భారతీయ నీటి వనరుల నిపుణుడు - పద్మభూషణ్ డాక్టర్ కానూరి లక్ష్మణ (కే ఎల్) రావు

  తమ తమ రంగాలలో నిష్ణాతులై, విశిష్టత నాపదించుకుని, పేరు ప్రఖ్యాతులనార్జించి "గొప్పతనం" సాధించిన తెలుగువారెందరో ఉన్నారు.

వాళ్ళు యెదుర్కున్న ప్రతిబంధకాలు, సంక్లిస్ట పరిస్థితులు, అనుభవించిన నిర్భందాలు, పడిన ఆవేదన, చేపట్టిన దీక్ష, చేసిన కృషి, సాధన, కనపరచిన పరకాష్ట, సాధించిన విజయాలు, ఆ విజయ రహస్యాలు, ఇలాటి విషయాలని పరిశీలించి, సమీకరించి, పొందు పరచి ఈ కధనలలో మీ ముందు ప్రస్తుతీకరిస్తున్నాం.


భారత దేశంలో జల వనరుల అభివృద్ధికి, వాటిని సేధ్య వినియోగానికి, నీటి యద్ధడి ఉన్న ప్రాంతాల నీటి అవసరాలు సమకూర్చడానికి బృహత్ ప్రణాళికలకు శ్రీక్రారం చుట్టి - కోశీ, హిరాకుడ్, చంబల్, ఫరక్క, శ్రీశైలం, తుంగభద్ర, నాగార్జున సాగర్ ఆనకట్టలు రూపొందించి, వాటిని దేశానికి అందించారు. వీటితో పాటు గ్రామీణ విద్యుదీకరణ విశేష అభివృద్దికి తోడ్పడ్డ క్షేత్రజ్ఞ నిపుణుడు. వ్యవసాయ నీటి పారుదల క్షేత్ర పితామహుడు, గ్రామీణ విద్యుదీకరణ రచనకర్త పద్మభుషణ్ డాక్టర్ కానూరి లక్ష్మణ రావు (కే ఎల్ రావు) గారు. ప్రపంచంలో అత్యంత పొడవైన " అర్తెన్ డాం " ఆనకట్టను కృష్ణా నది మీద నిర్మించారు. మూడు వందలకు పైగా సంకేతిక రచనలు చేశారు. వీరు రచించిన " స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ అండ్ రీ ఇంఫోర్స్డ్ కాంక్రీట్ " పుస్తకం ఈ క్షేత్రంలో ప్రామాణిక గ్రంధం. భారత దేశ కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు కే ఎల్ రావు గారు.

డాక్టర్ కే ఎల్ రావు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఒక ఆచార్యుడిగా, కేంద్ర మంత్రి గా, ఇంజినీరుగా వీరి దూరాలోచన కారణంగా భారత దేశంలో కోట్లాది మందికి తిండి లభిస్తోంది.

కే ఎల్ రావు గారి జీవితం అతి విశిష్ట మైనది. అనేక విజయాలు సాదించారు. భారత దేశానికి గణనీయ మైన సేవలు అందించారు. అనేక ప్రాజెక్టుల రూపకల్పను కారకులైయ్యారు. దేశ ప్రయోజనాలు పెంచేవిగా ఉండేవి వీరి ప్రణాళికలు. భారత దేశం లోని అనేక బహుళార్ధ సాధక ప్రాజెక్టుల రూపకర్త. ప్రపంచంలో అత్యంత పొడవైన " అర్తెన్ డాం " ఆనకట్టను కృష్ణా నది మీధ నిర్మించారు.

జవాహర్ సాగర్, గాణీనగర్, రాణా ప్రతాప్ సాగర్ నిర్మాణపు పనులు శ్రీ కే ఎల్ రావు మేధాసంపత్తికి నిదర్శనాలు. డాక్టర్ రావు గారు రచించిన " స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ అండ్ రీఇంఫోర్స్డ్ కాంక్రీట్ " పుస్తకం ఈ క్షేత్రంలో ప్రామాణిక గ్రంధం. ఆటోబయోగ్రఫీ " ది క్యూసెక్స్ కాండిడేట్ " రాశేరు.

