శీర్షికలు

పద్మశ్రీ డా. పుట్టపర్తి నారాయణాచార్యులు

- సరసతిపుట్ట


బహుభాషావేత్త, శతాధిక గ్రంధకర్త, వచన, గేయ, పద్య, కావ్య, విమర్శ, అనువాద, నవలా ప్రక్రియలలో ఆరితేరి -విశేష పాండిత్య పాటవాలని ప్రదర్శించి అపూర్వ గౌరవాన్నందుకున్న అసాధారణ వ్యక్తి - సరస్వతీ పుత్రులు డాక్టర్ శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు గారు.

తెలుగుతో పాటు - బ్రజ, అవధి, సంస్కృతం, కన్నడ, మాలయాళం, అరవం, ఫ్రెంచ్, లాటిన్, పెర్షియన్, అర్ధ మగధి, సౌరసేని, పాలి ఇత్యాధి పద్నాలుగు జాతీయ, అంతర్జాతీయ భాషలలు నేర్చినవారు. జన ప్రియ రామాయణంకి కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారం అందుకున్నారు. వీరి శ్రీనివాస ప్రబంధం కి భారతీయ భాషా పరిషత్ పురస్కారం లభించింది. యాబై కి పైగా కవితా సంకలనాలు విలువడించారు. ద్విపద కావ్యాలు కూడా రచించారు. ఏడు వేలకు పైగా సంగీత కృతులు ప్రకటించారు. విజయనగర సామ్రాజ్య ఇతిహాసం, సాహిత్యం క్షుణ్ణంగా ఎరిగిన దిట్ట. భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అందుకున్నారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి, శ్రీ కృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పట్టాలు అందుకున్నారు. పుట్టపర్తి నారాయణాచార్యులు వారి పేరు తెలియని తెలుగు వారు లేరు.

పన్నెండవ ఏట " పెనుగొండ లక్ష్మి " రచించారు. ఇదే, వారు విద్వాన్ పరీక్షలలో సాహిత్య పాట్యాంశంగా చదువుకున్నారు అన్న ఒక్క ఉదాహరణ చాలు - ఈ పుంగావ సరస్వతి ప్రజ్ఞా పాటవాలు చెప్పడానికి. పుట్టపర్తి వారు - తెలుగులో విద్వాన్, సంస్కృతంలో శిరోమణి.

చిన్నతనం నుండి తన పాండిత్య ప్రకర్షలను ప్రదర్శిస్తూ వచ్చారు. నారాయణాచార్యులు గారి ' శివతాండవం ' తెలుగు సంగీత సాహిత్యాలలో ప్రసిద్ధ గ్రంధమేకాక వారికి మిక్కిలి ఖ్యాతినార్జించి పెట్టింది. ఇది వారు ప్రొద్దుటూరులోని అగస్తేశ్వరాలయంలో రచానకృతి గావించారు. నారాయణాచార్యులు గారు సాంప్రదాయంగ శ్రీ వైష్నవులు ఐనా - శివతాండవం రచించి, శివ కేశవులు ఒక్కటే అని చాటారు. భాగవతుడు, భగవంతుడు, భాగవతం ఒకటే అని అభివర్ణించారు. ఇది నారాయణాచార్యుల వారి తాత్విక చినతా దృష్టిని చాటుతోంది.

ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకోవాలని ఆరాటపడుతూ ఉండేవారు. వారి ఈ తపనే వారి పాండిత్య ప్రకర్షలకి కారణభూతం అయ్యింది.

" మాది తిరుమల తాతాచార్యుల వంశమర్రా! " - అన్నపుడల్లా వారి కళ్ళలో ఓ కాంతి నిండిపోయేది. వారికి తమ తాతాచార్యుల వంశం మీద అంత మక్కువ ఉండేది.

