కలం పట్టని రోజు లేదు
కమ్ముకొని వస్తున్న భావాలను
కమనీయంగా పట్టుకొని
రమణీయంగా రాయాలని
కాంక్షించడమే అనుక్షణం
కాంక్ష ఆకాంక్షగా మారింది
నవనవోజ్జ్వలంగా మనస్సులో చేరింది
అనుభూతిని ఆవిష్కరించేదాకా
మనస్సు ఊరుకోవడం లేదు
అందుకే ఆశ ఎంతో విలువైంది
అది మనిషిని ఎప్పుడూ
ముందుకు నడిపిస్తుంది
చిరకాలం జీవింపజేస్తుంది.
మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)
|
|
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)