసాంస్కృతికోత్సవంలో ప్రియభారతం అనే నృత్యరూపకంలో, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ, వారి బాణీలపై తెలుగులో పాటలు కట్టి, వాటికి నృత్యరూపకలపన జరిపి, ప్రదర్శించడం జరిగింది. ఆ సంధర్భంగా ఈ పాటల ఛ్డ్ని కూడా విడుదలచేయడం జరిగింది. ఇందులో ఒక పాట ఈ మాసం మీ ముందుకు తెస్తున్నాము.

ఓరియా వారి బాణిలో పాట

పల్లవి)

అతడు  : ఓరొంగో బోతీ రొంగోబోతీ (2)

ఓ రొంగొభోతీ రొంగోభోతి! అందాల రాశి, పెట్టేవ ఆబుంగ మూతి

అరె! అంగాంగ మందున అందాలు వున్నా, లోలోన ఓచుప్ప నాతి

ఆమె    : నాగురుతు నాదే రంగోబోతీ!

ఒరి యాగానె పుట్టా నేను!

అరే! కనువిందై కొనసాగు కోణార్కు లోన, కోణంగి జాణలదే జాతి (2)

ఇద్దరు  : ఒడిషా గారాల కూచి, ఒడిస్సీ నాట్యాలు చూచి

భారతికె హారతులు అందించె ఓ రోంగోబోతీ రోంగోబోతీ!

చరణం 1)

ఆమె    : కోపాలు తాపాలు, మురిపాలు అన్నీ, బంధాలపైన, గంధాల వోలె వుండేటి వీభూతీ (2)

అతడు  : పరువము నన్నీ చెల్లేను, నకరము లన్నీ చూశాను (2)

ప్రేమైన నీదె, ఈర్షైన నీదె, రెండిట్లొ ఓద్యుతి!

ఇద్దరు  : మాటల్లొ చేతల్లో ఊపుంటె సోకుంటే,

ఈకోప మేకాదా ఆఅంద పాకృతీ, రోంగొబోతీ రోంగొబోతీ

చరణం 2)

ఆమె    : ఆనాడు ఈనాడు ఏనాడు కానీ, అందానికైన చందానికైన నేనేలె అనుభూతీ (2)

అతడు  : కటకము పూరీ కోణార్క, నగరము లెన్నో చూశాను (2)

గ్రామాల నేవె, కావ్యాల నీవె, రాసేను భవభూతీ!

ఇద్దరు  : చేలోన ఊర్లోన ఆనంద మైనీవే

పాశ్చాత్య సంస్కార ఆషాడ భూతీ, ఓయ్! రోంగొబోతీ రోంగొబోతీ   

 

 

 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech