శీర్షికలు
తెలుగు తేజోమూర్తులు
- ఈరంకి కామేశ్వర్
ఆర్ధిక వేత్త వేపా కామేశం
వేపాకామేశం గత నాలుగు సంవత్సరాలుగా భారత ఆర్ధికరంగానికి చక్కటి సేవలందిస్తూవస్తున్నారు. రిజర్వ్ బాంకు ఆఫ్ ఇండియా డెప్యూటి గవర్నర్‌గా, స్టేట్ బాంక్ ఆఫ్ ఇండియా అద్యక్షునిగా, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్సురెన్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ ముఖ్య సంచాలకుడిగా, సలహాదారుగా వ్యవహరించిన వేపాకామేశం భారతదేశపు ఆర్ధికవేత్తల్లో మేటిగా నిలిచారు.
ఇలా భారత ఆర్ధిక రంగానికి విశిష్ట సేవలు అందించిన తెలుగు తేజం వేపా కామేశం ప్రస్తుతం భారత ఆర్ధిక నేరాల దర్యాప్తు సంస్థ అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ దేశ ప్రయోజనాలు కాపాడుతున్నారు. ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్ మెంట్ అండ్ రిసర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ అధ్యక్షుడిగా అనేక మందిని తీర్చిదిద్దారు. దేశంలో ఉన్న దాదాపు 35 బిలియన్ల పాడైపోయిన నోట్లను చలామణీ లోంచి తీసి వేసి దేశానికి ప్రయోజనం చేకూర్చారు. దొంగ నోట్ల బెడదను చాలా మటుకూ అరికట్ట గలిగారు. బ్యాంకింగ్ క్షేత్రం, మానవ వనరుల క్షేత్రాంశాలలో ఎంతో చక్కటి సేవలందించారు. " ఆపరేషన్ క్లీన్ " పధకాన్ని విజయవంతం చేసారు.
మారక ద్రవ్యం, వినిమయం, వినియోగం, గ్రామీణ ప్రామాణ్యాలు, ఎగుమతి, దిగుమతి వినిమయం, ఇలా విభిన్న క్షేత్రాంశాలలో పనిచేస్తూ పలు కీలక మార్పులకు దోహద పడ్డారు.
మరో చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే - తెలుగు తేజం దువ్వూరి సుబ్బారావు గారు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా పనిచేశారు. అలానే మరో తెలుగు దిగ్గజం పద్మ విభూషణ్ డాక్టర్ యగా వేణుగోపాల రెడ్డి గారు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా వ్యవహరించారు. ఇలా ఎందరో అద్వీతీయ ఆర్ధిక వేత్తలను తెలుగు జాతి భారత దేశానికి అందించటం ఒక గొప్ప విశేషం.
1963 లో ఒక అధికారిగా స్టేట్ బ్యాంక్ లో చేరి నాలుగు దశాబ్దాల పాటు అంచలంచెలుగా ఎదిగి భారత దేశ అతి పెద్ద బ్యాంక్ - స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధ్యక్షకుడిగా పని చేశారు. ఆ తరువాత రిజర్వ్ బ్యాంక్ దెప్యూటి గవర్నర్ గా పనిచేసి, ద్రవ్యం (కరెన్సీ) క్షేత్రంలో విశిష్ట కృషి చేసారు. సింగపూర్, ఇంగ్లాండ్ దేశాలలో కూడా పనిచేసారు. నాబార్డ్ సంస్థలో కూడా సేవలను అందించారు. ఒకటి, రెండు, ఐదు రూపాయల నాణాలను ప్రవేశ పెట్టి కరెన్సీ నోట్ల ఇబ్బందులు, కొరత చాలా వరకూ తగ్గించారు.
కరెన్సీ అసలు నోట్లను నిర్ధారించే 48 యంత్రాలను మొదటగాప్రవేశపెట్టారు. ఇవి గంటకి అరవై వేల నోట్లు లెక్కించే సామర్ధం కలవి. అంతకు మునుపు మనిషిని పెట్టి రోజుకు మూడు వేల నోట్లు లెక్కించే వాళ్ళు. అంతే కాదు - 27 తునా తునకలు చేసే పరికరాలను అమర్చి మాసిపోయిన నోట్లను తొలగించారు. 3.28 బిలియన్ నోట్లను చలామణి లోకి తెచ్చి అన్ని కొరతలని రూపు మాపేరు.పోస్ట్ ఆఫీస్లు, సహకార బ్యాంక్ లను కూడా ఉపయోగించుకుని దేశంలో నాణాల కొరత లేకుండా చేసారు. అంతే కాదు ఖాతాదారుల నుండి వచ్చిన నాణాలను యంత్రాల ద్వారా లెక్కింప చేయించి, గంటల తరబడి చేసే పనిని నిమిషాలలోకి కుదించగలిగారు..
భారత ఆర్ధిక రంగానికి ఎన్నో విధాలుగా మహోన్నత సేవలను అందించిన మన తెలుగు తేజం వేపా కామేశం ఆర్ధిక రంగంలో అనేక సంస్కరణలను విజయవంతంగా ప్రవేశపెట్టారు. భారత ఆర్ధిక నేరాల దర్యాప్తుసంస్థ అధ్యక్షుడిగా పనిచేస్తున్న వేపా కామేశం హైదరాబాదు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా గౌరవ అధ్యాపకుడిగా కూడా సేవలందిస్తున్నారు. భావి భారత ఆర్ధికవేత్తలను తీర్చిదిద్దుతున్నారు.
***
మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)
|
|
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)