కవితా స్రవంతి
అధముని తత్త్వం
- భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు

అసంతృప్తి అతని ఆరవప్రాణం,
ఆవేదన అతని అనంత గానం,
అలక, అతని గుండెగూటిలోని చిలక,
ద్వేషం అతని నీడ, దోషం అతని జాడ,
కోపం అతని రూపం, తాపం అతని ధూపం,
అసూయ అతని చెలియ,ఈర్ష్య అతని సఖియ,
కామం అతని ధామం, రామానికతను దూరం,
క్రోధం అతని నాదం, మదం అతని వేదం.
మోహం అతని దేహం, దురాశ అతని దాహం.
అతని కళ్ళనిండా కుళ్ళు, అతని ఆలోచననిండా తేళ్ళు.
అలక్ష్యమే అతని లక్ష్యం , అగమ్యమే అతని గమ్యం.
అలౌఖ్యమే అతనికికి శక్యం, అసౌఖ్యమే అతనికి ముఖ్యం.
నిర్లజ్జ అతని సెజ్జ, భోగమే అతని బొజ్జ.
అసమర్ధతే అతని అస్త్రం, అవివేకమే అతని శస్త్రం.
నిట్టూరుపు అతని నేర్పు, నిరాశ అతని శ్వాస.
చీకటి(అజ్ఞానం) అతని పెనిమిటి,
వెలుతురు(జ్ఞానం)తో అతనికి పనేమిటి?


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)