మనబడి
మరో మైలు రాయిని అధిగమించిన సిలికానాంధ్ర మనబడి
తెలుగు బాషను ప్రాచీనభాష నుంచి ప్రపంచ భాషగా తీర్చిదిద్దాలనే లక్షంగా పనిచేస్తున్న సిలికానాంధ్ర మనబడి ఈ నెల 20 వ తేదీన నాలుగు వేల మంది పిల్లలకు తెలుగు నేర్పాలనే లక్ష్యాన్ని అధిగమించింది. సిలికానాంధ్ర మనబడి అమెరికా లోని నలభై రాష్ట్రాలలో మరియు 10 కి పైగా దేశాలలో 2007 నుంచి, తెలుగు తరగతులు నిర్వహిస్తున్నది. దాదాపు 700 మంది అంకిత భావంతో కూడిన భాషాసైనికుల నిస్వార్ధ సేవ, మనబడి మీదున్న నమ్మకంతో పిల్లల్ని బడికి పంపటానికి ప్రోత్సహిస్తున్న తల్లితండ్రులు, ఉత్సాహంతో తెలుగు నేర్చుకోవటానికి ముందుకొస్తున్న విద్యార్దులు ఈరోజున ఈమైలురాయిని అధిగామించటానికి ముఖ్యకారణమని సిలికానాంధ్ర మనబడి డీన్ రాజు చమర్తి తెలిపారు. ఈమధ్యనే కాలిఫోర్నియా రాష్ట్రం లోని ఫ్రీమాంట్ యూనిఫైడ్ స్కూల్ డిస్ట్రిక్ట్ బోర్డు వారు ఉన్నత పాటశాలలో ఎంచుకోవాల్సిన ప్రపంచ భాషలలో తెలుగును ఒకటిగా చేర్చి, సిలికానాంధ్ర మనబడి పాఠ్య ప్రణాళిక ద్వారా తెలుగు నేర్చుకొనే విద్యార్ధులకు ఆ గుర్తింపు ఇవ్వటానికి ఒప్పందం కుదుర్చుకోవటం జరిగిందని మనబడి ఆర్ధిక వ్యవహారాల అధికారి దీనబాబు కొండుభట్ల తెలిపారు.
ఈ విద్యా సంవత్సరానికి ప్రవేశములు పూర్తి అయినా, 4 నుంచి 6 సంవత్సరములు లోపు వయసుకల బాలబాలికలకు బాలబడి లో సంవత్సరం పొడుగునా చేరిపించే అవకాశం ఉందని, వివరాలకు http://manabadi.siliconandhra.org ని సందర్సించవలసినదిగా మనబడి విస్తరణ అభివృద్ధి అధికారి శరత్ వేట తెలిపారు.
మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)
|
|
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)