"సమస్యాపూరణం:
ఈ
క్రింది
"సమస్యని"
అంటే
ఆ
వ్యాక్యన్ని
యదాతధంగా
ఒక
పద్యంలోకి
ఇమిడ్చి
వాడుకుంటూ
రాయాలి.
ఒకవేళ
పద్యం
కాకపోయినా
ఒక
కవిత
రాసినా
కూడా
వాటిని
మేము
సగౌరవంగా
స్వీకరిస్తాము.
మీ
జవాబులు
ఈ-మెయిల్
(విద్యుల్లేఖ)
ద్వారాకాని
(rao@infoyogi.com)
ఫాక్స్
ద్వారాకానీ
(fax: 408-516-8945)
మాకు
మే20వ
తారీఖు
లోపల
పంపించండి.
ఉత్తమ
పూరణలను
తరువాయి
సంచికలో
ప్రచురిస్తాము.
ఇక్కడ రెండు సమస్యలను ఇస్తున్నాం. ఈ రెండికీగానీ, లేక ఏ వొక్క
దానికైనాగానీ మీరు మీ పూరణలను పంపవచ్చు
ఈ మాసం సమస్యలు
ఆ.వె.||
రక్తిలేనిభక్తి ముక్తినియదు!
కం.||
తెలుగుతమిళ భాషలందు తీపుయు జచ్చెన్!
క్రితమాసం సమస్యలు
ఆ.వె.||
వేళకానివేళ వేంకటేశ!
కం:||
ఉపయోగపడని వరములు ఉచ్చై తోచెన్!
ఈ సమస్య లకు వచ్చిన ఉత్తమ పూరణలు ఇలా వున్నాయి.
మొదటి పూరణ - వేదుల బాలకృష్ణమూర్తి, శ్రీకాకుళం
ఆ.వె.||
వేళకానివేళ వేంకటేశ హరి! నీ
పాదపద్మములకు ప్రణతులొసగ
వచ్చినాను;
తెరను ప్రక్కకు తొలగించు
మదిని కప్పి వున్నమత్సరమను
ఆ.వె.||
సరసమాడుటకును సమయములున్నవి
రేయి ఎల్ల గడచిపోయె;
ఇపుడు
మంగతోడ సరసమాడ విచ్చేసితే
వేళకానివేళ వేంకటేశ
కం.||
ఉపయోగపడని వరములు
అపహాశ్యము పాలగుచును అదృశ్యమగున్
ఉపమింపగ మృగతృష్ణలె
ఉపయోగించని వరములు ఉచ్చై తోచున్ !
రెండవ పూరణ - యం.వి.సి.రావు, బెంగుళూరు,
ఆ.వె.||
ఎపుడు నిద్ర పుచ్చి ఎపుడు లేపుదురేమొ విడువరైరి క్షణము విశ్రమింప అమ్మవారి కలియ అసలెట్లు పొసగునొ వేళ కాని వేళ వేంకటెశ!
కం.||
శాపంబుల కారణమున పాపంబాసూత సూని ప్రాణము లొడ్డెన్ ఆపద కల్గిన వేళల ఉపయోగ పడని వరములు ఉచ్చై తోచెన్
మూడవ పూరణ -
టి.వెంకటప్పయ్య,
సికిందరాబాద్
ఆ.వె.||పెద్దలంత జేరి బెండ్లిని గూర్చగ
కర్మ గాలె నంత కర్ఫ్యు బెట్ట!
నగర జనము లెల్ల నానాక పాట్లురా!
వేళ కాని వేళ వెంకటేశ!
ఆ.వె.||
తాడి చెట్టు నీడ తాగినా పాలను
కల్లు యనదె నిన్ను తల్లి అయిన!
సకలపనులకెల్ల సమయము నెరగుమా!
వేళ కాని వేళ వెంకటేశ!
నాల్గవ
పూరణ -
రావు
తల్లాప్రగడ
,
శాన్ హోసే,
కాలిఫోర్నియా
ఆ.వె.||
వేళపాళలేక వేచేరు భక్తులు,
భక్త జనులకేమి రక్తి ఎరుక!
సుప్రభాతమంటు విప్రగోషయు చూడు!
వేళకానివేళ వేంకటేశ!
కం:|| అపురూపి
యొకడు పాపము,
తపమున తెలుపును యడుగగ దానికి వరమే
తపనపు బొల్లిగ
యిస్తే,
ఉపయోగపడని వరములు ఉచ్చై తోచెన్!
ఐదవ పూరణ-
జగన్నాథ
రావ్
కె. ఎల్.,
బెంగళూరు
ఆ.వె.||
నీరు రాల్చుతారు ఊరు నిద్దురబోవ
వేళ కాని వేళ వేంకటేశ!
ఖాళి బిందెలందు కన్నీటి బొట్లుగా
నీరు దేవుడెరుగు నిద్ర కరువు
కం||
అపకారమెంచి పరులకు
తపమొనరించిన అసురుడు తలపై హస్తం
నెపమున భస్మంబయ్యె స
దుపయోగపడని వరములు ఉచ్చుగ తోచెన్
ఆరవ పూరణ:
డా. అట్లూరి వెంకట నరసిమ్హ రాజు,
ఏలూరు
ఆ.వె.||
తెల్లవారకుండ దేవాలయమ్మున అడుగు పెట్టికూడ అర్చనలను పూర్తిచేసివచ్చి భోంచేతమన్నచో వేళకానివేళ వెంకటేశ!
కం.||
అపరాధ భావమెదలో
తపనను కలిగింప దానధర్మములంచున్ కృపణుడు చేయగ గక్కిన
ఉపయోగముపడని వరములుచ్చై తోచెన్!
ఏడవ పూరణ:
సుమలత
మాజేటి,
బెంగళూరు
ఆ.వె.||
ఎల్ల వేళ లందు ఈమైలు చెక్కింగు చాటు [ ఈ చాట్ ] మీటు [ ఈ మీటింగు ] తప్ప చెలియ వలదు అర్ధ రాత్రి కూడ ఆఫీసు వర్కాయె
వేళ కాని వేళ వేంకటెశ !
కం.||
నెపమెన్ని కైక రాముని పంపగ కానల,
దశరథు పరితాపమునన్ ఓపక,
విలవిల లాడెను
ఉపయోగ పడని వరములు ఉచ్చై తోచెన్
ఎనిమిదవ పూరణ- పుల్లెల శ్యామసుందర్,
శాన్ హోసే,
కాలిఫోర్నియా
ఆ.వె.||
అనగననగ రాగ మతిశయిల్లుచునుండు' అనుచు చదవి ఒకడు అర్ధరాత్రి గొంతునెత్తి పాడి గోలచేయ సబబె వేళకాని వేళ వేంకటేశ!! |