కలంకారీ అనగా వెదురుతో చేసిన కలంతో సహజమైన రంగులనుఉపయోగించి వస్త్రాలపై బొమ్మలు చిత్రించే ఒక కళ. ఇది చిత్తూరుజిల్లా శ్రీకాళహస్తిలో పుట్టింది. ఈ విధానంలో వాడే రంగులు అన్నీ సహజసిద్ధమైన రంగులే (కూరగాయల నుంచి సేకరించినవి). ఇవి శరీరానికి ఏ విధమైన హానీ చేయవు.
కలంకారీ విధానంలో ఎక్కువగా రామాయణ , మహాభారత , శివ పురాణాలకు సంబంధించిన బొమ్మలు మరియు ప్రకృతి లోని చెట్లు , జంతువులు , పక్షుల బొమ్మలను చిత్రీకరిస్తారు.
చిత్రించే విధానం
మిక్కిలి ఓర్పుతో కలంకారీ అద్దకపు పరిశ్రమలో కళాకారులు ప్రదర్శించే అభిలాషలో, ఉత్సాహంలో వారి అర్పణభావం ప్రకటితమవుతుంది. మొట్టమొదట బట్టను కలంకారీ కళాకారుడు చిత్రించదలచిన కాన్వాసుగా తయారుచేసుకుంటాడు. దళసరిపాటి గాడా చేనేత బట్టను శుభ్రంగా ప్రవహిస్తున్న నీటిలో బట్టకు పెట్టిన గంజి, పిండి పోయేదాకా నాలుగైదుసార్లు శుభ్రం చేస్తారు. దీనిని శుభ్రం చేయడానికి సబ్బుగానీ, ఇతర డిటర్జెంట్లుగానీ ఉపయోగించరు. ఈవిధంగా శుభ్రం చేసిన బట్టను గేదె పాలు, కరక్కాయల రసంకలిపిన మిశ్రమంలో ముంచి ఎండలో ఆరబెడతారు. ఈవిధంగా ఆరబెట్టిన బట్ట ఇప్పుడు కలంకారీ అద్దకానికి సిద్ధమైంది. చింతబొగ్గుతో తయారైన బొగ్గు కణికెలతో ఈ బట్ట మీద భావానుగుణ్యంగా హస్తకళానైపుణ్యంతో చిత్రాలను చిత్రిస్తారు. ఈ చిత్రాలను అన్నభేది ద్రావణంతో సుడిచి చిత్రాలను చెరగని నల్లరంగుగా తయరుచేస్తారు. సుదీర్ఘమైన ఈ కలంకారీ విధానంలో ఇది మొదటిమెట్టు. ఈవిధంగా ఉతికి ఉడకబెట్టి చిత్రాలు గీసి పెయింటింగ్ వేసి ఎండబెట్టి కలంకారీ అద్దకపు బట్టను తయారుచేస్తారు కలాన్ని వ్రేళ్ళతో పట్టుకుంటాడు. కావలసిన రంగులో ముంచిన చిన్న గుడ్డనుగానీ, దూదినిగానీ, కలంలో పెట్టి వ్రేలితో నొక్కుతూ కావలసినంత రంగు ద్రవాన్ని కలం గుండా ప్రవహింపజేస్తూ పై రేఖా చిత్రాల మీద వర్ణం వేస్తాడు.
నేను ఈ చిత్రం లో అమ్మాయి బొమ్మను కలంకారీ చిత్రకళ లో చూపించుటకు ప్రయత్నించాను.
ఇందుకు గాను A4 size paper మరియు basic acrylic రంగులను ఉపయోగించాను.