నిజమైన జ్యోతిష్యం


 నిక్షేపరాయుడి ఆస్థానంలో జ్యోతిష్యుడి పదవికి ఖాళీ ఏర్పడింది. ఒక ప్రముఖ జ్యోతిష్యుడికి ఆ పదవి ఇవ్వాలనుకున్నారు. అందుకోసం దేశంలో జ్యోతిష్యులందరికీ ఆహ్వానం పలికారు. వారికి రకరకాల పరీక్షలు పెట్టారు.

కొన్ని పరీక్షల తరువాత ఆ వచ్చిన వారిలో ఐదుగురు జ్యోతిష్యులు ఎంపికయ్యారు.
వారి పాండిత్యానికి సంతృప్తి చెందారు. రాజు వారిని విడివిడిగా కలిశారు.
మీ జాతక రీత్యా మీరు ఆస్థాన పండితులు కాగలిగే అవకాశం ఉన్నదా? అని ప్రశ్నించాడు నిక్షేపరాయుడు.

దానికి ఐదుగురూ తలలూపారు. అలాంటి యోగం ఉన్నది కనుకే వచ్చామని జవాబిచ్చారు.
నిక్షేపరాయుడు సందిగ్ధంలో పడ్డాడు. ఈ ఐదుగురిలో ఎవర్ని నియమించాలా? అని ఆలోచిస్తూ ఐదుగురిలో ఒకర్ని నియమిస్తే మిగిలిన నలుగురి జ్యోతిష్యం తప్పవుతుంది. అంటే వీరికి జ్యోతిష్యంలో సరైన నిపుణత లేదన్నమాట. వీరిలో అందర్ని మించి నిపుణుడు ఎవరు? అన్న రాజు సందేహాన్ని మంత్రి వివేకుడు గమనించాడు.

మహారాజా! వీరిలో ఎవరో ఒకరిని ఆస్థాన జ్యోతిష్యుడిగా నియమించండి. ఆ తరువాత తమ సందేహాన్ని తీరుస్తాను అన్నాడు.
నిక్షేపరాయుడు కేశవుడు అనే అతణ్ణి ఆస్థాన జ్యోతిష్యుడిగా నియమించాడు. ఆ సంగతి మంత్రి వివేకుడికి చెప్పాడు రాజు.
అపుడు మంత్రి చిరునవ్వు నవ్వి మహారాజా! ఆ అయిదుగురిలో కేశవుడే జ్యోతిష్యశాస్త్రంలో ఉద్దండుడు అన్నాడు.

ఏ ఆధారంతో అలా చెబుతున్నారు? అని ప్రశ్నించాడు రాజు.
ఆస్థాన జ్యోతిష్యులం కాగలమన్న ఆ అయిదుగురి జ్యోస్యంలో ఆయన జోస్యమే నిజమయ్యింది అని నవ్వాడు మంత్రి.

వివేకుడి తెలివికి రాజు ప్రశంసల వర్షం కురిపించాడు.
 

 
  చొక్కాపు వెంకటరమణ :

స్టేజి మీద మేజిక్ చాప్లిన్ గా మేజిక్ కార్యక్రమాలుచేస్తూ, పిల్లల కోసం అనేక కధలు వ్రాసిన బాలల రచయిత, ప్రతిభకల చిన్నారులతో ఎన్నో రికార్డు ప్రోగ్రాములు చేయించిన మేజిక్ ఫన్ స్కూల్ నిర్వాహకుడు, బాలభవన్ లో ఉద్యోగిగా ఎన్నో రచనలు అందించిన సంపాదకులు, పిల్లల మనోవికాసం కోసం ఊయల పత్రిక నిర్వహించిన పత్రికాధిపతి......ఊయల కమ్యునికేషన్స్ అధినేత..ఆల్ రౌండర్ అనే పదానికి అచ్చమైన నిర్వచనం చొక్కాపు వెంకట రమణ ఆంధ్ర్ర ప్రదేశ్ బాలల అకాడెమీవారికి అనేక పిల్లల పుస్తకాలు వ్రాసారు. వాటిని జవహర్ బలభవన్ ఇటీవల పున:ప్రచురుంచింది. చొక్కాపు వెంకట రమణ ఆధునిక పరవస్తు చిన్నయ సూరి గా అందిస్తున్న నీతికధల సమాహారం 'నిక్షేపరాయుడి కధలు ' ధారావాహికంగా బాలరంజని లో నెల నెలా వెన్నెల..

 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech