తెలుగు సాహితీ సాంస్కృతిక సంప్రదాయ స్పూర్తిని చాటాలనే ముఖ్యోద్దేశ్యంతో బే ఏరియాలో ప్రారంభమైన ఒక చిన్న ఆశయం ఇప్పుడు ఖండాంతరాలకు తెలుగు పలికే ప్రతీచోటా ‘జగమంత తెలుగు కుటుంబం’ గా సిలికానాంధ్రవిస్తరించింది. సినీ కార్యక్రమాలు లేకుండా కేవలం మన సంప్రదాయాన్ని, కళలను, భాషను ప్రతిబింబించే అద్భుత కార్యక్రమాలను అత్యంత ప్రతిష్టాతంకంగా నిర్వహించడం సిలికానాంధ్ర ఆనవాయితీ. సిలికానాంధ్ర చేపట్టే ఏ కార్యక్రమమైనా, తరువాతి తరానికి మన సంస్కృతి విలువ చాటే విధంగా, సంప్రదాయానికి పెద్ద పీట వేస్తూ – రేపటి తరం యువతను – సంస్కారవంతులైన సాంస్కృతిక సైనికులుగా తీర్చిదిద్దే విధంగా ఉంటాయి. ఈనాడు ఎంతో మంది సిలికానాంధ్ర బాల బాలికలు, ఆ విలువలను కాపాడుతూ అటు అమూల్యమైన మన సంప్రదాయాన్ని ఇటు
ఆధునికతను మేళవించి అద్భుతాలు సృష్టిస్తున్నారు.
ఈ ఆంధ్ర సాంస్కృతికోత్సవం లో కూడా యువతకు ప్రాధాన్యతనిచ్చి, వారే ఈ కార్యక్రమాలను రూపకల్పన చేసే విధంగా, వారి నాయకత్వ లక్షణాలు పెంపొందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది మొదటి మొట్టు మాత్రమే. ఇంకా భవిష్యత్తు లో యువతకి ప్రాధాన్యతనిస్తూ మరిన్ని సరికొత్త కార్యక్రమాల రూపకల్పన చేయాలన్నదే మా తలంపు. అటువంటి క్రోంగొత్త ఆలోచనలిచ్చే యువతను తయారు చేయడమేు సిలికానాంధ్ర ధ్యేయం. శ్రీశ్రీ గారన్నట్టు ‘కొంత మంది యువకులు ముందు యుగం దూతలు … పావన నవ జీవన బృందావన నిర్మాతలు’, సిలికానాంధ్ర అటువంటి యువతరాన్ని ప్రోత్సహించడం కోసం అవిశ్రాంతంగా శ్రమిస్తూనే ఉంది. మనబడి ద్వారా భాషా సేవ ఐనా, ఆంధ్ర సాంస్కృతికోత్సవం ద్వారా సాంస్కృతిక సేవ ఐనా, దారులేవైనా గమ్యమొక్కటే. మన యువతలో చైతన్యం – తెలుగు భాష, సంస్కృతి పట్ల మమకారం తెలుగు సంప్రదాయం అంటే మక్కువ కలిగించడం.మేము చేసే ఈ బృహత్కార్యంలో మీరు పాలు పంచుకోండి. (https://www.creativesystems.com)
సిలికానాంధ్ర యువతే సిలికానాంధ్ర భవిత!