అమ్మకు చిట్టితల్లిని
నాన్నకు పొట్టి తండ్రిని
అమ్మ నాన్నలె మాకు
అనురాగ దైవాలు
ఈ భువిలో అనురాగ దైవాలూ!
అమ్మ బడిలో పెరిగాము
నాన్న ఎదలో ఒరిగాము
అమ్మా, నాన్నలె మాకు
అనురాగ దైవాలూ!!
ఈ భువిలో అనురాగ దైవాలూ!
అమ్మకు చిట్టితల్లిని
నాన్నకు పొట్టి తండ్రిని
అమ్మ నాన్నలె మాకు
అనురాగ దైవాలు
ఈ భువిలో అనురాగ దైవాలూ!
అమ్మ బడిలో పెరిగాము
నాన్న ఎదలో ఒరిగాము
అమ్మా, నాన్నలె మాకు
అనురాగ దైవాలూ!!
ఈ భువిలో అనురాగ దైవాలూ!
అమ్మమాట వింటామూ
నాన్న మాటే చేస్తామూ
అమ్మా! నాన్నల మాటలె
మాకు ముత్యాల మూటలూ||
అమ్మ వెంటే నడిచామూ||
నాన్న వెంటే తిరిగామూ||
అమ్మా, నాన్నల నడకలె మాకు
రేపటి వెలుగు బాటలు||
అమ్మకంటితో చూస్తామూ
నాన్న చెవితో వింటాము
అమ్మానాన్నల మాటలే మాకు
భవితవ్యానికి బాటలు|
అమ్మ ఇచ్చింది మంచి మనసు
నాన్న ఇచ్చాడు మంచి చేత
అమ్మ, నాన్నల మనసు చేతలు మాకు
శ్రీరామ రక్ష, శ్రీరామరక్ష ||