స్వాగతగీతం

డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ,



కొత్త కొత్త ఆశలతో
కోటి కోటి కాన్కలతో
వచ్చావా వత్సరమా!
నవభావసమన్వయమా !
కాలం ఒక కాంతిరేఖ
కాలం ఒక నవమయూఖ
వేగంగా రాగలహరి
వెళ్ళిపోయె గతవర్షం
పదిహేనుకు వినతిచేసి
భవితకు దారులను గీసి
మా ఆశలు పల్లవించి
ఆశయాల పంట పండి
రాబోయే కాలంలో
ఉజ్జ్వలించి ఉత్సహించి
మునుముందుకు నడిచేందుకు
నీ రాకే చంద్రరేఖ
స్వాగతమగుగాక నీకు
సదా సిరులు పండేందుకు
నీ తోడుగ నీ నీడగ
మా గమ్యం సాగుగాక !
మంగళతతి నిలుచుగాక!!


 



మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)