నీవు వసించునట్టి ధరణీధరఖండము వెల్గుచుండునో
భావుకలోకనాయక!సభాహితవాఙ్మయసార్వభౌమ!నీ
జెఎవనమున్నతంబు సరసీరుహరీతి వికాసమొందు నీ
పావనకావ్యగుఛ్ఛములు పాపములన్ హరితింపజేసెడిన్!
నీవు హసించినన్ కవిత,నీవు పఠించిన కావ్యమాలయే
నీవు గమించినన్ కవిత,నీవు రచించినదెల్ల దృశ్యమై
కావగ నిల్చు నీ పృథివి,కారణజన్ముడవో కవీశ్వరా!
పూవనులన్ పికమ్ము వలె మూర్తినిగొన్టివి భూవనమ్ములో!
వచనము,పద్యమున్,లలితవాగ్రసధారలగేయమున్ భవ
ద్రుచిరపదావళిన్ దనరి రూపమునొందును దృశ్యకావ్యమై
ప్రచితచరిత్ర నీది,పరిభావితధీవిభవమ్ము నీది,నీ
యుచితసమన్వయప్రతిభకుధ్డృతి జేతు నమశ్శతంబులన్!
సకలధరాతలమ్మున విశాలయశస్సుల దీరి,పాలనో
త్సుకత జనాళి మెచ్చు వరదోర్బలమండితచక్రవర్తులున్
వికసితమోదతన్ నిను నివిష్టుని జేసి వరాసనమ్ముపై
ముకుళితహస్తులై నిలిచి పూజలుజేతురు కాన్కలిచ్చుచున్!
అభినవధాతవీవు, వరమందిన భాగ్యవిధాతవీవు, వా
గ్విభవవిజేతవీవు, నవగీర్మణి రాజవినీత భావనా
నిభ కవితా విలాస పరినిష్ఠిత దుర్గమశేముషీలస
ఛ్ఛుభరచనావిహారకృతిశోభితసత్కవిరాజశేఖరా!
మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)
|
|
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)