కవితా స్రవంతి
నాకు తెలుసు
-ప్రతాప వెంకట సుబ్బారాయుడు

నాకు తెలుసు
ఇటుక ఇటుక పేరిస్తే గోడవుతుందని
ఆపై మంచి ఇల్లవుతుందని

నాకు తెలుసు
బిందువు బిందువు కలిస్తే నదవుతుందని
అన్నదాతలకు ఆలంబనగా నిలుస్తుందని

నాకు తెలుసు
ఇంతింతగా ఎదిగే మొక్క మానవుతుందని
జనావళికి కల్పవృక్షమవుతుందని

నాకు తెలుసు
వేన వేల తేనెటీగల సమిష్టి కృషే పుట్టతేనని
అది అందరకు పౌష్టికతని

నాకు తెలుసు
రోజూ వినే సుభాషితాలు.. హితోక్తులు వల్లెవేస్తూ అభ్యాసం చేస్తే
చక్కని నడివడిక సొంతమవుతుందని

నాకు తెలుసు
స్వయంకృషితో ఎదిగే మనిషి
ప్రచండభానుడితో సమానమని..జగతికి వెలుగవుతాడని!



మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)