స్త్రీ జాతి, స్త్రీ జాతి, ఇది మన స్త్రీ జాతి|
స్త్రీ జాతి,స్త్రీ జాతి, ఇదే మన గొప్ప స్త్రీ జాతి||
సృష్టికి మూలం సర్వ శ్రేష్టి స్త్రీ|
వంశాభివృద్ధికీ మూలం సర్వాంతర్యామి స్త్రీ |
సంసారానికి మూలం సర్వ శక్తి స్త్రీ |
సుఖ సంతోషాలకు మూలం స్వర్ణ సుందరి స్త్రీ ||
స్త్రీ జాతి, స్త్రీ జాతి, ఇది మన స్త్రీ జాతి,
స్త్రీ జాతి,స్త్రీ జాతి, ఇదే మన గొప్ప స్త్రీ జాతి,
ఇల్లును కళకళలాడించేది అమ్మాయీ|
సోదరులను కలిపి ఉంచేది సోదరి|
తల్లి దండ్రులను కాపాడేది కూతురు|
అందరికి ఆనందము పంచేది వనిత |
స్త్రీ జాతి, స్త్రీ జాతి, ఇది మన స్త్రీ జాతి|
స్త్రీ జాతి,స్త్రీ జాతి, ఇదే మన గొప్ప స్త్రీ జాతి||
కళ్యాణానికి కావలసింది కన్య|
ఉత్సవాలకు మంగళం నిచ్చేది మహిళ|
పెళ్ళికి అందం పెళ్ళికూతురు |
వరుడుకి ఆనందం వధువు|
అందరికి సంతోష మిచ్చేది మగువ |
స్త్రీ జాతి, స్త్రీ జాతి, ఇది మన స్త్రీ జాతి|
స్త్రీ జాతి,స్త్రీ జాతి, ఇదే మన గొప్ప స్త్రీ జాతి||
పిల్లలను ప్రేమించేది తల్లి|
భర్తకు అనురాగం నిచ్చేది భార్య|
అత్తమామలను గౌరవించేది కోడలు|
కష్ట సుఖాల్లో తోడు నిచ్చేది భార్య|
ఇంటికి వెలుగు ఇల్లాలు||
స్త్రీ జాతి, స్త్రీ జాతి, ఇది మన స్త్రీ జాతి |
స్త్రీ జాతి,స్త్రీ జాతి, ఇదే మన గొప్ప స్త్రీ జాతి |
స్త్రీ జాతి,స్త్రీ జాతి, ఇదే మన గొప్ప స్త్రీ జాతి, స్త్రీ జాతి ||
(ఈ స్త్రీ జాతి గీతాన్ని ‘స్వర్గీయ దోముడాల సునంద’ గారికి అంకితం చేయబడింది)
మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)
|
|
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)