సుజననీయం
నిత్యనూతనం
- తాటిపాముల మృత్యుంజయుడు

సంపాదకవర్గం:

ప్రధాన సంపాదకులు:

తాటిపాముల మృత్యుంజయుడు

సంపాదక బృందం:

తమిరిశ జానకి

కస్తూరి ఫణిమాధవ్

చెన్నాప్రగడ కృష్ణ

కాల ప్రవాహంలో కొత్తనీరు వచ్చి పాతనీరును పారద్రోలుతుంది. ఈ నెలతో ఇంకొక్క సంవత్సరం ముగిసి మరొక్క సంవత్సరం మొదలౌతుంది. మళ్ళ్లీ తేదీలు, నెలల కొలత మొదలెడ్తాము. అసలు కాలం ఎప్పుడు పుట్టింది అనే ప్రశ్న వేసుకుంటే నిర్దుష్ఠమైన సమాధానం దొరక్కపోవచ్చు. నాకు మట్టుకు మాత్రం ఈ విశ్వంలో మొదటిసారిగా చలనం ప్రారంభమైనప్పుడు కాలాం పుట్టిందంటాను. అయితే, మానవుడు విజ్ఞానం సంపాదించి, కాలామానాన్ని ఏర్పరుచుకొని, ఇప్పటి విశ్వపరిస్థితిని అర్థం చేసుకొని, విశ్వం ఎలా ఆరంభమైనదో సూత్రాలు కనిపెట్టి, వెనక్కి వెళ్లి, అక్కడినుండి కాలాన్ని కొలవడం మొదలెట్టాడు. ఇదే అర్థాన్ని స్ఫురిస్తూ ఆరుద్ర 'శూన్యంలోంచి సూర్యుడు పుట్టి; సూర్యుడితో కాలం పుడితే; కాలం యొక్క జననకాలం గుణించండి; లెక్కపెట్టలేని సంవత్సరాలు లెక్కపెట్టండి ' అని 'త్వమేవాహం' లో అంటాడు. మరి, కాలం ఎలా అంతమౌతుంది? అన్న ప్రశ్నకు ఈ విశ్వంలో చలనం ఆగిపోయినప్పుడు అని సమాధానం చెప్పుకోవచ్చు.

 

మరి నిరంతరం చలించే ఈ విశ్వం ఎలా ఆగిపోతుంది అన్న ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం ఇంకా దొరకలేదని నేను అనుకుంటున్నాను. ఈ కాలం మన గాలానికి అంత సులభంగా దొరకదు కాబట్టి ఈ 'కాలం గొడవ 'ను అలా పక్కన పెట్టేద్దాం.

పైన కొత్తనీరు అని చెప్పుకున్నాం కదా! ఈ మాట 'సుజనరంజని 'కి కూడా వర్తిస్తుంది. 2016 నూతన సంవత్సరంలో సుజనరంజని అంతర్జాల మాసపత్రికకు కొత్తరూపు ఇవ్వాలని సిలికానాంధ్ర నాయకత్వం నిర్ణయించింది. కొత్త హంగులను దిద్దాలనుకొంటున్నది.

మరిన్ని వివరాలకు జనవరి/ఫిబ్రవరి సంచికలు చూడండి. కృతజ్ఞతలు!!

సవరణ:

గత మాసపు ప్రత్యేకసంచికలో ప్రచురించిన రంగనాయకమ్మ గారి రచనలు "తాత్పర్యంతో కూడిన వేమన పద్యాలు", మరియు "గేయం" ఆవిడ రచించిన "ఒకటవ తరగతి తెలుగువాచకం" నుండి తీసుకోబడ్డాయి అని గ్రహించగలరు. అలాగే, "ముప్పాళ" అని వారి ఇంటిపేరుగా ప్రచురించడం జరిగింది.కాని వారు ఇప్పుడు ఆ పేరును వాడటం లేదని ఒక పాఠకుడు, శ్రేయోభిలాషి మా దృష్టికి తీసుకొచ్చారు. ఈ తప్పిదాలకు క్షంతవ్యులం.

 

- తాటిపాముల మృత్యుంజయుడు

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)