శీర్షికలు

సంగీతరంజని-మాట-పాట

- శ్రీ మల్లాది నారాయణ శర్మ

సౌజన్యం: శ్రీమతి వై. రమాప్రభ, ప్రిన్సిపాల్, ఆంధ్రమహిళాసభ కాలేజి ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ మీడియా ఎడ్యుకేషన్



మా గురువుగారి వద్ద మేం శిక్షణ పొందనటువంటి కీర్తనలని మేం ఎలా పాడగలుగుతున్నాం అనేది ప్రశ్న. అంటే కొన్ని కీర్తనల శిక్షణ, గురుముఖంగా నేర్చుకున్నప్పుడు ఆరోహణ, అవరోహణ క్రమాన్ని, ఆరాగ మూర్ఛనని అర్థం చేసుకుని, శంకరాభరణం, కాంభోజి రాగాలను క్షుణ్ణంగా అర్థం చేసుకున్ననాడు, మిగిలినరాగాలు, మేళకర్త రాగాలు కానీ, జన్యరాగాలు కానీ సంచారాన్ని బట్టి ఏది అందంగా ఉంటుందీ, ఏ సంగతి అందంగా ప్రయోగం చేస్తే బాగుంటుందీ మొదలయినవి అవగాహన అవుతుంది. ’సంగతి సరసంగా ఉండాలి’ అన్నారు సద్గురు ్యాగరాజస్వామి. అనవసరమైనవి ఏమిటి? అవసరమైనవి ఏమిటి అంటే గ్రహ స్వరం, న్యాస స్వరం, అంశ స్వరం అని వాళ్ళు పేరు పెట్టిన కారణమది. అంటే ఏ స్వరం దగ్గరనుంచి మనం ఎత్తుకుంటే ఆ రాగం స్ఫుటంగా ఉంటుంది, శ్రావ్యంగా వినిపిస్తుంది? అనేది మనసుకు తెచ్చుకుని, ఆ అనుభవాన్ని జోడించుకుని కీర్తనకి, నోటేషన్ చూసుకుని మనకి నచ్చిన రీతిలో ప్రదర్శించాలి.

అది స్వంతం చేసుకోవాలి. అంతే కాని నా ఇష్టం వచ్చిన రీతిలో పాడేస్తాను అనుకుంటే సరి కాదు. అది అద్భుతంగా ఉంటుంది అనుకోడానికి లేదు. అది శ్రావ్యంగా ఉండాలి కదా! ప్రఖ్యాత గాత్ర సంగీత విద్వాంసులు ఓలేటి వెంకటేశ్వరులు గారు, బడే గులాం ఆలీఖాన్ పరమ గురువు ఆయనకి. ప్రత్యేకంగా ఆయన దర్శనం కోసం ఒకసారి మద్రాసు వెళ్ళి ఆయనతో భేటీ అయిన సందర్భంలో పాడినటువంటి ఓ రాగం, ఒక భజన (వారి భజనలంటే వీరికి ఇష్టం) ఆయన ముందు పాడి వినిపించారు. చివర్లో టుమ్రీలు, తరానాలు, పాడతారు కదా ఆయనవి ఈయన కంఠస్తం చేసి పాడి వినిపించారు. ’అచ్చంగా నాకు మల్లే పాడుతున్నావు, చాలా అద్భుతంగా ఉన్నాయని’ ఆయన మెచ్చుకున్న తర్వాత, ఈయన ఆందోళికలో ’రాగసుధారస’ అనుకుంటాను పాడి వినిపించారుట. ఏమిటీ ఆ మూర్ఛన ఒకసారి పాడు అని అడిగారట. సరిమపనిసా, సనిధామరిస అని పాడేసరికల్లా ఆయన చాలా బాగుందయ్యా అని, ఆ మూర్ఛనని మైండ్ లో పెట్టుకుని హిందూస్థానీ ఒరవడిలో బడే గులాం ఆలీఖాన్ ఆ రాగం పాడేసరికి ఓలేటి వారు మంత్రముగ్ధులయిపోయారట. అదేమిటి, మన రాగం ఈయన ఇంత అద్భుతంగా పాడుతున్నారు అని అంటే, సంచారాలు ఎవరికి అనుకూలంగా పాడుకునేది ప్రస్తారం. ప్రస్తారం కి ఉన్న స్పాన్ అటువంటిది. అది స్వరానికి అనుకూలమైనా, లయకి అనుకూలమైనా ప్రస్థార ప్రాణమని అంటూ ఉంటారు కదా?. తాను పాడిన ఆందోళిక రాగం ఒకసారి విని అంత అద్భుతంగా బడే గులాం ఆలీఖాన్ పాడేసరికి పరమానందభరితులయ్యారు ఓలేటి్ వెంకటేశ్వరులు.


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)