మనబడి
తెలుగు
తల్లికి చక్కని తెలుగు పదాల చిక్కని అక్షరమాలలు
సమర్పిస్తున్న చిన్నారులు..
తాము ఆస్వాదించిన తెలుగు పరిమళాలనే తమ పిల్లలూ
గ్రోలుతున్నారన్న పెద్దల సంతృప్తి...
చిన్నారులు తాము తెలుగ్వారమని సగర్వంగా నినదిస్తూ
జండాలు చేతబూని శోభాయత్ర జరుపుతున్న సుందర దృశ్యం..
ప్రతీ వారమూ పిల్లలందరూ పోటీపడి తెలుగులోనే మాట్లాడుతూ,
ఆడుతూ, పాడుతూ కేరింతలు వేయడం..
ఇదంతా సిలికాన్ వేలీలో సాకారమిన తెలుగువారి కల! తెలుగు
భవిత ఏమైపోతుందో అని బెంగపెట్టుకున్న భాషాభిమానులకు
సిలికానాంధ్ర చూపిన కొండంత అండ, `మనబడి'.

తన
ఆశయాలకు అనుగుణంగా తెలుగు పిల్లలకు తమ మాతృభాషను
సంపూర్ణంగా వ్యవస్థీకృతంగా నేర్పడానికి పలు నగరాల్లో
మనబడి కేంద్రాలు 2007లో సర్వజిత్ ఉగాది నాడు అమెరికా
దేశమంతా 25 శాఖోపశాఖలుగా అల్లుకుని సాంస్కృతికోత్సవ సంరంభం దిగ్విజయంగా
జరుపుకుంటోంది మనబడి.
ఆధునిక జీవితంలో మాతృభాష నేర్వడం ‘అంతగా ఉపయోగకరం’
కాకపోవచ్చు. కానీ తమ భాషకూ ఉన్న ప్రత్యేకతలు ఎల్లకాలం
నిలిచి ఉండాలనుకునేవారికి, తమ వాణ్మయంలో అద్భుతాలకు
భావితరాల వారు ఎన్నో కొత్తవి జోడించాలని కోరుకునే
వారికి, స్వభాషలోని అనుభూతులను ఆస్వాదిస్తూ ముందు
తరాలకు అందజేయాలని అనుకునేవారికి మాత్రం భాష సంపూర్ణంగా
నేర్వడం అవసరం. భాషను సంపూర్ణంగా నేర్పడం అంటే భాషకు
పునాది అయిన వర్ణమాలను ఎటువంటి కత్తిరింపుళూ లేకుండగా
విద్యార్ధులకు అందించడం మొదటి మెత్టు అని సిలికానాంధ్ర
విశ్వాసం. అందుకే అక్కర్లేదనుకుని వర్ణమాలలోంచి
తీసివేయవచ్చునన్న అక్షరాలనూ కలిపి నేర్పే ప్రయత్నం
మనబడి ద్వారా సంకల్పించారు. వ్యాకరణ నియమాలు,
నిఘంటువులు పరిశీలన ద్వారా ఆయా అక్షరాలనూ ఎంతో
ఉపయుక్తమైనవిగా గ్రహించి పొందుపరచడం జరిగింది. మనకు
ఈనాడు ఉపయుక్తంగా అనిపించని భావి తరాలకు ఎంతో
ఉపయోగపడవచ్చు అన్న ఆలోచన కూడా ఇందుకు దోహదం చేసింది.
వేల యేళ్ళ ఘన చరిత్ర ఉన్న తెలుగు భాష మరెన్నో వేల ఏళ్ళు
పరిపుష్టంగా నిలిచి ఉండేలా ఉద్యమ స్ఫూర్తితో
పాటుపడటానికి మనబడి ఒక సాధనం.
భాషాభిమానులు మా మనబడి ప్రయత్నానికి సంపూర్ణ సహకారాలు
అందిస్తారని ఆశిస్తున్నాం. తెలుగు పరిరక్షణా యజ్ఞంలో
మరింత మంది ముందుకు రావల్సినదిగా ఆహ్వానిస్తున్నాం.
భాషా
సేవయే భావితరాల సేవ అనే స్ఫూర్తితో అమెరికాలో
ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘మన బడి’ దిన దిన
ప్రవర్ధమానముతో 17 రాష్ట్రాలలో 2000 పైగా విద్యార్ధులు...400
మందికి పైగా ఉపాధ్యాయులతో తెలుగు విశ్వవిద్యాలయం
గుర్తింపుతో ముందుకు సాగుతూ నాలుగు సంవత్సరాలలో తెలుగు
భాషపై పట్టు సాధిస్తున్న చిన్నారులతో మాతృదేశానికి
దూరంగా ఉన్నా మాతృ భాష నేర్చుకునే విషయంలో ప్రపంచానికి
ఆదర్శంగా నిలుస్తున్నారు మన మనబడి విద్యార్ధులు. అతి
త్వరలో కువైట్, ఆస్ట్రేలియా వంటి దేశాలలో కూడా మనబడి
శాఖలు విస్తరించబోతున్నందుకు సంతోషంగా ఉన్నది.
మనబడి
పూర్తి వివరాల కొరకు దర్శించండి :
http://www.siliconandhra.org/manabadi
|