అనేక విశ్వవిద్యాలయాల నుండి గౌరవ డాక్టరేట్ పట్టాలు అందుకున్నారు. దాదాపు 300 పైగా సాంకేతిక రచనలు కావించారు. అప్పటి భారత ప్రధానులు - నెహ్రూ, లాల్ భహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధి ప్రభుత్వాలలో నీటి పారుదల, జల వనరుల మంత్రిగా వ్యవహరించారు.


బాల్యం, చదువు, ఉద్యోగం:

కే ఎల్ రావు గారు, జులై 15, 1902 లో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ వద్ద కంకిపాడు లో మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. తన తొమ్మిదవ ఏటనే తండ్రిని కోల్పోయారు. మద్రాస్ లోని ప్రెసిడెన్సీ కాలేజి లో చదివారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి బి ఈ డిగ్రీ సాందించారు. మాద్రాస్ విశ్వవిద్యాలయం నుండి ఇంజినీరింగ్ డిగ్రీ లో మాస్టర్స్ పట్టా సాధించిన ప్రప్రధములు. ఇంగ్లాండ్ లోని బ్ర్మింగ్ హాం విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా అందుకున్నారు. డాక్టరేట్ పట్టా సాదించిన తరువాత అక్కేడే (ఉప) ఆచార్యుడిగా పనిచేశారు. అప్పటి మద్రాస్ ప్రభుత్వంలో డిసైన్ ఇంజినీర్ గా కొంత కాలం పనిచేశారు. మరికొంత కొంత కాలం సి డబ్లు సి సభ్యులు గా ఉన్నారు.


ఆంధ్ర ప్రదేశ్ నేత, మాజీ రాష్ట్రపతి శ్రీ నీలం సంజీవ రెడ్డి గారి సూచన మేరకు విజయవాడ నుండి ఎన్నికలలో నిలుచుని గెలుపొందేరు డాక్టర్ కే ఎల్ రావు. 1962 నుండి 1977 వరకు విజయవాడ లోక్ సభ సభ్యులుగా, కేంద్ర మంత్రిగా ఉన్నారు. భారత దేశ నదులని అనుసంధానం చేయాలని (సర్వే) చేశారు. కాని ఇది రూపు దాల్చ లేదు.

ఢిల్లీ, విద్యుత్ కమీషన్ సంచాలకుడిగా పనిచేసి, తరువాత ముఖ్య (చీఫ్) ఇంజినీర్ గా కొంత కాలం పనిచేశారు. " ఇండియా'స్ వాటర్ వెల్త్ " పుస్తకం ఈ క్షేత్రంలో శాస్త్రజ్ఞులకి సైతం ప్రామాణిక గ్రంధం.

విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ కూడా కే ఎల్ రావు గారి మేధా సంపత్తి నిర్దర్శనమే. గ్రామీణ విద్యుదీకరణ సంస్థ వీరి హయాం లోనే నెలకొల్పారు. డాక్టర్ కే ఎల్ రావు గారి నేతృత్వంలో - నాగార్జున సాగర్, దిగువ భవాని, మలాంపూజ, కోశీ, హిరాకుడ్, చంబల్, ఫరక్క, శ్రీశైలం, తుంగభద్ర తదితర భారా జల విద్యుత్ ప్రాజెక్టుల రూపకల్పనలు జరిగాయి. ఇంతటి బృహత్తర రీతిలో కృషి, జల వనరులు, (ఇరిగేషన్), సాగుకు దోహద పడ్డ ఉదాహరణలు మరెక్కడా లేవు. దాదాపు 300 పైగా సాంకేతిక రచనలు కావించారు. గంగా, బ్రహ్మపుత్ర వరధ నివారణ చర్యలకు కీలక సలహాలు అందించారు.


