(సద్గుణాలు: 1. సత్యము, 2. ధర్మం, 3. అహింస, 4. దయ, 5. శాంతి, 6. స్నేహం)
తెలుగుబాల తెలుసుకో, సద్గుణాలు నేర్చుకో
దుర్గుణాలు తరుముకో, ప్రగతిపథం చేరుకో
సత్యమునే పలుకుమా, సభ్యతగా మెలుగుమా
అసత్యములు ఆడకుమా, అధమునిగా పెరగుకుమా
ధర్మాన్నే నడచుకో, దైవము నీవెంట నుండు
అధర్మాన్ని అణచివెయ్, దుర్మార్గం దులిపివెయ్
అహింసయే నీ మతము, అందరికి అదే హితము
హింస అనేది అసలొద్దు, కఠినంగా మారవద్దు
దయాగుణము విలసిల్లగ, ప్రేమ పంచిపెట్టు
నిర్దయగా నీవుండకు, పగను పెంచుకోకు
శాంతి సహనాలే, నీ జీవన పూబాటలు
అశాంతి అసహనం, నీ యెదపై తూటాలు
స్నేహ హస్తమందించు, పదిమందితొ కలిసుండు
శతృత్వం పెంచుకోకు, ఏకాకిగ మిగలొద్దు
సద్గుణాల నీ నడత, ఎదురులేని నీ భవిత
ఆదర్శం కావాలి, అందరికి నీ చరిత
మనబడిలో చదువుకో, మాతృభాష నేర్చుకో
మన సంస్కృతి వైభవాన్ని మధురంగా