కవిత స్రవంతి
ఉపాసన
-డి. యస్. వెంకటేశ్వరులు
పదము లేరలేని వాడను
కవిత వ్రాయలేని వాడను
గు౦డె ఘోష చెప్పలేని వాడను
బ్రతుకు భారమై మిగిలిన వాడను
రోదనే అరణ్యరోదనగా
ఎదలోని వ్యధ జారెను జాలిగా
కన్నీటి తెరలలో మసక వెలుతురుగా
సాగెను పయనము ఒక కలగా
కల ఒక బ్రతుకుగా
బ్రతుకు ఒక జ్ఞాపికగా
వేణుగానముగా విశ్వమ౦తా ని౦డగా
దేహమే ఒక ఆలయముగా
గు౦డె ని౦డిన ఆత్మయే దైవముగా
అ౦తర్ముఖమైన జ్యోతి శూన్యముగా
సవికల్పముగా
నిఖిలమై నిశ్చలమై నిలిచేనుగా
పదము లేరలేని వాడను
కవిత వ్రాయలేని వాడను
గు౦డె ఘోష చెప్పలేని వాడను
నాదమై, నీనాదమై పోయిన వాడను
మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)
|
|
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)