అవార్డులు, గౌరవాలు:

డాక్టర్ కే ఎల్ రావు గారు అనేక అవార్డులు, గౌరవాలు పొందేరు. వాటిలో కొన్ని ముఖ్య మైనవి:

- 1963 లో భారత ప్రభుత్వం నుండి పద్మ భుషణ్ గౌరవం అందుకున్నారు.
- 1960 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి డాక్టర్ ఆఫ్ సైన్స్ గౌరవం అందుకున్నారు
- 1968 లో రూర్కీ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు
- భారతీయ ఇంజినీర్స్ సంస్థ అధ్యక్షుడిగా ఉన్నారు
- 1958-59 లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ అధ్యక్షులు గా ఉన్నారు
- జవాహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ విశ్వవిద్యాలయం గౌరవ డాక్ట్రేట్ అందుకున్నారు

డాక్టర్ కే ఎల్ రావు గారు అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 2006 లో గుంటూర్ జిల్లా లోని బెల్లంకొండ పులిచింతల ప్రాజెక్టుకు కే ఎల్ సాగర్ ప్రాజెక్ట్ గా నామకరణం చేసింది.


వీరి మనుమలు - దీపక్, సంజై కణిష్క విమాన ప్రమాధంలో మరణించారు. ఈ విషాద వార్త వీరిని కుంగ దీసింది. మే 18, 1986 లో మరణించారు.

దేశ నీటి ప్రయోజనాలని పెంచడానికి ఎంతో దోహద పడ్డారు లక్ష్మణ రావు గారు. ఆయన ఆశించిన భారతీయ జీవ నదులు గంగా, బ్రహ్మపుత్రను, గంగా కావేరీ నదులను కలిపే బృహత్తర ప్రణాళికల రూపకల్పన రానున్న కాలంలో సాఫల్యం అయి నీటి యద్ధడి తీరుస్తుందని ఆసిద్ధాం. భారత దేశానికి ఓ సంగ్రహ విద్యుత్ (గ్రిడ్) రూపొందించాలని ఆకాంక్షించారు. ఈ రెండూ కూడా రానున్న కాలం లో నెరవేరుతాయని ఆశిద్దాం.


వీరి ఆధ్వర్యంలో అనేక సాగు నీటి పారుదల ప్రాజెక్టులకు అంకురార్పణలు జరిగాయి. గాణీనగర్, జవాహర్ సాగర్, రాణా ప్రతాప్ సాగర్ నిర్మాణపు పనులు శ్రీ కే ఎల్ రావు మేధాసంపత్తికి నిదర్శనాలు. దేశంలోని ప్రధాన నదుల అనుసంధానం, వాటిలో 2640 కిలోమీటర్ల మేర - గంగా - కావేరీ అనుసంధానం రానున్న కాలంలో రూపు అందుకుంటుంది అని ఆశిద్దాం. ఇలా దేశం లోని ఇన్ని జలాశయాలకు, ఆనకట్టలకు, జల విద్యుత్ ప్రాజెక్టులకు, జల వనరుల అభివృద్ధి వెనుక కే ఎల్ రావు గారు ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోవచ్చు. నేడు భారత దేశానికి మరిందరు కే ఎల్ రావు ల అవసరం ఎంతైనా ఉంది.


డాక్టర్ కే ఎల్ రావు గారు చేసిన మంచి పనులు కోట్ల మందికి ఉపకరిస్తున్నాయి. అవి గ్రామీణ విద్యుదీకరణ, జల వనరుల అభివృద్ధి, జీవ నదుల సమన్వయం కావచ్చు - ప్రతీ దానికి సూత్రధారుడిగా నిలచి భావి తరాల వారికి సత్ ఫలితాలు అందించిన మాననీయుడు. ఆయన రాసిన " ఇండియా'స్ వాటర్ వెల్త్ " ఈ క్షేత్రానికి ప్రామాణిక గ్రంధమయ్యింది.


దిగువ భవాని, మలాంపూజ, కోశీ, హిరాకుడ్, చంబల్, ఫరక్క, శ్రీసైలం, తుంగభద్ర, నాగార్జున సాగర్, గాణీనగర్, జవాహర్ సాగర్, రాణా ప్రతాప్ సాగర్ మచ్చుకునకలుగా మిగిలిపోయాయి. ఇటువంటి గారు భారత దేశానికి, ప్రపంచానికి అవసరం. కోట్ల మంది నీటి సమస్యని తీర్చే అభినవ భగీరధురుడి మరెప్పుడు బయలుదేరుతాడో!, వేచి చూడక తప్పదు.

 
 
     

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech