సంజీవనిథాన్ ద్వారా 12.15 కోట్ల విరాళాల సేకరణ :
కూచిపూడి ఆసుపత్రికి వరదలా వచ్చిపడుతున్న విరాళాలు
కూచిపూడి గ్రామంలో సిలికానాంద్ర ఆద్వర్యంలో నిర్మిస్తున్న సంజీవని ఆసుపత్రికి ప్రస్తుతం విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. చిన్న గ్రామంలో 200 పడకల ఆధునిక వైద్యశాల ఏర్పాటు చేయాలని ఆనంద్ నడుం బిగించారు. మొదట్లో ఇంత చిన్న గ్రామంలో ఇంత భారీ ఆసుపత్రి అవసరమా అని చాలా మంది పెదవి విరిచారు. కానీ పట్టుదలతో ఆనంద్ చేసిన కృషి నేడు ఫలించింది. టీవీ9 రవిప్రకాష్ ఆనంద్ భుజం తట్టి ప్రోత్సహించారు. స్వయంగా నాలుగుకోట్ల విరాళాన్ని అందించారు. టీవీ9 సంస్థ ద్వారా సంజీవని ఆసుపత్రికి విరాళాల సేకరణ ప్రారంభించారు. ఆదివారం నిర్వహించిన మూడు గంటల ప్రత్యేక విరాళాల సేకరణ కార్యక్రమానికి అద్భుతమైన స్పందన లభించింది. పది కోట్ల విరాళాలు సేకరించాలని లక్ష్యం పెట్టుకోగా వారి అంచనాలను అధిగమించి పన్నెండు కోట్లకు పైగా విరాళాలు అందాయి. సమాజంలో ఉన్న సామాన్య వర్గాలు కూడా విరాళాలు అందించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. రిక్షా కార్మికులు, షాపులలో పని చేసే గుమ్మస్తాలు, వృద్దులు ఉపాద్యాయులు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులతో పాటు వివిధ వర్గాల వారు ఈ ఆసుపత్రి నిర్మాణానికి భారీ విరాళాలు అందించారు. కూచిపూడి గ్రామంలో ఆదివారం జరిగిన విరాళాల సేకరణ కార్యక్రమంలో ప్రజలు క్యూలో నిలబడి విరాళాలు అందించారు. ఇదొక అద్భుతం.
సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం లో అమరావతి భాషా శాస్త్ర పీఠం – చంద్రబాబు ! :
మన కళలు, సంప్రదాయాలు, నాగరికతను ప్రతిబింబించే విధంగా ఎంతో ఆదర్శవంతంగా ఏర్పాటు చేసిన సిలికానంధ్ర విశ్వవిద్యాలయం లో మిలియన్ డాలర్లతో అమరావతి భాషా శాస్త్ర కేంద్రం (Amaravathi School of Linguistics) ఏర్పాటు చేస్తామని, యూనివర్సిటీ అభివృద్ధికి అన్నివిధాలుగా ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని తెలిపారు. మనబడి దశాబ్ది వేడుకల లోగో ని విడుదల చేస్తూ, పాతిక వేల మందికి పైగా పిల్లలకి తెలుగు నేర్పే ‘మనబడి ‘, తెలుగు భాషను ముందు తరాలకి అందించడం లో కొత్త ఒరవడి సృష్టించిందని,..ఇది ఎంతో శుభపరిణామని అన్నారు.
*****
సిలికానాంధ్ర ఆధ్వర్యంలో కూచిపూడి కి మరో గిన్నిస్ రికార్డ్ : విజయవాడలోని ఇందిరాప్రియదర్శిని స్టేడియంలో సిలికానాంధ్ర 5వ అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం లో 18 దేశాలకు చెందిన 6117 మంది కళాకారుల మహా బృంద నాట్యం – గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సొంతం చేసుకుంది. మహాబృంద నాట్య ప్రదర్శన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు, సిలికానాంధ్ర సంస్థాపక అద్యక్షులు ఆనంద్ కుచిభొట్ల లకు గిన్నిస్ బుక్ రికార్డు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు గిన్నిస్ బుక్ రికార్డు ప్రతనిథులు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, మంత్రులు కామినేని, దేవినేని లతోపాటు కూచిపూడి గురువులు,సిలికానాంధ్ర ఉపాద్యక్షులు దీనబాబు కొండుభట్ల, ఫణిమాధవ్ కస్తూరి, అమెరికా ప్రముఖులు డా. లక్కిరెడ్డి హనిమిరెడ్డి, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.
అత్యంత వైభవంగా అన్నమయ్య 608వ జయంత్యుత్సవం : అఖిల అమెరికా అన్నమయ్య 608వ జయంత్యుత్సవం సిలికానాంధ్ర ఆధ్వర్యం లో అత్యంత వైభవంగా జరిగింది. 3రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవం లో సప్తగిరి సంకీర్తనల గోష్ఠి గానం, నగర సంకీర్తన, సంగీత నృత్య పోటీలతో పాటు, ప్రముఖ సంగీత విద్వాన్సులు కళారత్న దరూరి శేషాచారి, శేషయ్య శాస్త్రి, నేమాని సోమయాజులు, జ్యోతి లక్కరాజు, జ్యోతి చింతలపూడి ల చే అన్నమయ్య స్వరార్చన జరిగింది.
సిలికానాంధ్ర మనబడి స్నాతకోత్సవం : 6000 మందికి పైగా విద్యార్ధులు తెలుగు నేర్చుకుంటున్న సిలికానాంధ్ర మనబడి ప్రకాశం, ప్రభాసం విద్యార్ధులకు తెలుగు విశ్వవిద్యాలయం పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులైన విద్యార్ధులకు పట్టాల ప్రదానం చేసారు. పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, సీనియర్ జర్నలిస్ట్ కొండుభట్ల రామచంద్రమూర్తి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
కనుల పండుగ గా ఉగాది ఉత్సవం : అత్యంత వైభవంగా జరిగిన సిలికానాంధ్ర ఉగాది వేడుకలు. లివర్ మూర్ శివ విష్ణు దేవాలయం లో జరిగిన ఉగాది వేడుకలలు తెలుగు సంస్కృతిని ప్రతిబింబిస్తూ అద్భుతమైన కార్యక్రమాలతో ఆద్యంతం ఆకట్టుకున్నాయి. భాషా వికాస పోటీలు, పంచాంగ పఠనం, రాళ్లపల్లి గారి ఆధ్వర్యంలో కవి సమ్మేళనం, సిమ్హాచల శాస్త్రి గారి హరికధా కాలక్షేపం ఆకట్టుకున్నాయి. ‘భాషావికాస పోటీలు విజేతలు’
సిలికానాంధ్ర విశ్వవిద్యాలయానికి అమెరికా ప్రభుత్వ గుర్తింపు : తెలుగు భాష, శాస్త్రీయ సంగీతం కూచిపూడి కళలలను తరువాతి తరాలకు అందించడానికి ప్రతిష్తాత్మకంగా ఏర్పాటు చేసిన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం త్వరలో ప్రపంచ స్థాయి శిక్షణా కార్యమాలను అందించడానికి సిద్ధమయిందని వ్యవస్థాపక అద్యక్ష్యులు ఆనంద్ కూచిభొట్ల ప్రకటించారు.
జయహో కూచిపూడి : కూచిపూడి గ్రామం దత్తత తీసుకున్న సిలికానాంధ్ర. రోడ్లు, ప్రాధమిక పాఠశాల మరమ్మత్తులు, ఇంటింటికీ మరుగు దొడ్లు, వైద్య శాల వంటి వాటితో పాటు, స్వచ్చ కూచిపూడి పేరుతో గ్రామాన్ని పరిశుభ్రంగానూ, పచ్చగానూ ఉంచే విధంగా కార్యక్రమాల నిర్వహణ.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూచిపూడి కోసం ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మకమైన ‘నాట్యారామం ‘ ప్రాజెక్ట్ అధ్యక్షునిగా సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు కూచిభొట్ల ఆనంద్ ఎంపిక చేసిన గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు.
అత్యంత వైభవంగా, వినూత్నంగా సిలికానాంధ్ర వేడుకలు సాంస్కృతికోత్సవం. 15 సంవత్సరాలుగా తెలుగు సంస్కృతి ప్రతిబింబించే కార్యక్రమాల నిర్వహణతో అద్భుతాలు చేసే సిలికానాంధ్ర నిర్వహించిన ఆంధ్ర సాంస్కృతికోత్సవం విజయవంతం.