ఋజువర్తన
ఒద్దిరాజు శ్రీకాంత్
కలిమిలేముల్లో కష్టసుఖాల్లో
కాగితపు ప్రేమల్లో కపట జీవితాల్లో
తన ఉనికి కనుమరుగవక
మనగలిగే విద్యను నేర్పే
తొలిగురువై నిలుచును కాలం
వేచియున్న వానాకాలం వెనకెళ్ళిన నవవసంతం
వేసవిగాలుల నుంచి తప్పించగలేవు
మురిపించే ప్రతి శరత్తు ముసుగేసే హేమంతాలు
మోడుబారు శిశిరాన్నుంచి రక్షించగలేవు
ఋజువర్తన కాలం తీరు ఋతుధర్మం బట్టి మారు
ఈ రీతి ప్రతిజీవి బ్రతుకున సాగు
నరుడొక్కడే నడతలో వేరు
పరపీడనే అలవాటుగా మారి
ప్రతి సుఖమూ తానే కోరు
దయలేని దడగమారి
చెదబుట్టిన జీవుల తీరు
ఇతరుల తలరాతగ మారు
మిడిసిపడే సంపదగోరి
నేల విడిచి సామును జేయు
అలవి కాని అన ఆశల తేరు
అంత్యమున పాతాళము దోయు
ఆత్మశుద్ధి అసలే లేని
బుద్ధిజీవి లోకానికి హాని
గురుశరణం పొందగ రాదా
గుణమొక్కటి నేర్వగ రాదా
మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)
|
|
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)