మనబడి

ఉత్తేజంగా సిలికానాంధ్ర మనబడి సాంస్కృతికోత్సవం















జనవరి 24, 25 తేదీల్లో బేఆరియాలో సిలికానాంధ్ర మనబడి 9వ సాంస్కృతికోత్సవం ఘనంగా నిర్వహించింది. మొదటిరోజు సన్నీవేల్ హిందూ దేవాలయం, రెండవరోజు లివర్ మోర్ శివవిష్ణు దేవాలయ సమావేశమందిరాల్లో కన్నుల పండుగగా జరిగిన కార్యక్రమాల్లో మిల్పీటస్, సాన్ హొసే, ఎవర్ గ్రీన్, క్యూపర్టినో, శాంటాక్లారా, ఫ్రీమాంట్, ప్లెసంటన్, ఫోస్టర్ సిటీ, ఫోల్సం, ట్రేసీ మరియు శాక్రమెంటో నగర పాఠశాలలనుండి 700 మంది విద్యార్థులు పాల్గొన్నారు. నాలుగు దఫాలుగా ఉదయం, మధ్యహ్నాం కొనసాగిన ఉత్సవాలు వేదప్రవచనంతో ప్రారంభమయ్యాయి. తదుపరి వివిధ పాఠశాలల విధ్యార్థులు, ఉపాధ్యాయులు జట్లుగా నడుస్తూ శోభాయాత్ర నిర్వహించారు. తాతయ్య, అమ్మమ్మ తరాల పెద్దల చేతులనుండి అమెరికాలో పనిచేస్తున్న తల్లితండ్రుల చేతుల మీదుగా మనబడి విద్యార్థులు 'తెలుగు భాషాజ్యోతి ' ని అందుకొన్నారు.

బలబడి, ప్రవేశం, ప్రసూనం, ప్రమోదం తరగ్తులు చదువుతున్న విద్యార్థులు తెలుగుభాషపై ఉన్న ఉత్సుకత, సంన్స్కృతిపై నున్న అవగాహనను చక్కగా ప్రదర్శించారు. తెలుగు సంప్రదాయ గాన, నృత్య, నాట్య, వాచికంలో ఉన్న మక్కువను చాటారు. చిట్టిపొట్టి పాటలు, దేశభక్తి గేయాలు అవలీలగా పాడుతూ శాస్త్రీయ సంగీతరీతులలో త్యాగయ్య, పురందరదాసు, అన్నమయ్య, కబీరుదాస్ కీర్తనలను రాగయుక్తంగా ఆలపించారు.

పురాణ గాథలు, స్వాతంత్ర్య ఉద్యమంలోని ఘట్టాలను, పరమానందయ్య శిష్యులు, తాతయ్య షష్టీపూర్తి, బాబోయ్ ఫేస్ బుక్ మొదలైన నాటికలను తగిన వేషధారణ, ఆహార్యంతో ప్రదర్శించి తమ నటనా చాపుణ్యాన్ని చాటారు. కృష్ణతులాభారం, మయసభలో దుర్యోధనుని పరాభవం మొదలైన ఘట్టాలను అవలీలగా నటించారు. వేమన, సుమతీ పద్యాలను స్పష్టమైన ఉచ్ఛారణతో చదివి తాత్పర్యాలను కూడా చెప్పారు.

అమెరికాలో ఏడు, ఎనిమిది తరగతులు చదువుతున్న పిల్లలే కార్యక్రమమంతా నిర్వహించటం విశేషమైతే రెండురోజులుగా ఏకధాటిగా జరిగిన అంశాల్లో ఒక్క ఆంగ్లపదమైన దొర్లక పోవడం తెలుగుభాషపై పిల్లలకు ఉన్న పట్టుకు చక్కటి నిదర్శనం.

అమెరికాలోని తెలుగు పిల్లలకు మాతృభాషను బోధించటానికి అవకాశం ఇస్తున్న తల్లిదండ్రులకు మనబడి కులపతి చమర్తి రాజు కృతజ్ఞతలు తెలిపారు. మనబడిలో చేరిన పిల్లలు తెలుగు భాషా సంస్కృతులే కాకుండా నాయకత్వ పటిమలను, ఇతరులతో కలిసి మెలిసి పనిచేసే మెళకువలను కూడా నేర్చుకుంటారని ముఖ్య కోశాధికారి కొండుభొట్ల దీనబాబు చెప్పారు. 2015 సంవత్సరమంతా అమెరికాలోని 15 రాస్ట్రాల్లో మనబడి
సాంస్కృతికోత్సవం జరుగుతుందని మనబడి పర్యవేక్షణాధికారి వేదుల స్నేహ తెలిపారు. మాతృభాష వెలకట్టలేని సంపద అని దానిని ఒక తరం నుండి ఇంకొక తరానికి అందిచాల్సిన బాధ్యతలో మనబడి పోషిస్తున్న పాత్ర అమూల్యమైనదని సిలికానాంధ్ర చైర్మన్ కూచిభొట్ల ఆనంద్ అన్నారు.

గుండ్లవల్లి వాణి, కాలేరు శిరీష సమన్వయకర్తలుగా నిర్వహించిన ఈ ఉత్సవం విజయవంతంగా ముగియటానికి సిలికానాంధ్ర కార్యవర్గం, సిలికానాంధ్ర సైనికులు, ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా తమ వంతు సేవలను అందించారు.


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)