బాల్యం, చదువు, సాహిత్య లోకంలోకి:

మార్చ్ 28, 1914 లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అనంతపురం జిల్లా పెనుగొండలోని చియ్యేడు గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. వీరి తండ్రి - పండితులు శ్రీ పుట్టపర్తి తిరుమల శ్రీనివాసాచార్య, తల్లి శ్రీమతి కొండమ్మ గారు. నారాయణాచార్యుల వారి లేత మనసును ప్రభావితం చేసిన వారు వారి తండ్రి గారు. నారాయణాచార్యులు వారి మతామహులు కాశీ పండితులు - సంస్కృతం నేర్చుకున్నారు. ఐదో సంవత్సరం లో తల్లిని కోల్పోయారు.

పినతల్లి వద్ద పెరిగారు. శ్రీ పుట్టపర్తి తిరుమల శ్రీనివాసాచార్య గారు పరమ సాహిత్య ప్రియులు. తెలుగు ప్రబంధాలు ఇంట్లోనే తండ్రి వద్ద చెప్పించుకున్నారు.. ఇంట్లో సాహిత్య చర్చలు జరుగుతూ ఉండేవి. అవి వీరి మీద మంచి ప్రభావం చూపించాయి. తండ్రి ఆసు కవిత్వం చెప్తూ ఉండేవారు. తిక్కన్న కవిత్వాన్ని ప్రేమించేవారు.

వీరి పితామహ బంధువులు, సుప్రసిద్ధ శ్రీ రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ గారి వద్ద ప్రాకృత భాష, సంగీత మెళకువులు నేర్చుకున్నారు. కపిలాస్థలం కృష్ణమాచార్యులు, డి టి తాతాచార్యులు గారి వద్ద సంస్కృతం నేర్చుకున్నారు. పక్కా హనుమంతాచార్యులు గారి దగ్గర సంగీత విద్యనభ్యసించారు. శ్రీమతి రంజకం మహాలక్ష్మమ్మ గారి వద్ద భరతనాట్యాభినయం నేర్చుకున్నారు. సంగీతం - పినతల్లి వద్ద నేర్చుకున్నారు. పెనుగొండలో పక్క హనుమంతాచార్యులు గారి వద్ద సరళీ స్వరాలు, రాగాలు నేర్చుకున్నారు. యాబై - అరవై కృతులు నేర్చుకున్నారు. విద్వాండులు కొక్కండ సుబ్రహ్మణ్యం వారి దగ్గర మరిన్ని కృతులు నేర్చుకున్నారు. తరువాత " ఐదు నూరు - ఆరు నూరు కృతులు నేర్చుకున్నాను " అని చెప్పారు. ఎందరో మహానుభావుల సంగీత కచేరీలకు వెళ్ళారు - స్రవణాందభరితులైయ్యారు.

సుందరం పిళ్ళై నాటకం కంపనీ లో - నాట్యం చేశేవారు. ఆడ వేషాలు వేసారు.

డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యులు గారి శతీమణి శ్రీమతి కనకమ్మ గారు. వీరికి ఐదుగురు ఆడ పిల్లలు ఒక కుమారుడు.

కొండల్లో, గుహల్లో నృత్యం సాధన చేస్తూ ఉండేవారు. కొంత కాలం నాట్య శాస్త్రం బాగా ఆకళించ్చుకున్న తరువాత, జనాల రగడతో నాట్యం వదిలేశారు. " దేకొరే, దేకొరే " అన్న జనం మాటలు గుచ్చుకుని ఆ బాద తట్టుకో లేక నృత్యం వదిలేశారు.

వృత్తి రిత్యా అధ్యాపకుడిగా పనిచేశారు. వీరి భాషలో కడప మాండలికం సుస్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది.

డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యులు గారు నిరాడంబర జీవి. మృదు భాషి. వీరి గురించి తెలియని సాహిత్య ప్రియులు లేరు. అన్ని భాషల తత్వం ఒకటే అన్నది వీరి వాచ. ఒక్కోసారి మనస్తాపం పడుతూవుండేవారు. " మద్రాసు వెళ్ళి వుంటే ఇంకా బాగుండేది. నిద్రా, తిండి దేవుడు ఇక్కడ (ప్రొద్దుటూరులో) ఏర్పాటు చేశారు " అని వ్యాఖ్యానించారు. తిరుపతి సంస్కృతం కాలేజిలో ' శిరోమణి ' పట్టా సాదించారు.

" శ్రీ వైష్ణవం మా ఇంట్లో ఉంది. వెంకటేశ్వర భక్తుడు. శ్రీ వైష్నవ సాంప్రదాయం నుండి వచ్చి శివ తాండవం రచన చేయడం అనూహ్యం. ఎంత శివ చింతన కలిగి ఉన్నారో చెప్పకనే తెలుస్తోంది " అని వారి కుమార్తె పుట్టపర్తి నాగపద్మిణి గారు అభివర్ణించారు.

సంగీత, సాహిత్య పదంలో:


పుట్టపర్తి నారాయణాచార్యులు గారు సంగీత, నాట్య, సాహిత్యంలో నిష్నాతులు. చక్కని సమన్వయం కలిగి ఉండేవారు. ఒక్క మాటలో చెప్పలంటే - పొంగావ సరవాతలు.

పుట్టపర్తి నారాయణాచార్యులు గారు తాత్వికుడు, దార్శనిక ధోరణి వారి జీవనం - అని బ్రహ్మశ్రీ శామవేదం షన్ముఖ శర్మ గారు వర్ణించారు. వైష్నవుడైనా వీరు " శివతాండవం " రచించి అంతా ఒక్కటే అని చాటిచెప్పారు. భాగవతుడు, భగవంతుడు, భాగవతం ఒకటే అని అభివర్ణించారు.

శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు గారు - రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ గారి దగ్గర సంగీత విద్యా రహస్యాలు నేర్చుకున్నారు. రాగ స్వరూపాలు, లక్షాణాలు నేర్చుకున్నారు. ఓ సందర్భంలో ఇలా సెలవిచ్చారు నారాయణాచార్యులు గారు - " సంగీతంలో అఖండ కృషి చేసి, సాహిత్యం ఎక్కువ కృషి చెయ్యని వారు అనంత కృష్ణ శర్మ గారైతే, సాహిత్యంలో ఎంతో కృషి చేసి, సంగీతంలో ఎక్కువ సాధన చేయలేక పోయనా" అని వ్యాఖ్యానించారు.

" అనంత కృష్ణ శర్మ గారి వద్ధ ఎన్నో రహస్యాలు నేర్చుకున్నాను; " ప్రతీ రోజు - వారింట్లోనే భోజనం చేస్తూ ఉండేవాడిని " అని ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. ఉదాహరణకి " జనక రాగం - ఏ ఏ లక్షణాలు ఉన్నాయి - ఇలాటి విషయాలు చర్చించుకునే వాళ్ళం " అని చెప్పారు. పుట్టపర్తి గారు సాహిత్య రసం ఎరిగిన వారు. ఉత్తరార్ధం ఏమిటో ఆయన మనసు విప్పి చెప్పారు.

పుట్టపర్తి నారాయణాచార్యులు గారికి వన్నె తెచ్చి పెట్టిన గ్రంధం " శివతాండవం". ' శివతాండవం' గ్రంధాన్ని మాత్రా చందస్సు లో వ్రాసారు. దీని వెనుక కొన్ని కారణాలున్నాయి. పుట్టపర్తి వారి మాటలలోనే చెప్పాలంటే - చాలా రచనలు గమకం ప్రక్రియలో ఉంటాయి. యతి, ప్రాసలకు తంటాలు పడుతూ ఉంటారు. కాని మాత్రా, చంపమాల, ఉత్పలమాలలో వ్రాసే అలవాటు నేడు తగ్గిపోయింది. అది సులభమైన పని కాదు. అందుకనే వారికి అది ప్రేరణ అయ్యింది.

సి నా రే ని తమ్ముడూ అని పిలుస్తూ ఉండేవారు నారాయణాచార్యులు గారు.

డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యులు గారు శతాధిక గ్రంధకర్త. పన్నెండవ ఏట " పెనుగొండ లక్ష్మి " రచించారు. ఇదే వారు విద్వాన్ పరీక్షలకు సాహిత్య పాట్యాంశంగా చదువుకున్నారు అన్న ఒక్క ఉదాహరణ చాలు వారి ప్రజ్ఞా పాటవాలు చెప్పడానికి.

