సుజననీయం

మండే రెండు అగ్నికణాలు - 'శ్రీ' 'శ్రీ'

 

- తాటిపాముల మృత్యుంజయుడు

సంపాదకవర్గం:

ప్రధాన సంపాదకులు:
తాటిపాముల మృత్యుంజయుడు

సంపాదక బృందం:
తమిరిశ జానకి
కస్తూరి ఫణిమాధవ్
చన్నాప్రగడ కృష్ణ
 

'అందుకే సృష్టిస్తున్నాను, అధర్మనిధనం చేసే ఈ ఖడ్గాన్ని, కలంతో సృస్టిస్తున్న ఖడ్గం ఇది, జనంతో నిర్మిస్తున్న స్వర్గం ఇది...' అంటూ ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు కవితా వాఙ్మయంలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని రాయించుకున్నాడు మహాకవి శ్రీ శ్రీ. 'ప్రపంచంలోని బాధంతా శ్రీశ్రీది ' అన్న రీతిన ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను అలుపెలుగక కలంతో ఎదురించాడు. ఆయన రాసిన గేయాలు ప్రతి తెలుగువాడి నాలుకపై జీవించే ఉంటాయి. శ్రీశ్రీకి తెలుగుభాషంటే అత్యంత మమకారం. అభ్యుదయ కవితా యుగానికి ఆద్యుడైన శ్రీశ్రీ 'తిక్కన, వేమన, గురజాడ 'లను 'కవిత్రయం'గా పరిగణిస్తాడు.

ఏప్రిల్ 10 శ్రీశ్రీ జయంతి. ఈ సందర్భంలో శ్రీశ్రీ ఉపన్యసిస్తున్న వీడియోను 'జగమంత కుటుంబం'లో తప్పక చూడండి. కవితల్లో నిర్దయుడుగా, పదాల్లో కఠినంగా ప్రతిబింబించే శ్రీశ్రీ రూపంలో, గాత్రంలో ఎంతో సౌమ్యుడిగా కనిపిస్తాడు. 'తెలుగువాడి తెలివితేటలకు జై జై, తెలుగువాడు దేనికైనా సై సై, తెలుగువాడు నెదురువారు నై నై' అన్న శ్రీశ్రీకి వారసులమైనందుకు తెలుగువారందరూ గర్వపడాలి.

అలాగే, 'నిండార రాజు నిద్రించు నిద్రయు ఒకటే, అండనే బంటు నిద్ర అదియు నొకటే' అంటూ ప్రజాస్వామ్యాన్ని తన పదంలో వినిపించిన తెలుగు తొలి వాగ్గేయకారుడైన అన్నమాచార్యుని 607వ జయంత్యుత్సవం మే 23న ఘనంగా జరుగనున్నది. మరిన్ని వివరాలు 'ఈ మాసం సిలికానాంధ్ర 'లో చూడండి.

శుభం భూయాత్!


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)