|
తెలుగుకు ప్రాచీన భాష హోదా లభించిన సందర్భంగా, మన భాష
ప్రాచీన భాష మాత్రమే కాదు ఒక ప్రపంచ భాషగా ఎదగాలన్న
తపనతో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేశాము. యూనికోడ్
కన్సార్టయం లో సభ్యత్వం తీసుకోవడమే కాక, కాలిఫోర్నియాలో
అంతర్జాతీయ తెలుగు అంతర్జాల సదస్సు నిర్వహించి, తెలుగు
భాష ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తరువాతి తరాలకు
చేరడానికి, మేథావులు, సాంకేతిక నిపుణులు, మంత్రివర్యులు,
ప్రభుత్వ అధికారులు, మీడియా అధినేతల సమక్షంలో
అంతర్జాలంలో వినియోగానికి కావాల్సిన అనేక చర్యలు
తీసుకుని, తీర్మానాలు చేశాము. సదస్సు జరిగిన నాలుగు
నెలలలోపే అంతర్జాలంలో తెలుగు భాష వినియోగానికి అనువుగా
ఉండే విధంగా 3 విశ్వరూప ఖతులు (యూనికోడ్ ఫాంట్స్)
సిలికానాంధ్ర ఆవిష్కరించింది. ఇటీవలే రాష్ట్ర
ప్రభుత్వంతో కలసి సిలికానాంధ్ర రెండవ అంతర్జాతీయ తెలుగు
అంతర్జాల సమావేశం విశాఖపట్నంలో నిర్వహించింది. ఈ
సందర్భంగా మరో 5 తెలుగు విశ్వరూప ఖతుల (యూనికోడ్
ఫాంట్స్)ను విడుదల చేసింది. ఇంతే కాక మరిన్ని తెలుగు
సాంకేతిక ఉపకరణాల అభివృద్దికి కృషి చేస్తోంది
సిలికానాంధ్ర.

తెలుగు ఖతులు (ఫాంట్లు) ఉచిత
దిగుమతికై ఇక్కడ క్లిక్ చేయండి
సిలికానాంధ్ర - విశ్వ తెలుగు అంతర్జాల వేదిక (GIFT)
వివరాలకు
ఇక్కడ క్లిక్ చేయండి
|
వ్యవస్థలు పేజీ |
|
|