కొన్ని రచనలు వెలుగు చూసాయి అంటే కొందరు సహాయం వల్లనే అని చెప్పవచ్చు. అపట్లో పి ఎల్ శంజీవరెడ్డి గారు - కడప కలెక్టర్ గా ఉన్నప్పుడు వారి ప్రోత్సాహంతో, మండలి వెంకట కృష్ణారావు గారి సహాయంతో ప్రభుత్వం రామాయణం రచనను విలువడించారు.

భాగవత సుధా లహరి (శ్రీమద్ భాగవతం మీద పద్మూడు వ్యాఖ్యాన సంకలనాలు)

సువర్ణ పత్రములు
సరస్వతీ సమ్హారం
అష్టాక్షరి కృతులు (ఏడు వేల పాటల సంకలనం)
భగవాన్ బుద్ధ
చెన్నకేశవ సుప్రభాతం
లీవ్స్ ఆఫ్ ద విండ్ (ఆంగ్ల రచన)
ది హీరో (ఆంగ్ల రచన)
పండరీ భాగవతం (ద్విపద కావ్యం)
పెనుగొండ లక్ష్మి
ప్రబంధ నాయికలు
సాక్షాత్కారం
స్మసానదీపం (మలయాళ అనువాధం)
తీరని బాకి (మలయాళ అనువాధం)
శివకర్నామౄతం (సంస్కృతం)
శివతాడవం
శిపాయి పితూరి
అగస్తేశ్వర సుప్రభాతం
మేఘదూతం
షాజి
త్యాగరాజ స్వామి సుప్రభాతం
విజయనగర సామాజిక చరిత్ర
శ్రీనివాస ప్రభంధం
వసుచరిత్ర సాహితీ సౌరభం
ప్రాకృత వ్యాస మంజరి
వ్యాస వాల్మీకం (వీరి రచనల సంకలనం)
త్రిపుటి
వరాహ పురాణం (ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమి ప్రకటన)
మల్లికార్జున సుప్రభాతం
ఏక వీర నవలను మళయాళంలోకి అనువధించారు.
తెలుగు తీర్ధులు


అవార్డులు - పురస్కారాలు:


భారత ప్రభుత్వ పద్మశ్రీ
సరస్వతీ పుత్ర
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్
శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్

 

డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యులు గారు సెప్టెంబర్ 1, 1990 లో స్వర్గస్తులైయ్యారు. " సరస్వతీ పుత్రునితో సంభాషణలు, మరపురాని మధుర గాధ " - వీరి మరణాంతం నారాయణాచార్యులు గారి మీద విలువడిన రచనాకృతి. వారికి జ్ఞానపీట్ పురస్కార గౌరవం దక్కక పోవడం తెలుగు సాహిత్యం దురద్రుష్టం అని కొందరి అభిప్రాయం. మేటి ఆణి మూత్యానికి ఆ ఘనత లబించలేదు - అని కొన్ని సభలలో వినిపిస్తూ ఉంటాయి. కానీ వారు, జన హృదయాలలో చిరకాలం ఉంటారు. ప్రజలు ఆయనకు ఇచ్చిన గౌరవం అటువంటింది. వీరిని స్పురించుకుంటూ - వీరి నిలువెత్తు శిలా విగ్రహాన్ని ప్రొద్దుటూరులో ఆవిష్కరించారు. వీరి జ్ఞాపకార్ధం పుట్టపర్తి నారాయణాచార్యులు సాహితీ పీఠం స్థాపించారు. 2013-14 లో వీరి శతజయంతోత్సవాలు జరుపుకుంటున్నారు. దూరదర్శన్ సప్తగిరి చానల్ లో శ్రీమతి సైలజా సుమన్, రమణ గారి ఆధ్వర్యంలో చక్కటి సభ నిర్వహించారు. అక్షర కళా తపస్వి ప్రజలు రానున్న కాలంలో కూడా తలుస్తూ ఉంటారు. ఆ తలంపే వారికి నీరాజనం.


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)