శీర్షికలు - సంగీతరంజని
ఎన్నగా మనసుకు రాని - నీలాంబరి - త్యాగయ్య
- సేకరణ: డా. కోదాటి సాంబయ్య

నీలాంబరి జోల పాటలకూ, ఉయ్యాల పాటలకూ ప్రసిద్ధి చెందిన రాగం. శాంతము, మత్తు గొలిపే రాగం. ఈ రాగం వింటుంటే మన మనస్సులో పవిత్రత కలుగుతుంది.

షడ్జమం-చ. రిషభం-అం. గాంధారం-శుద్ధ మధ్యమం-పంచమం-చ.దైవతం- కా.నిషాదం.

ప ద నీ దా ప మ గ --ప్రయోగం లో కైశికి నిషాదం వస్తుంది. నీలాంబరి నీలాకాశం, లేదా నీలి రంగు వస్త్రం.

ఈ రాగం లో తరచుగా వినబడే రచనలు:

1. ఎన్నగా మనసుకు- త్యాగయ్య.
2. ఉయ్యాల లూగావయ్యా - "" ""
3.లాలి యూగవే "" ""
4. అంబా నీలయతాక్షి -- ముత్తుస్వామి దీక్షితులు.
5. బ్రోవవమ్మా - శ్యామశాస్త్రి .
6. తుగిదలే -- పురందర దాసు.
7. అంబా నీలాంబరి --తంజావూరు పొన్నయ్య పిళ్ళై .
8. మాధవ మామవ -- నారాయణ తీర్థులు.
9. మణి నూపుర ధారి -- ఊతుక్కోడు వేంకట సుబ్బయ్యర్.
10. శృంగార లహరి - లింగరాజ అరసు.

త్యాగయ్య పై పోతన కవిత్వ ప్రభావం చాలా ఉంది. చిన్నప్పుడు వారి తల్లి సీతమ్మ పాడిన భాగవత పద్యాలు, తండ్రి కాకర్ల రామబ్రహ్మం తో హరికథలకు వెళ్లి విన్న భాగవత ఘట్టాలు , వారి రచనల్లో తరచూ వస్తాయి. ఎన్నగా మనసుకు రాని కృతికి పోతన ' కమలాక్షు నర్చించు ...' పద్యం స్పూర్తి అని నా భావన.

సీ: కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీ నాధు వర్ణించు జిహ్వ జిహ్వ
సుర రక్షకుని జూచు చూడ్కులు చూడ్కులు, శేష సాయికి మొక్కు శిరము శిరము
విష్ణు నాకర్ణించు వీనులు వీనులు , మధువైరి దవిలిన మనం మనము
భగవంతు వలగొను పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి.

పల్లవి:

ఎన్నగ మనసుకు రాని పన్నగ శాయి సొగసు
పన్నుగ గనుగొనని కన్నులేలే కన్నేమిన్న లేలే

అనుపల్లవి:

మోహముతో నీల వారి వాహ కంటిని గేరిన
శ్రీహరిని గట్టుకొనని దేహ మేలే ఈ గేహ మేలే

చరణం: 1-

సరసిజ మల్లె తులసి విరజాజి పారిజాత
విరులచే బూజించని కరము లేలే ఈ కాపురము లేలే

చరణం: 2-

మాలిమితో త్యాగరాజు నేలిన రామమూర్తిని
లాలించి పొగడని నాలికేలే సూత్ర మాలి కేలే .

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)