పద్యాలు

- శ్రీపతి బాలసరస్వతి

1.     మప్పక, మంచి, పెద్దలను మన్నన సేయగ పిల్లలందరున్
అప్పసమూరు పెద్దలును అర్ధముచేసుకొనంగ పిల్లలన్
ఎప్పుడు మాని నీభువిని ఎచ్చుగ చేయునొ మంచి కార్యముల్
అప్పుడు చూడగల్గుదుము అంతటనెప్పుడు రామరాజ్యమున్

దిమ్మును వీడి మానసము దిద్దుచునుండగ తీరుతెన్నులన్
ఒమ్ముగపూజ చేయుచును ఒందగ నెప్పుడు పుణ్యసంపదల్
ఇమ్ముగ జేయరామనవిమిచ్చట పద్రుచు భక్తులందరున్
నమ్ముచు చేరెనందగను,నారము, రాముని దీవెనంతయున్.

2. అదురుచు మాయలోపడి అందరముంటిమి దారిచూపుమా
ఎదుటి మనస్సు అర్ధమయి ఏలగ నెయ్యమునంత భాగ్యమున్
తదుపరి నిత్యసత్యముగ తత్వము నంతట తల్చుచుండగన్
వదురుచు మాకు,అందరికి,పంటగ దీవెననిమ్ముదేవరా

ఓంకారమ్మును చెప్పుచున్ మనసులో ఓజస్సుపెంపొందగన్
లోకాలన్ని తరింపగా సతతమున్ లో చూపు వర్ధిల్లగన్
ఆకారమ్మును జూపుమింక దయతో ఆంతర్యమున్ తెల్పుచున్
స్వీకారమ్మును దివ్యశక్తివి!యిలన్ స్వీకర్తగా తెల్పుమా


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం